SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అతడు కలేజా రెండు సినిమాలు వచ్చాయి. రెండు కూడా మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ థియేటర్లలో ఈ సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు టెలివిజన్లో ప్రసారమైతే టీఆర్పి రేటింగ్లలో ఇప్పటికి కూడా రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. రెండు సినిమాలలో మహేష్ బాబుని చాలా కొత్తగా గతంలో లేని రీతిలో చూపించారు. అతడులో సైలెంట్ మహేష్ బాబుని చూపించగా ఖలేజాలో మొట్టమొదటిసారి మహేష్ బాబులో ఉన్న కామెడీ హ్యూమర్… త్రివిక్రమ్ బయటికి తీయడం జరిగింది.
ఖలేజా తర్వాత మహేష్.. ఆ తరహాలోనే కామెడీ చేస్తూ “దూకుడు”… ఇంకా పలు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నారు. దీంతో ఇప్పుడు వస్తున్న మూడో సినిమాలో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఏ విధంగా చూపిస్తాడు అన్నది అభిమానులలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నాటి నుండి అనేక అవరోధాలు ఎదురుకోవటం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయగా మొదటి షెడ్యూల్ అక్టోబర్ నెలలో ప్రారంభించాల్సి వచ్చింది. ఈ మధ్యలో మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించడంతోపాటు హీరోయిన్ పూజ హెగ్డే కాలికి గాయం కావడంతో… చాలావరకు షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది.
ఈ క్రమంలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయబోతుండగా సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో… నవంబర్ నెలలో ప్రారంభం కావలసిన షూటింగ్ జనవరి సంక్రాంతి తర్వాత ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూడో షెడ్యూల్ షూటింగ్ కి సినిమా యూనిట్ రెడీ అయిందట. విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి 27వ తారీకు నుంచి మూడో షెడ్యూల్ స్టార్ట్ కానుందట. ఈ షెడ్యూల్ లో మరో హీరోయిన్ శ్రీ లీల జాయిన్ కానుందట. ఇటీవల మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. సెకండ్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు తోపాటు హీరోయిన్ పూజా హెగ్డే పై కొన్ని సన్నివేశాలు షూట్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ శ్రీ లీల పై కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.