సినిమాని మించిన స్నేహితుడు లేడు

Share

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమాలో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్బాలకృష్ణల కలయికలో వస్తున్న ఎన్టీఆర్, రెండు భాగాలుగా తెరకెక్కింది, ఇందులోని మొదటి పార్ట్ కథానాయకుడు ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ వీడియో ప్రోమోని రిలీజ్ చేశారు. సినిమాని మించిన స్నేహితుడు లేడని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంది.
ఇది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బాలకృష్ణ వేంకటేశ్వరస్వామి గెటప్ లో ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ లో అచ్చం అన్నగారిలాగే కనిపించిన బాలయ్య, అందరినీ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ గా బాలకృష్ణ ఎలా కనిపిస్తాడో అనే అనుమానం ఉండేది కానీ ఈ ఒక పోస్టర్ తో అవన్నీ తీరిపోయాయని సినీ అభిమానులు అనుకుంటున్నారు.


Share

Related posts

సినిమాలు లేకపోయినా గాని ఆ రంగంలో తెగ డబ్బులు దండుకుంటున్నా హీరోయిన్ లు…!!

sekhar

Chiranjeevi: చిరంజీవితో రూమ్మేట్స్ తీసిన సినిమా.. ‘యముడికి మొగుడు’కు 33 ఏళ్లు

Muraliak

చమక్ చంద్ర డెసిషన్ తీసుకోవడంలో ఇంకా లేట్ చేస్తే అదే జరగనున్నదా?

Naina

Leave a Comment