NewsOrbit
5th ఎస్టేట్

ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగి పోయేదాకా వీరంతా నిద్రపోయేలా లేరు..!

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు మనశ్శాంతి అన్నదే లేకుండా పోయింది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూ ఉంటే ఆయనకు రాజకీయంగా కూడా తలనొప్పులు మొదలయ్యాయి. ఏపీలో జగన్ కు మాదిరిగానే కర్ణాటకలో ఆయన పై కూడా సొంత అధికార పార్టీ నేతల నుంచి అతి తీవ్ర అసంతృప్తి ఎదురవుతోంది. ఇక మరొక పక్క చూసే కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు 10,000 దాటాయి. ఇక పార్టీ హైకమాండ్ నుండి ఏదైనా సహకారం ఉంటుంది అంటే.. అదీ కూడా పెద్దగా లేదు సరి కదా ఇంకా అతని పరిస్థితిని క్లిష్టతరం చేస్తోంది. నేపథ్యంలో యడ్యురప్ప కుర్చీకి ముహూర్తం మూడింది అన్న టాక్ వినిపిస్తోంది.

 

 

Karnataka: Numbers Beyond Him, Yeddyurappa Resigns as CM Before ...

 

తాజాగా బిజెపి పార్టీ సీనియర్ నేత ఉమేష్ కత్తి మరొకసారి యడ్యూరప్పపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరగాల్సిందేనని కత్తి డిమాండ్ చేశారు. తాను కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అర్హుడినేనని సంచలన ప్రకటన చేసిన ఉమేష్ కత్తి అలా కాని పక్షంలో ఉత్తర కర్ణాటకకు చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ముఖ్యమంత్రికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయని అభిప్రాయపడిన కత్తి…. యడ్యూరప్ప ను నేరుగా టార్గెట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. నాయకత్వ మార్పిడి కోసం కత్తి తో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉండడంతో ఇప్పుడు యడ్యూరప్పను ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది.

ఇదిలా ఉండగా ఎడ్యూరప్ప కూడా పాలనా పరంగా ఎన్నో తడబాట్లుకు లోనవుతూ వారికి అనేక అవకాశాలు ఇస్తున్నారు. ఆయన కుమారుడు రాఘవేంద్ర యొక్క జోక్యం పాలన వ్యవహారాల్లో ఎక్కువగా ఉందని మరియు అదే చివరికి యడ్యూరప్ప చావుకు వచ్చిందన్న వార్తలు నిన్నమొన్నటివరకు వినిపించాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో అధిష్టానం తనకు అనుకూలమైన వారిని నియమించుకుంది. ఇంకా యడ్యూరప్ప చెప్పిన వారికి రాజ్యసభ ఎన్నికల్లో టికెట్లు దక్కలేదు. దీనితో అతని నాయకత్వానికి స్వస్తి చెప్పేదాకా ఎవరూ శాంతించేలా లేరు అని అర్థమవుతుంది.

అటు హైకమాండ్ నుండి అతనికి పూర్తిగా మద్దతు కరువు అవగాపార్టీలోని కీలక నేతలు కూడా ఇప్పుడు యడ్యూరప్పను లైట్ తీసుకుంటున్నారు. పుండు మీద కారం లాగా.. సంక్షోభం ఉన్న సమయంలో ఎడ్యూరప్ప ప్రభుత్వ కుంభకోణానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు కూడా ఇప్పుడు అతనిని సీఎం కుర్చీ కి మరింత దూరం చేస్తున్నాయి.

వలస కార్మికులు పేరిట కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన్ పీఏసీ విచారణలో వెల్లడి అయింది. రాష్ట్రంలో 1.25 లక్షల మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వారిలో సగం మంది పేర్లు కూడా లిస్టు లేకపోవడంతో ఇది భారీ కుంభకోణం గా విపక్షాలు విమర్శలు దిగి బిజెపి పార్టీలో అసమ్మతి చలరేగేలా చేశాయి. ఇక అంతా కలిసి సంక్షోభ సమయంలోనే యడ్యూరప్ప పై తీవ్రమైన ఒత్తిడి చేసి అతనిని గద్దె దింపే పథకాలు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. మరి యడ్యూరప్ప తన అనుభవాన్ని అంతా ఉపయోగించి పరిస్థితి నుంచి గట్టెక్కుతారో లేదో చూడాలి.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau