Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 316 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

Nuvvu Nenu Prema మే 20 ఎపిసోడ్ : అరవింద్ ను చంపటానికి రెడీ అయిన కృష్ణ.. అరవింద్ ను కాపాడేదెవరు?
నిన్నటి ఎపిసోడ్ లో,అరవింద ను కృష్ణచంపాలని ప్రయత్నిస్తాడు.కానీ అరవిందకు ఏమి కాదు,ఇక అను కి పుట్టినరోజు విషెస్ చెప్పడానికి ఆర్య,విక్కీ సిద్దు పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో ఆర్య చైర్ కి అతుక్కుపోయాడు. హెల్ప్ చేయడానికి సిద్ధు పద్మావతి,విక్కీ వస్తారు. విక్కీ అలా ఎలా ఇరుక్కుపోయావు అని అడుగుతాడు. అను చూసుకోకుండా ఫెవికాల్ మీద కూర్చున్నాడు అని చెప్తుంది. ఇక పద్మావతి నవ్వుతూనే ఉంటుంది. నా పరిస్థితి నీకు నవ్వులాటగా ఉందా అంటాడు ఆర్య. సారీ బావా పెళ్లిలో నీకు ఇలాంటి పరిస్థితి వస్తే మా అక్క మెడ లో ఎలా తాళి కడతావని ఆలోచిస్తున్నాను, అని నవ్వుతూనే ఉంటుంది. విక్కీ కాస్త ఆపుతావా నువ్వు ముందు తను ఎలాబయటికి తీసుకురావాలో ఆలోచించు అని అంటాడు. వెంటనే సిద్దు నాకు ఒక ఐడియా వచ్చింది అని చాక్ తీసుకొచ్చి దీంతో కోసేడమే అని అనగా, ఇడియట్ ఏమి మాట్లాడుతున్నావ్,అంటాడు ఆర్య. నీ ఐడియాలు ఏం అవసరం లేదు జస్ట్ నేను చెప్పినట్టు చేయని సిద్దుతో విక్కీ అంటాడు. పద్మావతి బావ నువ్వు టెన్షన్ పడకండి నేనున్నాను కదా, విక్కీ ఈ డైలాగులు ఇప్పుడు అవసరమా, అను నువ్వు ఆర్య చేయి పట్టుకో మేము చైర్ ని లాగేస్తాము అని అంటాడు. విక్కీ సిద్దు ఇద్దరు చైర్ ని గట్టిగా లాగుతూ ఉంటారని పద్మావతి అను ఇద్దరు ఆర్యని పట్టుకొని ముందుకు లాగుతూ ఉంటారు. ఇక అందరూ ఆ చైర్ నుండి ఆర్య అని విడిపించడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు. ఎంత ట్రై చేసినా అందరూ కింద పడిపోతారు గాని ఆర్యా చెర్ లో నుంచి బయటికి రాలేడు.

విక్కీ ఇంకా లాభం లేదు అను నువ్వు వెళ్లి మీ ఫాదర్ ప్యాంట్ తీసుకురా అని అంటాడు. పద్మావతి మా నాన్నకి లుంగీ లేనండి ఉంది అని అంటుంది. ఏదో ఒకటి తీసుకురండి అని అంటాడు విక్కీ. విక్కీ సిద్దు ఇద్దరు కలిసి పాంట్ చినిగిన పర్వాలేదు అని గట్టిగా లాగేస్తారు. ఆర్య ప్యాంటు వెనక హోల్ పడుతుంది. వెంటనే పద్మావతి అను లు ఇద్దరు లుంగీ తీసుకొచ్చి ఇస్తారు. ఆర్య లుంగీ కట్టుకుంటాడు. ఆర్య, అనులు ఇద్దరూ బయటికి వెళ్తారు. సిద్దు కూడా ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. విక్కీ ఫోన్ ఇంట్లో మర్చిపోయి బయటికి వస్తాడు. ఫోన్ కోసం మళ్లీ లోపలికి వెళ్తాడు. ఫోన్ అక్కడ ఉండదు, ఫోన్ ఎక్కడ పెట్టాను అని వెతుకుతూ ఉంటాడు. పద్మావతి రూమ్లో ఫోన్ ఉంటుంది, కావాలనే పద్మావతి ఫోన్ విక్కీకి ఇవ్వకుండా ఆటపట్టిస్తూ ఉంటుంది. ఎలా ఇవ్వవో చూస్తాను అని విక్కీ పద్మావతి నుండి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విక్కీ ఫోన్ తీసుకునే ప్రయత్నం లొ విక్కీ పద్దు ని కౌగిలించుకుంటాడు . కొంతసేపు ఒకరి కళ్ళలో కళ్ళు చూసుకుంటూ ఉంటారు,అదే టయానికి…

ఆండాలు పద్మావతి రూమ్ ముందుకు వచ్చి ఏంటే గోల అని అడుగుతుంది. పద్మావతి ఏం లేదత్తా నేను అక్క పడుకున్నాము,అని చెప్తుంది. సరే అని ఆండాలు తలుపు లేకుండా పడుకున్నారేంటి అని తలుపులేసి లోపలికి వెళుతుంది. ఇక పద్మావతి సార్ మీ రూమ్ లో నుంచి బయటకు రామాకండి, మా అత్త ఇంకా పడుకోలేదు, ఇక్కడే ఉండండి నేను చూసి వస్తాను అని చెప్పి వెళ్తుంది. అదే టయానికి సిద్ధు బొకే తీసుకొని పద్మావతికి ఇవ్వడానికని వస్తాడు. తలుపు కొడతాడు, ఇక పద్మావతి అక్క వాళ్ళు ఇప్పుడే కదా వెళ్లారు ఎవరు తలుపుకొడుతున్నారు అని వెళ్ళబోయేలోపే ఆండాలు తలుపు తీయడానికి వెళుతుంది. సిద్దు పద్దు వస్తుంది అని చెప్పి, రెడీగా బొకే పట్టుకొని నించుంటాడు. తలుపు తీయగానే ఆండాలు కనిపిస్తుంది. పద్మావతి వామ్మో సిద్దు దొరికిపోయాడు అనుకోని గబగబా బయటికి వస్తుంది. పద్మావతి వచ్చి ఏంటి సిద్దు గారు ఈ టైం లో వచ్చారు. అని సిద్దు ని లోపలికి తీసుకొస్తుంది. అడుగుతున్నది నిన్నే బాబు ఏంది ఈ టైం లో వచ్చావు అని ఆండాలు సిద్దు అని అడుగుతుంది.

సిద్దు వెంటనే బొకే తీసుకొని ఆండాలకి ఇచ్చి మీకోసమే వచ్చాను ఈ బొకే మీకు ఇద్దామని, ఈ బొకే నాకోసం తెచ్చావా అని ఆండాలు అనగానే లేదు లేదు లేదు పద్దు కోసం తీసుకొచ్చాను, వెంటనే సిద్దు లేదు అనుకిద్దామని తీసుకొచ్చా ఇవాళ అను పుట్టినరోజు కదా, అనగానే ఆండాలు అను పుట్టినరోజు అయితే పద్మావతికి ఎందుకు ఇస్తున్నావు. అసలు అను పుట్టినరోజు అని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. అను మా వాడికి ఫ్రెండ్ కదా వాడు నా బ్రదర్ కదా అలా తెలిసింది. ఎంత తెలిస్తే మాత్రం టైం కానీ టైం లో వచ్చి విషెస్ చెప్పడం ఏంది అబ్బాయి.. ఇక సిద్దుకి విక్కి అంతకు ముందు ఆండాలు గురించి చెప్పింది గుర్తొస్తుంది. లేదు లేదు నీ మనసులో ఏదో దురుద్దేశం ఉండాది, అదేందో చెప్పు అని సిద్దు ని అండల్ నిలదీస్తుంది. విక్కీ రూమ్ నుండి చూస్తూ ఉంటాడు. సిద్దు వెంటనే పద్మావతి బొకే ఇచ్చేసి వెళ్లిపోతాడు. మళ్ళీ కలుస్తాను అని చెప్పి. అమ్మయ్య తప్పించుకున్నాను అని బయటికి వెళ్లిపోతాడు. శ్రీరామచంద్ర ఈరోజు నాకు నిద్ర లేనట్టే అని అనుకుంటూ ఆండాలు కూడా వెళ్లి పడుకుంటుంది. ఇక పద్మావతి బొకే తీసుకొని రూమ్ లోకి వచ్చి తలుపు వేసుకుంటుంది. విక్కీ బోకే చూసి నీకు బొకే ఎందుకు ఇచ్చాడు. నేను అందంగా ఉంటాను కదా ఎవరికైనా బొకే ఇవ్వాలి అనిపిస్తుంది అని పద్మావతి విక్కీ తో అంటుంది.

ప్రేయసిగా నా జీవితంలో ఆడుగు పెట్టి నా జీవిత భాగస్వామి కాబోతున్న నీకు ఎప్పటికీ ఈ బర్త్ డే గుర్తుండి పోవాలని కోరుకుంటున్నాను అని ఆర్య అనుకి బర్త్డే విషెస్ చెప్తాడు. ఇంతలా ప్రేమిస్తున్న మీతో కలిసి నా బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అంటుంది అను. పద్మావతి సారు మీరు ఎక్కువ సేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్లిపోండి అని అంటుంది. వెంటనే విక్కీ వెళ్లే లోపు ఆర్య ఫోన్ చేస్తాడు. విక్కీ ఫోన్ రింగ్ అవుతుంది, ఆండాలు లోపల నుండి ఎవరి ఫోను ఆ ఫోన్ ఎవరిది ఆ రింగ్ ఏంటి నేను వస్తున్నా ఉండు అని అంటుంది. రూమ్ ముందు కువచ్చి పద్మావతి అని అరుస్తుంది. నిన్నేనే లోపల ఏం చేస్తున్నావు, తలుపు తీయని అరుస్తుంది. ఒసే తింగరి దాన ఎవరితో మాట్లాడుతున్నావే తలుపుతీ ముందు, తలుపుతీ అని అరుస్తూ ఉంటుంది. పద్మావతి రూమ్ లో నుండి వామ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి ఈమె తలుపు తీసేదాకా వెళ్లేటట్లు లేదే కానీ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది…. అక్క లేకుండా మీరు ఉన్నారని తెలిస్తే, ఇంకేమైనా ఉందా.. విక్కీ అయితే ఏంటి, మా అక్క లేకుండా మిమ్మల్ని ఇక్కడ చూసిందంటే మా అత్త ఇంకేం లేదు మీరు పెద్దగా మాట్లాడకండి సార్ అని భయపడుతూ ఉంటుంది…
రేపటి ఎపిసోడ్ లో,ఆర్య, విక్కి అందరూ పద్దు వాళ్ళ ఇంటికి వస్తారు.కాల్లు కడుక్కోడానికి నీళ్లు తీసుకోండి అని పద్మావతి ఆర్య, విక్కీకి ఇద్దరికీ వేడి నీళ్లు ఇస్తుంది. అవి కాళ్ళ మీద పోసుకొని అరుస్తూ ఉంటారు ఆర్య. ఏంటండీ నీరు చాలా చల్లగా ఉన్నాయా అంటుంది. చల్లగా ఏంటి వేడిగా ఉన్నాయి అని అంటాడు. విక్కీ కావాలని చేశారు కదా అంటాడు. పద్మావతి మరదల్ని కదా ఆ మాత్రం ఆట పట్టించకపోతే ఎలా ఉంటుంది అంటుంది రేపు చూడాలి ఇక ఈ పెళ్లి వేడుక ఎలా జరుగుతుందో…