డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయింది. ప్రారంభంలో సినిమాకి సంబంధించి చిరంజీవి లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఠామేస్త్రి తరహాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనువిందు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవితేజ షూటింగ్లో జాయిన్ అయినట్లు స్పెషల్ పోస్టర్ తో పాటు వీడియో కట్ చేసి తెలియజేయడం జరిగింది. వీడియోల రవితేజ తనదైన స్టైల్ లో కారు దిగి నడుచుకుంటూ… చిరంజీవి క్యారీ వ్యాన్ లోకి వెళ్లడం జరిగింది. శనివారం విడుదలైన ఈ రవితేజ జాయినింగ్ వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయింది. చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాలో రవితేజ నటిస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ రాకముందు రవితేజ.. చిరంజీవి నటించిన “అన్నయ్య” సినిమాలో తమ్ముడిగా చేయడం జరిగింది.
ఆ తర్వాత “శంకర్ దాదా జిందాబాద్” లో ఒక పాటలో అలా వచ్చి మెరుపులాగా వెళ్ళిపోతారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు చిరంజీవి సినిమాలో రవితేజ నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిరంజీవి సరసన హీరోయిన్ పాత్రలో శృతిహాసన్ నటించిన రవితేజ సరసన హీరోయిన్ పాత్రలో కేథరిన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.