చి.ల.సౌతో డీసెంట్ హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ వెంటనే నాగార్జున హీరోగా రూపొందిన మన్మథుడు 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత రాహుల్ ఏ సినిమాను డైరెక్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ రాలేదు కానీ.. సినీ వర్గాల సమాచారం మేర ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు రెండో తనయుడు అభిరాంను హీరోగా పరియం చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకు వేరే దర్శకులతో కూడా సురేశ్ బాబు ఇలాంటి చర్చలనే జరిపినట్లు సమాచారం. కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా రాహుల్‌తో అభిరామ్ కోసం సురేశ్ బాబు డిస్కస్ చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై సురేశ్ బాబు అండ్ కో ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.
previous post
next post