మహేష్ తన సినిమాల సక్సెస్‌పై ఆనందాన్ని ప్రదర్శించేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటారు. కానీ తన 25వ సినిమా `మహర్షి` సక్సెస్‌మీట్ సమయంలో తన ఆనందాన్ని అవధులు దాటి ప్రదర్శించాడు. “మహేష్ మాట్లాడుతూ డైరెక్టర్ వంశీ నా అభిమానులు, నాన్నగారి అభిమానులు `మహర్షి` రిలీజ్ తర్వాత కాలర్ ఎగరేసుకునేలాఈ సినిమా ఉంటుందని చెప్పాడు. వాళ్లు కాలర్ ఎగరేశారు.. ఇప్పుడు నేను కాలర్ ఎగరేస్తున్నాను“ అంటూ మహేష్ కాలర్ ఎగరేశాడు.
ఇంకా మహేష్ మాట్లాడుతూ “నేను క్రికెట్‌ను బాగా ఇష్టపడతాను. 2011 ఫైనల్లో ధోని సిక్స్ కొడితే ఎలాగైతే ఆనందం వేసిందో.. దిల్‌రాజు సినిమా చూసి సిక్సర్ అనగానే అంతే ఆనందమేసింది. అలాగే ప్రిన్స్, బాబు అని పిలిచే అశ్వినీదత్‌గారు చాలా ఆనందమేసినప్పుడు మాత్రమే మహేష్ అని పిలుస్తారు. ఆయనలా పిలవాలని నేను కూడా ఎదురుచూస్తుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. మూడు పెద్ద బ్యానర్స్ కాంబినేషన్ో నా 25వ సినిమా చేయడం గర్వంగా ఉంది“ అన్నారు.