ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక అద్భుతమైన ఘట్టం. అలాంటి పెళ్లి కోసం ప్రతి ఒక్కరు కలలు కంటారు. మా పెళ్లి ఇలా జరగాలి.. అలా జరగాలి.. అందరూ రావాలి.. మహారాణిలా తయారు అవ్వాలి.. ప్యాలస్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరగాలని అనుకోవటం విదితమే. ఉదయపూర్ కోటలో రేపు జరగబోతున్న నిహారిక కొణిదెల పెళ్లికి కూడా అలాంటివి ఉంటాయని అంచనా వేస్తుంటారు. అలా అనుకోవటంలో తప్పు లేదు. అయితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
పెళ్లితో ఒక్కటి అవుతున్న నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నగడ్డ వివాహం ఉదయపూర్ ప్యాలస్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి భారీగానే ఖర్చవుతుంది. అది ఎంతో తెలుసా అక్షరాల 30 లక్షలు నుంచి రూ. 60 లక్షలు.
https://www.wedmegood.com/ తెలిపిన వివరాల ప్రకారం ప్యాలస్ లో పెళ్లి చేసుకోవటానికి రూ. 30 లక్షలు నుంచి రూ. 60 లక్షలు ఖర్చవుతునదంట. పెళ్లికి, మూడు రోజులు ఉండటానికి రూ. 30 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇతరత్రా వాటి కోసం మనం అదనంగా డబ్బు కట్టాల్సి ఉంటుంది. సుమారు 150 మంది అతిథులు హాజరయ్యేందుకు వీలుగా ఉంటుంది.
ఈ ప్యాలస్ లో వీరి ఒక్కరి పెళ్లి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కూడా ఉదయపూర్ లోని ది ఒబేరాయ్ ఉదయ్ విల్లాస్ లోనే జరిగింది. మరికొందరు బాలీవుడ్ సినీతారల వివాహం కూడా ఈ ప్యాలస్ లోనే జరిగింది. లేక్ సిటీగా పేరుగాంచిన ఉదయ్ పూర్ లో సజ్జన్ గఢ్ కోట, కుంబల్ గఢ్ కోట, చిత్తోర్‌గఢ్ కోటతో పాటు ఇంకా చాలా కోటలు ఉన్నాయి.ఇలా రాయల్‌గా పెళ్ళి చేసుకొబోయే నిహారిక వివాహం కోసం అభిమానలు ఎదురుచూస్తున్నారు.