టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా తరుణ్…. చిన్ననాటి నుండే అదరగొట్టే ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడం జరిగింది. “ఆదిత్య 369” సినిమాలో తరుణ్ నటనకు అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పలువురి దిగ్గజ నటులు నుండి అనేక ప్రశంసలు దక్కాయి. అలా చూస్తూ ఉండగానే కుర్రవాడిగా ఎదిగిపోయి “నువ్వేకావాలి” సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు.
తర్వాత వరుస అవకాశాలు అందుకుని తెలుగు సినిమా రంగంలో లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకుని…. వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత వరుస ఫ్లాపులు రావటంతో అవకాశాలు తగ్గిపోవడంతో సినిమాలకు దూరమయ్యాడు తరుణ్. ఇదే తరుణంలో ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు విషయంలో పేరు బయటకు రావడంతో అప్పట్లో వార్తల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు. ఇదిలా ఉండగా త్వరలో తరుణ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్న టు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.
పూర్తి మేటర్ లోకి వెళ్తే తరుణ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఆ మధ్య చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత కొన్ని సినిమాలతో రియల్ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా పని కాలేదు. కాగా మరొక సినిమాతో అయినా ప్రేక్షకులను అలరించి తిరిగి ఫామ్ లోకి రావాలని తరుణ్ అనుకుంటున్నాడట. పరిస్థితి ఇలా ఉండగా త్వరలో తరుణ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది.