Rana: దగ్గుబాటి వంటి బడా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో రానా దగ్గబాటి గుర్తించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తనదైన నటనతో స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రానా.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రానా.. ఇటీవల భీమ్లానాయక్‌తో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. రానా గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. రానా త్వరలోనే తండ్రి కాబోతున్నాడని, ఆయన భార్య మిహీకా ప్రెగ్నెంట్ అని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.. ఇటీవల ఓ ఫ్రెండ్ వెడ్డింగ్‌లో రానా-మిహికా దంపతులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈ ఫోటోల్లో మిహీకా కాస్త లావుగా కనిపిస్తుండటంతో.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్.. డైరెక్ట్‌గా మిహీకాను `మీరు ప్రెగ్నెంటా..?` అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆమె చెప్పిందంటే.. `నోనో మ్యారేజ్ వెయిట్` అంటూ రిప్లై ఇచ్చింది.
దాంతో మిహీకా గర్భవతి అంటూ వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయాయి. కాగా, 2020లో నెచ్చెలి మిహికను వివాహమాడాడు రానా. వీరిది ప్రేమ వివాహం. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కరోనా కారణంగా చాలా తక్కువ మందే వీరి పెళ్లికి హాజరు అయ్యారు.