పాపులర్ వెబ్ IMDB(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) గురించి సినీ ప్రియులకి తెలిసే ఉంటుంది. అందులో చోటు దక్కితే ఆ సినిమాకి ఉండే క్రేజ్ మామ్మూలుగా ఉండదు. తాజాగా IMDB 2022 ప్రథమార్ధంలో టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలన చిత్రాల లిస్ట్ విడుదల చేసింది. ఇందులో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మరియు MX ప్లేయర్ వెబ్ సిరీస్ ‘క్యాంపస్ డైరీస్’ అగ్ర స్థానంలో నిలిచాయి. 2022 ఉత్తమ సినిమాల జాబితాలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఈ సంవత్సరం ఆశ్చర్యకరంగా టాప్ పొజిషన్ సొంతం చేసుకోవడం విశేషమే.
RRR స్థానం ఏమిటి?
ఇకపోతే దక్షిణాది నుండి పీరియాడికల్ డ్రామాలుగా తెరకెక్కిన K.G.F: చాప్టర్ 2 మరియు S.S.రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రాలు 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. అలాగే కమల్ హాసన్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’తో అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అలాగే అమితాబ్ బచ్చన్ నే’ఝుండ్’ మరియు అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’.. అజయ్ దేవగన్ దర్శకత్వం వహించిన ‘రన్ వే 34’.. సినిమాలు 5వ స్థానాన్ని అధిరోహించాయి. అలాగే యామీ గౌతమ్ – నేహా ధూపియా ప్రధాన పాత్రల్లో నటించిన డిస్నీ+ హాట్ స్టార్ చిత్రం ‘ఏ థర్స్ డే’.. సినిమా కూడా ఈ లిస్టులో వుంది.
టాప్ 10 లిస్టులో మిగతావి ఇవే…
ఇక మలయాళం రొమాంటిక్ డ్రామా అయినటువంటి ‘హృదయం’ సినిమా కూడా టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం. సదరు సినిమాల వసూళ్లు.. ఇతర గణాంకాలని పరిగణనలోకి తీసుకోని విమర్శకుల నుండి వచ్చిన సమీక్షలు.. ర్యాంకింగ్ ల ఆధారంగా కాకుండా IMDB భారతదేశంలోని IMDB వినియోగదారుల పేజీ వీక్షణలపై IMDBPro డేటాను తీసుకుంటుంది. ఇకపోతే భారతదేశ అంతరిక్ష మార్గదర్శకులు హోమీ జె. భాభా… విక్రమ్ సారాభాయ్ ల కథను తెలిపే ‘రాకెట్ బాయ్స్’ జాబితాలో 3వ స్థానంలో ఉండటం విశేషం. అలాగే పంచాయత్-హ్యూమన్-యే కాళీ కాళీ అంఖీన్-అఫరాన్-ఎస్కేప్ లైవ్-మై-ది ఫేమ్ గేమ్ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.