Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ సీరియల్ విజయవంతంగా కొనసాగుతూ రీసెంట్ గానే వంద ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది.లేటెస్ట్ గా జరిగిన ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అంటే కావ్య మరియు రాజ్ మాట్లాడుకుంటూ ‘రాజ్ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి’ అని కావ్య ని అడుగుతాడు.ఏమిటది అని కావ్య అడగగా రాజ్ మాట్లాడుతూ ‘మీ అక్క స్వప్న లాంటి మనిషి ఈ ఇంటికి రాకూడదు, అది నాకు ఇష్టం లేదు’ అంటాడు రాజ్. రాహుల్ లాంటి వ్యక్తిని ప్రేమించినందుకు మా అక్క ఈ ఇంటికి కోడలిగా రాక తప్పదు అని అంటుంది కావ్య. అప్పుడు రాజ్ నువ్వు మాట ఇచ్చేసావ్, తప్పితే ఊరుకోను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. మరో పక్క స్వప్న కి ఇంట్లో తల్లితండ్రులు పెళ్లి సంబంధం చూస్తారు. పెళ్లి వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు.

అప్పుడు స్వప్న ఎలా అయినా ఈ సంబంధం ని చెడగొట్టుకోవాలి అనే ఉద్దేశ్యం తో తన ఫోన్ నుండి సంబంధం కోసం వచ్చిన వాళ్లకి ఒక మెసేజి చేస్తుంది. ఆ మెసేజి లో ఏమి ఉంటుందంటే ‘ఈ అమ్మాయి పెళ్లి పీటల నుండి పారిపోయి వచ్చిన మనిషి.అలాంటి అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, కావాలంటే వీధిలో ఎవరినైనా అడగండి చెప్తారు’ అని కావ్య తన ఫోన్ నుండి దొంగచాటుగా పెళ్లికొడుక్కి పంపుతుంది. ఆ మెసేజి చూసిన తర్వాత పెళ్లి కొడుకు తండ్రి ‘ఏమిటి ఈ మోసం..మీ అమ్మాయి ఇంతకు ముందు పెళ్లి పీటల మీద నుండి లేచిపోయిందా’ అని అడుగుతాడు.’ఇలాంటి అమ్మాయిని మాకు కట్టబెట్టాలని చూస్తావా..ఇందుకే మమల్ని అంత తొందర పెట్టావు ‘ అంటూ సంబంధం తెచ్చిన మీనాక్షి ని చివాట్లు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు.పెళ్లి సంబంధం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినందుకు ఏడుస్తున్నట్టు నటిస్తూ తన గదిలోకి వెళ్తుంది స్వప్న.

మరోపక్క కావ్య కళ్యాణ్ తో ‘మా అక్క రాహుల్ ని గుడ్డిగా నమ్మేసింది..ఇప్పుడు నేను ఏమి చెప్పినా నమ్మడం లేదు’ అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ స్వప్నకి జరుగుతున్న విషయాలేవీ తెలియదు కదా, ఆమె చెప్పడమే మంచిది అనే సలహా ఇస్తాడు. అప్పుడు కావ్య తన అమ్మకి ఫోన్ చెయ్యి వెంటనే ఈ విషయం స్వప్న కి చెపుదాం అంటుంది. రాహుల్ కాల్ చెయ్యగా చిరాకు లో ఉన్న అప్పు కాల్ కట్ చేస్తుంది.తర్వాత అయినా రిటర్న్ కాల్ చేస్తుంది కదా అప్పుడు వెంటనే ఈ విషయం చెప్పు అని కళ్యాణ్ కి చెప్తుంది కావ్య.ఇది ఇలా ఉండగా మరో పక్క స్వప్న పెళ్లిని చెడగొట్టింది ఎవరు అని స్వప్న ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు,స్వప్ననే పెళ్లి చెడగొట్టింది అనే విషయాన్నీ పసిగట్టిన కనకం, స్వప్న చెంపని చెళ్లుమనిపిస్తుంది.

Nuvvu Nenu Prema: ఆండాళ్ కు అడ్డంగా దొరికిపోయిన సిద్దు.. పద్మావతి ఎలా కాపాడనుంది..
దాని చూడవే ఒకసారి అని ఫోన్ లాక్కొని అప్పు చేతికి ఇస్తుంది. అప్పు ఫోన్ చూసి మెసేజి ఇదే పెట్టింది అని ఇంట్లో అందరికీ చూపిస్తుంది, ఆఖరికి ఇంతకీ దిగజారుతావా నువ్వు అసలు మనిషివేనా అని ఇంట్లో అందరూ స్వప్న ని తిడుతారు.ఇలాంటి కూతురు నా కడుపున ఎందుకు పుట్టిందో అంటూ కనకం బాధపడుతుంది.మరో పక్క రాజ్ ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు, ఇంతలో రాహుల్ రాజ్ వద్ద కి రాగ ‘రాజ్ ఈ నెల మన కంపెనీ లో నీ అకౌంట్ నుండి 8 లక్షలు డెబిట్ అయ్యాయి, దేనికోసం అంత డబ్బు తీసుకున్నావు’ అని అడుగుతాడు.ఆ తర్వాత జరిగింది ఏమిటి అనేది రేపు చూడాల్సిందే.