HBD NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు కావడంతో.. రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు భారీ ఎత్తున చేస్తున్నారు. అంతకుముందు రెండు సంవత్సరాలు సరిగ్గా కరోనా దేశంలో విలయ తాండవం చేస్తూ ఉన్న నేపథ్యంలో వేడుకలు చేయలేదు. అయితే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సాధారణ స్థితిలో రావటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్… నేడు భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు వేడుకలు చేస్తూ ఉన్నారు. పైగా “RRR” తో ఎన్టీఆర్ కి కూడా ఇండస్ట్రీ హిట్ రావడంతో.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… తారక్ కి ఎమోషనల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. సోదరుడు సహనటుడు స్నేహితుడు నువ్వు నాకు ఏమవుతారో వివరించడానికి నా దగ్గర పదాలు లేవు ఎన్టీఆర్. మనం కలిసి ఉన్న క్షణాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటా… హ్యాపీబర్తడే ఎన్టీఆర్ అని ఎమోషనల్ ట్వీట్ చెర్రీ చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇద్దరూ కూడా దాదాపు రెండు సంవత్సరాలపాటు “RRR” కోసం పని చేయడంతో.. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. “RRR” చూశాక చిరంజీవి కుటుంబ సభ్యులు నిజం గా ఇద్దరు అన్నదమ్ములు మాదిరిగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో రామ్ చరణ్ కూడా “RRR” ప్రీ రిలీజ్ వేడుకలో తారక్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సినిమా చేసిన శాటిస్ఫ్యాక్షన్ కన్న తారక్ తో మంచి బౌలింగ్ ఏర్పడింది దానికి గాను భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు.. చెర్రీ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో నేడు పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ పెట్టిన పోస్ట్.. పట్ల నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ కూడా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనశ్శాంతిగా.. జీవితం మొత్తం అనేక మంది అభిమానాన్ని ఎప్పుడూ సంపాదించుకునే రీతిలోనే.. ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అని అజయ్ దేవగన్ మెసేజ్ పెట్టారు.