NewsOrbit
Entertainment News సినిమా

IPL 2023: తెలుగు పాటలతో దద్దరిల్లిన ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుక..!!

Share

IPL 2023: నిన్న ఐపీఎల్ సీజన్ 16 స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై మధ్య జరగగా… గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ టీం హోమ్ గ్రౌండ్ అయినా గాని దాదాపు 70 శాతం చెన్నై అభిమానులతో.. ఆడియన్స్ గ్యాలరీ మొత్తం పసుపుమయమయ్యింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు కొనసాగింది. చివరి వరకు పోరాడిన చెన్నై ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

The opening ceremony of IPL was resounding with Telugu songs

తెలుగు పాటలతో దద్దరిల్లిపోయింది. RRR, పుష్ప సినిమాలలో పాటలకు రష్మిక మందన… తమన్నా డాన్స్ వేశారు. ఆస్కార్ అవార్డు గెలిచిన నాటు నాటు సాంగ్ కి.. రష్మిక స్టెప్పులకు స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఇంకా “పుష్ప” సినిమాలో భారీ హిట్ సాంగ్స్ కి కూడా డాన్స్ వేయడం జరిగింది. ప్రారంభోత్సవ వేడుకలో రష్మిక మరియు తమన్నా లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కార్యక్రమం ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.

The opening ceremony of IPL was resounding with Telugu songs

ఒకప్పుడు దేశంలో పెద్దపెద్ద ఈవెంట్ లకు బాలీవుడ్ సాంగ్స్ మాత్రమే వినబడేవి. కానీ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ టైం నడుస్తోంది. పైగా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఆస్కార్ కూడా తెలుగు సినిమా సాంగ్ “నాటు నాటు” గెలవడం జరిగింది. RRR, బాహుబలి 2, పుష్ప సినిమాలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా… సత్తా చాటాయి. దేశంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ మరియు క్రేజ్ సంపాదించాయి. ఈ పరిణామాలతో ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ పేరు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా పేరు మారుమోగుతుంది. బీసీసీఐ లాంటి దిగ్గజ సంస్థల సైతం ఐపీఎల్ లో తెలుగు పాటలకు ప్రాధాన్యత ఇవ్వటం విశేషం.


Share

Related posts

అంచనాలు పెంచుతున్న మంచు విష్ణు – కాజల్ అగర్వాల్ ల మోసగాళ్ళు ..!

GRK

Oscars 2023: ప్రపంచ ఆస్కార్ వేదికపై చరిత్ర సృష్టించిన రామ్ చరణ్, ఎన్టీఆర్..!!

sekhar

బిగ్ బాస్ 4 : హౌస్ లోకి పవన్ కల్యాణ్ వీరాభిమాని రాబోతున్నాడు .. ఇక అరాచకమే ..!

GRK