ప్రభాస్‌కి మీరు వీరాభిమానులా? ఆయన్ని ఎలాగైనా కలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆలస్యమెందుకు? అలాంటివారి కోసమే ప్రభాస్ ఓ వీడియో చేశారు. అంతేనా… `ఒక్క సెల్ఫీ డార్లింగ్స్` అంటూ తనదైన శైలిలో అడుగుతున్నారు. ఇంతకీ ప్రభాస్ సెల్ఫీ ఎందుకు అడుగుతున్నారు? సెల్ఫీ తీసుకోవడానికి, ప్రభాస్‌ను కలుసుకోవడానికి లంకె ఏంటి? అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయమంతా.
ప్రభాస్ హీరోగా యువీ క్రియేషన్స్ పతాకంపై సుజిత్ దర్శకత్వం వహించిన `సాహో` ఈ నెల 30న విడుదల కానుంది. నాలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రచారం దుమ్ములేస్తోంది. అందరి దగ్గరకూ వెళ్లి తన సినిమాను ప్రచారం చేసుకుంటున్న ప్రభాస్ అభిమానులను నిర్లక్ష్యం చేయకూడదని అనుకున్నారు. అందుకే తన అభిమానులు `సాహో` పోస్టర్ ఎక్కడున్నా సరే,దాని పక్కన నిలుచుని ఓ సెల్ఫీ తీసుకుని, తన ఇన్‌స్టా ఖాతాకు జత చేస్తే, నచ్చిన వారిని సెలక్ట్ చేసి, వాళ్లతో సెల్ఫీ తీసుకోవడానికి అనుమతిచ్చారు.
సో ప్రభాస్ స్వయంగా చెప్పారు కాబట్టి, ఎంపికైన అభిమానులకు సెల్పీ గ్యారంటీ అన్నమాట.
previous post
next post