మిల్కీ బ్యూటీ హీరోయిన్ తమన్నా చాలా వరకు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ కేరియర్ కొనసాగిస్తూ ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “F3” లో వెంకీ సరసన హీరోయిన్ గా ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో తమన్నా అవకాశమందుకున్నట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజిని కొత్త సినిమా చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాకి “జైలర్” అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ లో ఓ భారీ సెట్టింగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తదుపరి షెడ్యూల్ లో రజిని కాంత్ తో తమన్నా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానున్నట్లు టాక్. వరుస పరాజయాలలో ఉన్న రజిని “జైలర్” సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ రజిని ఫ్యాన్స్ మాత్రం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంపై డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఇటీవల విజయ్ తో చేసిన “బిస్ట్” దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయింది.
ఈ క్రమంలో నెల్సన్ దిలీప్ కుమార్.. తమ అభిమాన హీరో సినిమా ఏం చేస్తాడో అన్న ఆందోళనలో రజిని ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తమన్నా తెలుగులో ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. చాలావరకు సీనియర్ హీరోల సరసన తమన్నా అవకాశాలు అందుకుంటూ ఉంది. సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్లో ఓ స్టూడియోలో భారీ జైల్ సెట్టింగ్ ఈ సినిమాకి వేయడం జరిగింది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.