Sukumar: రంగస్థలం vs పుష్ప అని కొట్టుకొచ్చేస్తోన్న అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఝలక్ ఇచ్చిన సుకుమార్ !

Share

Sukumar: పుష్ప: ది రైజ్ పార్ట్ 1 రిలీజైయ్యాక ఒకవైపు రాం చరణ్ ఫ్యాన్స్, ఒకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా హీరో సినిమా గొప్ప అంటే మా హీరో సినిమా గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఈ రెండు తీసిన దర్శకుడు సుకుమార్ మాత్రం ఇద్దరి అభిమానుల కామెంట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన పుష్ప పార్ట్ 1 తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. హిందీలో ఇప్పటి వరకు దాదాపు 80 కోట్లు రాబట్టినట్టు వార్తలు వచ్చాయి.
ఇక మిగతా నాలుగు సౌత్ భాషల్లో మాత్రమే పుష్ప పార్ట్-1 ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెలలోపే ఈ సినిమా ఓటీటీకి రావడం ఆశ్చర్యకరం.

Sukumar gave shock to allu arjun ram charan

ఇక పుష్ప సినిమాకు అన్నీ భాషలలోని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో రాం చరణ్ అభిమానులు ఆసక్తికరమైన చర్చలు జరుపుతున్నారు. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలను కంపేర్ చేస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఇదే అని.. చరణ్ ఫ్యాన్స్ – అల్లు అర్ అర్జున్ ఫ్యాన్స్ వాదించుకుంటున్నారట. చెవిటి వాడు చిట్టిబాబు పాత్రలో చాలా కష్టమైన పాత్రలో చరణ్ మెప్పించారని తన ఫ్యాన్స్.. రక రకాల వేరియేషన్స్ ఉన్న పుష్పరాజ్ లాంటి మాస్ పాత్రలో అల్లు అర్జున్ మెప్పించారని అంటున్నారు.

Sukumar: అది రంగస్థలం సీక్వెలా కాదా ఇప్పుడే చెప్పను.

అయితే ఎవరి పాత్రల్లో వారు అద్భుతంగా నటించారని దర్శకుడు సుకుమార్ చెప్పారు. అంతేకాదు ఇద్దరికిద్దరూ బెస్ట్ పర్ఫార్మెన్సర్స్ అని ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఎవరి అభిమానులు అభిప్రాయపడటం సరికాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నాను. ఆ తర్వాత చరణ్‌తో మరోసారి సినిమా చేస్తాను. అది రంగస్థలం సీక్వెలా కాదా ఇప్పుడే చెప్పను. కానీ అంతకు మించి ఉంటుంది అని మాత్రం చెప్పగలను అంటూ అభిమానుల కోల్డ్ వార్‌కు చెక్
పెట్టారు సుకుమార్. కాగా, పుష్ప పార్ట్ 2 వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు రాబోతోంది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

37 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago