Megastar chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటన నైపుణ్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఎంతో మంది స్టార్ దర్శకుల కంట్లో పడిన చిరంజీవి హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తను చేసే డాన్స్లు అద్భుతమైన ఫైట్లతో కొత్తరకం హీరోయిజాన్ని చూపించిన చిరంజీవికి తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు.ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకోవడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. చిరంజీవి 42 ఏళ్ళ సినీ కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అయితే చిరంజీవికి మాత్రమే సాధ్యమైన రికార్డులను గురించి ఇక్కడ తెలుసుకుందాం…
1) బాలీవుడ్ అగ్రహీరో అమితాబచ్చన్ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్న సౌత్ హీరోగా చిరంజీవి రికార్డ్ సృష్టించాడు.
2)1990లోనే ఓక చిత్రానికిగాను 1.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనీ మరే హీరోకు సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
3)సౌత్ ఇండియా సినిమాలనుంచి ఆస్కార్ అవార్డుకు ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి హీరోగా చిరంజీవి నిలిచాడు.
4) ఘరానా మొగుడు చిత్రంతో పది కోట్ల రూపాయల షేర్ ను రాబట్టిన మొట్టమొదటి హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించాడు.
5) ఇంద్ర సినిమాతో 30 కోట్ల షేర్ ను రాబట్టిన హీరో చిరంజీవి.
6) గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి 3 సినిమాలు ఎంతో విజయవంతమై ఒకదానికొకటి పోటీపడి మరీ కలెక్షన్లను రాబట్టాయి.
7) తెలుగు ఇండస్ట్రీలో ఒకేసారి 5 బ్లాక్ బస్టర్ సినిమాలను దక్కించుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ హీరో బ్రేక్ చేయలేదు.
8) దేశవ్యాప్తంగా సినిమా రంగంలో ఏ హీరో తీసుకొని పారితోషకం మొదటిసారిగా ఏడు కోట్ల రూపాయలను చిరంజీవి తీసుకున్నారు.
9) చిరంజీవి నటించిన సినిమాలలో 7 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించాడు.
10) ఖైదీనెంబర్ 150 వంటి నాన్ బాహుబలి సినిమాలలో మొట్టమొదటిసారి 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది కూడా చిరంజీవి సినిమానే.