Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసి 2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రమైన `డేగ`లో అవకాశాన్ని అందుకుంది. కానీ, ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలీదు. ఆ తర్వాత `మిర్చి లాంటి కుర్రాడు` మూవీతో టాలీవుడ్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన `కంచె` మూవీతో గుర్తింపు పొందింది.
ఆ వెంటనే ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర ఇలా వరుస సినిమాలు చేసింది. కానీ, అవేమి ఆమె కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి. సరైన సక్సెస్ లేక అవకాశాలు కూడా తగ్గిపోతున్న తరుణంలో ప్రగ్యా జైస్వాల్‌కు `అఖండ` సినిమాలో బాలయ్య సరసన నటించే బంపర్ ఆఫర్ వరించింది.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా.. మరిన్ని ఆఫర్ల పట్టేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే అదిరిపోయే ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా కూడా బ్లాక్ శారీలో తన హాట్ అందాలను చూపిస్తూ కేక పెట్టించే విధంగా ఫొటోలకు పోజులిచ్చింది.
ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ప్రగ్యా లేటెస్ట్ పిక్స్ ను చూస్తే ఎవ్వరికైనా చెమటలు పట్టాల్సిందే. అంత అందంగా ఆమె ఆకట్టుకుంటోంది. మరి లేటెందుకు ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.