Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. “బాహుబలి 2” తో నేషనల్.. ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న డార్లింగ్.. ఆ తర్వాత స్టార్ డమ్ తగ్గ రీతిలో హిట్ కొత్త లేకపోయాడు. ప్రభాస్ “బాహుబలి2” తర్వాత చేసిన శాహో, రాధే శ్యామ్ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవడం కలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ప్రభాస్ అభిమానుల ఆశల మొత్తం “సలార్” పైనే ఉన్నాయి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ నీ షేక్ చేసి పడేసిన “కేజిఎఫ్” పార్ట్ వన్ పార్ట్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ సలార్ సినిమా కి డైరెక్టర్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా పేరు సంపాదించిన ప్రశాంత్ నీల్…దేశంలో ప్రపంచంలో తిరుగులేని మాస్ క్రేజ్ ఉన్న ప్రభాస్ నీ ఏ రీతిగా చూపిస్తాడు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.
ఇటువంటి తరుణంలో “సలార్” సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఓ ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ…. ఇండియన్ బాక్స్ ఆఫీస్ నీ గడగడ లాడించిన “కేజిఎఫ్ 2” సినిమాకి మూడింతలుగా “సలార్” ఉంటుందని తెలియజేశారు. హీరో ప్రభాస్ నీ ఇప్పటివరకు ఎప్పుడూ చూపించని రీతిలో చాలా పవర్ ఫుల్ గా… డైరెక్టర్ ప్రశాంత్ నీల్… చూపించడం జరిగింది అని.. ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు మర్చిపోలేని సినిమా అవుతుందని చెప్పుకొచ్చారు.