Thaman: డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి విదితమే. ట్రైలర్స్ – సాంగ్స్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు కాస్త మిశ్రమ స్పందనకు గురైంది. విజువల్ ట్రీట్ అంటూనే స్లోగా సాగుతూ బోర్ కొట్టించిందనే కామెంట్స్ బయట వినబడ్డాయి. ‘బాహుబలి‘ ‘సాహో’ వంటి సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలో యాక్షన్ లేకపోవడం ముఖ్యంగా ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచిందని భోగట్టా. అయితే ఒక ఫ్యూర్ లవ్ స్టొరీని చెప్పే క్రమంలో ఫైట్స్ పెట్టడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో ‘రాధేశ్యామ్’ మేకర్స్ యాక్షన్ ని జోడించలేదనే వాదన వినబడుతోంది.
Thaman: S.S థమన్ అందుకే ఇపుడు టాలీవుడ్లో నెం.1 అయ్యాడు!
Thaman: SS థమన్ బాణి ఇదే..
ఎవరేమన్నా SS థమన్ మాత్రం సినిమాని ఆకాశానికెత్తేస్తున్నాడు. ‘రాధేశ్యామ్’ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన SS థమన్ ఈ విషయంలో డైరెక్టర్ కు మద్దతుగా నిలిచారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఒక లవ్ స్టోరీ చేయడానికి ఎంతో గట్స్ కావాలన్నారు. ”రాధేశ్యామ్ సినిమా లవ్ జోనర్ లో రూపొందింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలను ఎలా ఆశించగలం. మీరు చాక్లెట్ లో ఆవకాయ్ అడిగితే ఎలా ఉంటుంది? ఇది చాక్లెట్ లాంటి స్వీట్ ఫిలిం. దీన్ని ఇలానే ఆస్వాదించాలి అంటూ థమన్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
Thaman: బాలీవుడ్ సినిమాలు ఎందుకు చేయటం లేదో కారణం చెప్పిన తమన్..!!
ట్రోలర్స్ vs థమన్?
సోషల్ మీడియాలో ‘రాధేశ్యామ్’ పై వస్తున్న నెగెటివిటీని థమన్ తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా సినిమా స్లోగా ఉందన్నవాళ్లకు కౌంటరిచ్చేలా ఉన్న ఓ మీమ్ ను ట్విటర్ లో షేర్ చేశాడు. ‘సినిమా ఎలా ఉంది?’ అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. ‘నేను అడిగింది బాగుందా? బాలేదా? అని.. లవ్ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ నైట్.. సెకండాఫ్ లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటి?’ అనే మీమ్ ని మీడియంగా చేసుకొని థమన్ ట్రోలర్స్ పై రెచ్చిపోయాడు. అయితే దీనికి ట్రోలర్స్ ‘మీమ్ అదిరింది.. స్లో అంట.. నువ్వు పరిగెత్తాల్సింది’ అంటూ థమన్ పై ట్రోలర్స్ సెటైర్ వేయడం మనం చూసాం. ఏదేమైనా ప్రభాస్ సినిమాకు థమన్ అందించిన నేపథ్య సంగీతానికి మంచి మార్కులే పడ్డాయి.