Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో “ఖుషి” సినిమా ఓ మైలురాయి అని చెప్పవచ్చు. చిరంజీవి తమ్ముడిగా స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు విజయాల మీద విజయాలు సాధిస్తూ, ఎక్కడా కూడా చిరంజీవి షెడ్ తనపై పడకుండా ..జాగ్రత్త పడ్డారు. తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకుని మెగాభిమానుల లో తిరుగులేని హీరోగా వారి అభిమానాన్ని సంపాదించారు. ఆ విధంగా ఎదుగుతున్న పవన్..”ఖుషి” సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని.. అప్పట్లో చిరంజీవి..స్థాయి క్రేజ్ సాధించే పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఫ్లాపులు రావటంతో..పవన్ జోరు కాస్త తగ్గింది.
ఇదిలా ఉంటే “ఖుషి” సినిమాలో పవన్ కళ్యాణ్..కత్తి తో చేసిన విన్యాసాలు, ఫైటింగ్ లు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న “హరిహర వీరమల్లు” అనే సినిమా కోసం “ఖుషి” స్థాయిలో పవన్ కళ్యాణ్.. కత్తితో, భల్లెలతో.. మల్ల యుద్ధం తరహాలో అనేక ఫీట్లు సిల్వర్ స్క్రీన్ పై చేయటానికి భారీ స్థాయిలో కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సెట్టు లో పవన్ కళ్యాణ్ ట్రైనర్ తో చేస్తున్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో బయటపడ్డాయి.
ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ రీ ఎంట్రీ లో “సిద్దు సిద్ధార్థ రాయ్” మళ్లీ కం బ్యాక్..అంటూ పవన్ ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మొగలుల సామ్రాజ్యం కాలంనాటి సినిమా తరహాలో స్క్రిప్టు ఉండటంతో..కత్తితో యుద్ధాలు మరియు గుర్రపుస్వారీ లు .. పోరాట సన్నివేశాలు సినిమాకు హైలెట్ అయ్యే తరహాలో క్రిష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నట్లు ఫిలింనగర్ లో టాక్. పైగా ఖుషి సినిమా నిర్మాత ఏ ఎమ్ రత్నం..నిర్మిస్తున్న ఈ సినిమా పవన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా.