NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Sunil-Anushka Shetty: సునీల్-అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

Sunil-Anushka Shetty: సౌత్ స్టార్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒక‌రు. సూపర్ మూవీతో కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ల చెంత చేరింది. టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అనుష్క తన లాంగ్ కెరీర్ లో చాలా చిత్రాలు రిజెక్ట్ చేసింది. అలా రిజెక్ట్ అయిన వాటిలో సునీల్ సూపర్ హిట్ మూవీ కూడా ఉందని మీకు తెలుసా..? అవును మీరు విన్న‌ది నిజమే. అనుష్క మరియు సునీల్ కాంబినేషన్ లో ఓ హిట్‌ మూవీ మిస్ అయింది. ఆ సినిమా ఏంటి..? ఎందుకు అనుస్క రిజెక్ట్ చేసింది..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సునీల్ ఒకరు. భీమవరంలో జన్మించిన సునీల్ మొదట డాన్సర్ కావాలని అనుకున్నాడు. కానీ తన స్నేహితుడు మరియు ప్రముఖ దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2000 సంవత్సరంలో తరుణ్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలి చిత్రంతో సునీల్ తొలిసారి వెండితెర‌పై మెరిశాడు. ఈ చిత్రంలో తరుణ్ ఫ్రెండ్ గా సునీల్ నటించి మెప్పించాడు. నువ్వే కావాలి చిత్రం హిట్ అవ్వడమే కాకుండా సునీల్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో సునీల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను పరుగులు పెట్టించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఏడాదికి 15కి పైగా చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. కామెడియ‌న్ గా దూసుకుపోతున్న తరుణంలోనే అందాల రాముడు చిత్రంలో సునీల్ కు హీరోగా చేసే అవకాశం వచ్చింది. లక్ష్మి నారాయణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. 2006లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గానే కొనసాగుతున్న సునీల్ కు రాజమౌళి మర్యాద రామన్నలో నటించి అవకాశం ఇచ్చారు.

ఇందులో స‌లోని సునీల్ కు జోడీగా న‌టించింది. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ కు ఫ‌స్ట్ ఛాయిస్ స‌లోని కాదు. మొద‌ట రాజ‌మౌళి అనుష్కను తీసుకోవాల‌ని భావించాడ‌ట‌. ఇందులో భాగంగానే అనుష్క‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె క‌మెడియ‌న్ స‌ర‌స‌న న‌టించేందుకు ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి త్రిష‌ను కాంటాక్ట్ అయ్యాడు. కానీ త్రిష నుంచి కూడా అదే స‌మాధానం వ‌చ్చింది. ఫైన‌ల్ గా స‌లోనిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

2010లో విడుద‌లైన మ‌ర్యాద రామ‌న్న చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. సునీల్ కు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత సునీల్ హీరోగా వ‌రుస చిత్రాలు చేశాడు. కానీ సునీల్ హీరోగా ఎక్కువ కాలం నిలుదొక్కుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈయన విలన్ గా మరియు సహాయక నటుడిగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్వూలో పాల్గొన్న సునీల్‌.. హీరోయిన్ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను కమెడియన్ కాబట్టి త‌న‌తో నటించేందుకు కొంతమంది హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపేవారు కాద‌ని.. చాలా మంది త‌న సినిమాల‌ను రిజెక్ట్ చేశార‌ని సునీల్ తెలిపారు. అలాగే మ‌ర్యాద రామ‌న్న మూవీని అనుష్క‌, త్రిష రిజెక్ట్ చేశార‌ని కూడా సునీల్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నాడు.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N