NewsOrbit
5th ఎస్టేట్

‘మహా’ దారుణంగా ముంబై నగరం .. కించిత్ కూడా భయం లేదు…! 

తమ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్నా వారు మాత్రం మినహాయింపులకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ విషయమై తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. దేశంలో మొదటి నుండి మహారాష్ట్ర అత్యధిక కేసులతో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉంది. ఇక ప్రధానంగా మార్కజ్ నుండి వచ్చిన వారి నుండి మరియు వలస కార్మికుల నుండి వ్యాధి ప్రబలినట్లు అధికారులు గుర్తించారు .అంతేకాకుండా విదేశీయులు ఎక్కువగా ముంబై మహానగరానికి విచ్చేసినందువల్ల కూడా వ్యాధి తీవ్రత పెరిగి ఉండవచ్చు అని వారు అంచనాలు వేస్తున్నారు.

 

Mumbai seals borders with major suburbs to contain COVID-19 spread

అయితే సడలింపుల విషయంలో మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య మాదిరిగానే అందరికన్నా ముందు ఉంది అనే చెప్పాలి. గత ఆదివారం నుండి సెలూన్లకు మరియు బ్యూటీ పార్లర్ల కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక విపక్షాల అయితే గగ్గోలు పెడుతుండగా నిర్ణయం కాస్తా తీవ్రం వివాదంగా మారింది. మహారాష్ట్రలో రాజకీయ నేతల నుండి పోలీసుల వరకు అందరూ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో అసలు కరోనా వ్యాధి ఎక్కువగా ఉండే మరియు సామాజిక దూరం ఏమాత్రం పాటించడానికి వీళ్ళేని చోటులకు అనుమతిని ఇవ్వడం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇదిలా ఉండగా మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఐదు లక్షలు దాటితే ఒక్క మహారాష్ట్రలోని 1.65 లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో మరణాల సంఖ్య 15 వేల వరకు ఉంటే మహారాష్ట్రలో 7000 అనగా దాదాపు 50 శాతం మరణాలు సంభవించడం గమనార్హం. ఇక దేశంలో నమోదైన కేసులు ఎక్కువ శాతం మహారాష్ట్రంలోని ఉండడం మనం గమనిస్తూ ఉండగా పరిస్థితుల్లో నెల 30 తేదీ తర్వాత కూడా లాక్ డౌన్ కంటిన్యూ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అయితే నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తెరుచుకుంటూ వెళ్తుంటే…. లాక్ డౌన్ అన్న పదానికి అర్థం ఏమిటి ఉంటుందని అందరూ అతని ప్రశ్నిస్తున్నారు.

దానికి తగ్గట్టు మహారాష్ట్ర ప్రజలకు మరియు మరీ ముఖ్యంగా ముంబై వాసుకు కొంచెం కూడా ఏం కూడా జాగ్రత్త లేకుండాపోయింది అనే చెప్పాలి. మినహాయింపులు ఉన్నాయి కదా అని అయిన దానికి కాని దానికి వచ్చి రోడ్లమీద విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇక యువకులు అయితే తమకు సోకినా ఏమీ కాదు అన్న ధైర్యంతోనో ఏమో కానీ అసలు ఎలాంటి అవసరం లేకుండా రోడ్లపైకి వచ్చి గుంపులు గుంపులు గా ఉంటున్నారు.

ముంబయి నగరంలోనే దాదాపు ఎనభై వేలు కేసులు దాకా నమోదయ్యాయి. వాణిజ్య రాజధాని ముంబయి కరోనాతో వణుకుతుండటం, మహారాష్ట్ర ప్రభుత్వం వరస మినహాయింపులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. మరి మహారాష్ట్ర కోరనా నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau