Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా “గని” మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్ కిరణ్ కూరపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ పాత్ర చేయడానికి ప్రధాన కారణం బాబాయ్ పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమా అని ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో వరుణ్ కామెంట్లు చేయటంతో… “గని” చూడటానికి మెగా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో… చిన్న సినిమా మరియు కొత్త హీరోలను సైతం ఎంకరేజ్ చేసే విషయంలో చిరంజీవి చాలా చురుకుగా ఈమధ్య వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా చిరంజీవి హాజరవుతూ… కొత్త టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే వరుణ్ “గని” సినిమాని కూడా ఎంకరేజ్ చేయాలని చిరంజీవి చాలా ఉత్సాహంగా మొన్నటివరకు ఉండటం జరిగిందట. ఈ క్రమంలో సినిమా కోసం ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యారట.
అంతమాత్రమే కాదు నిర్మాత అల్లు బాబీతో కూడా చర్చించి.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని చిరంజీవి ఆదేశాలు ఇచ్చినట్లు కానీ ఆఖరి నిమిషంలో చిరంజీవి డ్రాప్ అయినట్లు లేటెస్ట్ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళితే గత ఆదివారం వరుణ్ తేజ్ చెల్లి నిహారిక..పబ్ ..లో దొరకటంతో పాటు డ్రగ్స్.. వార్తలు ఆమెపై రావటంతో చిరంజీవి “గని” సినిమాకి సంబంధించి ప్రమోషన్.. కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకోవటం జరిగిందట. ఎందుకంటే మీడియా ప్రతినిధులు ఖచ్చితంగా నిహారిక గురించి ప్రశ్నలు వేసే పరిస్థితి.. ఉండే అవకాశం ఉండటంతో.. చిరంజీవి డ్రాప్ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.