NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: ప్రియాంక, శోభ లలై భోలే భార్య సీరియస్ వ్యాఖ్యలు..!!

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మరికొద్ది వారాలలో ఆఖరి ఘట్టానికి చేరుకోనుంది. ప్రస్తుతం 11వ వారం ఆట సాగుతోంది. హౌస్ లో 10 మంది మిగిలారు. మొత్తం 19 మంది ఎంట్రీ ఇవ్వగా.. 9 మంది ఎలిమినేట్ అయ్యారు. రతిక ఎలిమినేట్ అయ్యి మళ్లీ హౌస్ లోకి రావడం జరిగింది. పదవ వారం భోలే ఎలిమినేట్ కావటం తెలిసిందే. వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే.. హౌస్ లో ఉన్నంతకాలం అందరిని ఆకట్టుకున్నాడు. తన మాటలు పాటలతో ఎంతో అలరించాడు. ఇదే సమయంలో హౌస్ లో తనని టార్గెట్ చేసిన వారిని కూడా పంచ్ డైలాగులతో సరైన కౌంటర్లు ఇచ్చేవాడు.

Priyanka Shobha Lalai Bhole wife serious comments

భోలేకి నామినేషన్ సమయంలో ఎక్కువగా శోభా శెట్టి, ప్రియాంకాలతో గొడవ జరుగుతూ ఉండేది. ముగ్గురి మధ్య మాటల తూటాలు గట్టిగా పేలేవి. ఇదిలా ఉంటే తాజాగా భోలే భార్య షావలి.. ప్రియాంక శోభ లపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన భర్త భోలేనీ హౌస్ లో ఆ ఇద్దరు చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. భోలే ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకునే రకం కాదు. ఏదైనా పాటల రూపంలోనే రియాక్ట్ అవడం ఆయనకు అలవాటు. అయితే నా భర్త బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శోభ దారుణంగా మాట్లాడి తక్కువ చేసి చూసింది. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో నా భర్త బట్టల గురించి శోభా నోటికొచ్చినట్లు మాట్లాడింది. నీ బట్టలు చూస్తేనే నీ గురించి అర్థమవుతుందని కామెంట్స్ చేయడం జరిగింది.

Priyanka Shobha Lalai Bhole wife serious comments

ప్రియాంక కూడా ఒకానొక సమయంలో తూ అని కూడా అనేసింది. ఆరోజు వాళ్ల మాటలు విని మేమంతా చాలా బాధపడ్డామంటూ..భోలే భార్య ఇంటర్వ్యూలో తెలిపింది. అన్ని మాటలు అన్న నా భర్త చాలా సహనంగా ఉన్నాడు. పైగా ఆ రోజు రాత్రి ఆ ఇద్దరు కంటెస్టెంట్లకు భోలే సారీ చెప్పాలని ప్రయత్నించగా శోభ మళ్లీ సీరియస్ అయింది నిన్ను చూస్తుంటే చిరాకు అనిపిస్తుంది అంటూ దారుణంగా మాట్లాడింది. ఆ తర్వాత ఏదో ఒక కారణం చెబుతూ ప్రతిసారి మా ఆయనను నామినేట్ చేసింది. ప్రియాంక శోభా శెట్టి ఇద్దరికీ అహంకారం ఎక్కువ అంటూ భోలే భార్య సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.


Share

Related posts

Brahmamudi అక్టోబర్ 21 ఎపిసోడ్ 233: ఆ ప్రశ్న వేసి అంతా చెడగొట్టిన రాజ్.. రేపటికి సూపర్ ట్విస్ట్..

bharani jella

Anjali: అప్పుడు బ‌న్నీ, ఇప్పుడు నితిన్.. మ‌ళ్లీ ఆ ప‌ని చేయ‌బోతున్న అంజ‌లి!

kavya N

Krishna Mukunda Murari: అందరి మురారికి ప్రపోజ్ ముకుంద చేస్తానని ఛాలెంజ్.. కంగారులో రేవతి..

bharani jella