Jabardasth Sai : బుల్లితెరపై దాదాపు 8 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమానికి లేనంత పాపులారిటీ జబర్దస్త్ కామెడీ షో కి ఉంది. ఈ షో రేటింగ్స్ ఏమాత్రం తగ్గకుండా కనీవినీ ఎరుగని రీతిలో బుల్లితెరపై రికార్డులను క్రియేట్ చేసే విధంగా ఎప్పటికప్పుడు జబర్దస్త్ నిర్వాహకులు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగానే డిజైన్ చేస్తున్నారు. ఈ కామెడీ షో అందరిని ఆకట్టుకునే విధంగా ఈ షో కొన్ని లవ్ ట్రాక్ లను నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ షో ద్వారా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్_సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ ను నడిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
తాజాగా జబర్దస్త్ టీంలో రష్మీ, సుధీర్ లకు పోటీగా ఈ మధ్యకాలంలో ఇమాన్యూయేల్ – వర్ష జంట బాగా పాపులర్ అయింది. జబర్దస్త్ హైపర్ ఆది టీమ్ ద్వారా షో లోకి ఎంట్రీ ఇచ్చిన “వర్ష” తన అందంతో, అందరిని ఆకట్టుకొని మంచి క్రేజ్ సంపాదించింది. అదేవిధంగా “పటాస్” షో ద్వారా జబర్దస్త్ లోకి వచ్చిన “ఇమ్మాన్యుయేల్” కూడా తక్కువ సమయంలోనే బెస్ట్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ షో ద్వారా ఫేమస్ అయిన ఇద్దరు కమెడియన్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపిస్తూ,అప్పుడప్పుడు వీరిద్దరి మధ్య హగ్స్, కిస్సులు వంటి సన్నివేశాలను చూపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
మరోవైపు జబర్దస్త్ కామెడీ షో లో కొందరు లేడీ గెటప్ లలో బాగా సీన్లను పండిస్తున్నారు. ఇందులో ఒకరైన సాయి అలియాస్ లేఖ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సాయిను యాంకర్ మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? లేక అబ్బాయిన? అని ప్రశ్నించగా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు అంటూ సమాధానం చెబుతూ.. జబర్దస్త్ కామెడీ షోలో మంచి పేరు సంపాదించుకున్న ఇమాన్యూయేల్ – వర్ష రిలేషన్ షిప్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే “ఇమాన్యూయేల్ నాకు మొగుడు”అని చెప్పగా.. అందుకు యాంకర్ అతనికి “వర్ష” ఉంది కదా అంటుంది. ఈ నేపథ్యంలోనే ఇమాన్యూయేల్ కు “నేను మొదటి భార్యను, వర్ష ఇమ్మానియేల్ కు రెండవ భార్య” అంటూ వారి రిలేషన్ షిప్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవన్నీ కేవలం స్కిట్ పరంగా మాత్రమే అంటూ సాయి చెప్పుకొచ్చాడు.