Brahmamudi Serial మే 27th ఎపిసోడ్: వెన్నెల-రాహుల్ నిశ్చితార్థం ముహూర్తం పెట్టేందుకు పూజారి రావడంతో ఈరోజు ఎపిసోడ్ మెుదలవుతుంది. రాహుల్ జాతకంలో దోషం ఉందని పూజారి చెబుతాడు. వెన్నెల-రాహుల్ నిశ్చితార్థ ముహూర్తం పెట్టేందుకు పూజారివస్తాడు. అయితే రాహుల్ జాతకంలో దోషం ఉందని, పొద్దున పూజలు జరిపించి, సాయంత్రం నిశ్చితార్థం పెట్టుకోమని సలాహా ఇస్తాడు. నిశ్చితార్థం మాత్రం ఆగకూడదు.. చాలా మంది జరగకూడదని అనుకుంటున్నారు అది నాకు ఇష్టం లేదు. అని రుద్రాణి అందరి ముందే అంటుంది.ఇక కావ్య అక్కతో చెబితేనమ్మదు.. ఎలా నమ్మించాలని మనసులో అనుకుంటుంది.

ఇక అప్పుడే అరుంధతీకి రుద్రాణి కాల్ చేస్తుంది. పేరు పెట్టి పిలుస్తుంది అరుంధతి.వదిన అని పిలవని చెబుతుంది రుద్రాణి. పంతులు పెట్టిన ముహూర్తం గురించి చెబుతుంది. ఇక రాహుల్ ఆనందానికి అవధులు ఉండవు.మంచి సంబంధం కల్యాణ్ కు ఇద్దామంటే.. చెడగొట్టి తన కొడుక్కి చేసుకుంటుందని ధాన్యలక్ష్మి.. భర్తతో అంటుంది. రేపు దివ్యమైన ముహూర్తం ఉందని పూజారి చెప్పగా.. ఆ ముహూర్తమే ఖాయం చేయమని రుద్రాణి అంటుంది.

మరో వైపు కల్యాణ్ కు అప్పు ఫోన్ చేస్తుంది.కావ్య కు ఇవ్వమంటాది.కావ్యకు కల్యాణ్ ఫోన్ ఇస్తాడు. స్వప్న నిశ్చితార్థం గురించి అప్పు చెబుతుంది. అమ్మవాళ్లు చూపించిన సంబంధం చేసుకోవడమే అక్కకు మంచిదని కావ్య చెబుతుంది. అదేంటక్క అలా అంటున్నావ్ అని అప్పు అడుగుతుంది. రాహుల్ సంగతి ఏం చేద్దామని ప్రశ్నిస్తుంది. వాడు మంచివాడు కాదు వాడితో అక్క ఎప్పుడు సంతోషంగా ఉండలేదని కావ్య స్పష్టం చేస్తుంది. అమ్మ ఏం చేసినా మన మంచికోసమే చేస్తుందని చెప్తుంది కావ్య.

Nuvvu Nenu Prema: కృష్ణ బలవంతంగా పద్మావతిని పెళ్లి చేసుకోనున్నాడా….
రాహుల్ కి వార్నిగ్ ఇచ్చిన కావ్య
అప్పుడే అక్కడకు రాహుల్ వస్తాడు. మీ అక్కకు అక్కడ నిశ్చితార్థమా అని అడుగుతాడు. నువ్వేం చేయలేవనినీవల్ల కాదని చెబుతాడు. ఇక్కడ, అక్కడ నిశ్చితార్థం ఆపలేవని వెటకారంగా అంటాడు రాహుల్. ఎలా ఉంది నా ప్లాన్ అంటాడు. నీ ప్లాన్లో ఇరుక్కుపోడానికి నేను శృతిని కాదని కౌంటర్ ఇస్తుంది కావ్య. దీంతో ఒక్కసారిగా రాహుల్ షాక్ తింటాడు. షర్మిల, రమ్యల్లాగా నీ మాయమాటలు నమ్మను అని చెబుతుంది. నీ అకౌంట్లో చాలా మందిఅమ్మాయి లు ఉన్నారు కదా.. తీస్తా.. ఒక్కొక్కరిగా అందరి లిస్ట్ బయటకు పెడతా అని అంటుంది. ఇది రాజ్ కు చెప్పడానికి కాదు అంతకు మించి అని వార్నింగ్ ఇస్తుంది కావ్య. అక్కడ మా అక్క నిశ్చితార్థం ఆపకుండా, ఇక్కడ నీ నిశ్చితార్థం ఆపకుండా బాగానే ప్లాన్ చేశావని, గేమ్ నువ్ స్టార్ట్ చేశావ్, విన్నింగ్ నాది అని చెబుతుంది. నీ గురించి అందరికీ తెలిసేలా చేస్తానని రాహుల్ ను భయపెట్టిస్తుంది కావ్య.ఏం చేస్తుంది ఇప్పుడు.. వెయ్యికోట్ల ఆస్తి అని రాహుల్ తనలో తాను ఆలోచిస్తాడు.

రాహుల్ గురించి రాజ్ కు తెలుస్తుంది
ఇక రాజ్ ల్యాప్ ట్యాప్ లో పని చేస్తూ ఉంటాడు. అక్కడికి మేనేజర్ సిరీష్ వస్తాడు. ఎప్పుడూ లేనిది ఈ సమయంలో వచ్చారేంటి అని రాజ్ అడుగుతాడు. నేనే రమ్మన్నాను అని కావ్య అంటుంది.
కుక్కట్ పల్లి బ్రాంచీకి మీరు వెళ్లటం లేదు అని అడుగుతుంది కావ్య. అది రాహుల్ చూసుకుంటున్నాడని రాజ్ బదులిస్తాడు. చూసుకోవట్లేదని కావ్య చెబుతుంది. మేనేజర్ గారు కాల్ చేశారని, ఆ విషయాన్ని మీకే చెప్పమని పిలిపించానని తెలుపుతుంది. మేనేజర్ కూడా అదే విషయాన్ని చెప్తాడు.వారం నుంచి ప్రొడక్షన్ ఆగిపోయిందని, మీరు బోనస్ గా వర్కర్స్ కు ఇస్తానని చెప్పిన 30 లక్షలు రాహుల్ తీసుకున్నాడని మేనేజర్ సిరీష్ చెబుతాడు. దీంతో వర్కర్స్ నిరసన తెలుపుతున్నారని చెప్పగా.. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని రాజ్ ప్రశ్నిస్తాడు. ఈ విషయం మీకు తెలుసని రాహుల్ చెప్పాడని మేనేజర్ సమాధానం ఇస్తాడు. అందుకే మీకు ఫోన్ చేయగా కావ్య మేడమ్ నేరుగా ఇంటికి వచ్చి చెప్పమన్నారని తెలిపాడు.
వర్కర్స్ డబ్బు.. రాహుల్ ఎందుకు వాడుకున్నాడని రాజ్ అనుకుంటాడు. ఇఇప్పుడు మీ చుట్టూ ఉన్న మనుషులు మీలా లేరని గుర్తించాలని కావ్య అంటుంది. రాజ్ రుద్రాణి వాళ్ళు బట్టలు చూస్తుంటే అక్కడికి వస్తాడు.అత్తయ్య లైఫ్ లో చాలా పొగొట్టుకుందని, మెుదటిసారి ఫంక్షన్ కారణంగా సంతోషంగా ఉంది, ఇలాంటి సమయంలో రాహుల్ అసలు రూపం బయటపెట్టి అత్తయ్య మనసు బాధపెట్టడం సరికాదని రాజ్ అనుకుంటాడు. రాహుల్ వంక అలానే చూస్తూ పైకి వెళ్లిపోతాడు.ఈ విషయం గురించి బాగా ఆలోచిస్తాడు రాజ్.

కావ్య రాహుల్ కి చెక్ పెట్టటానికి ప్లాన్ వేస్తుంది
కల్యాణ్ కు శృతి కాల్ చేస్తుంది. రాహుల్ గురించి.. ముఖ్యమైన విషయం కావ్యతో మాట్లాడాలని చెబుతుంది. రాహుల్ నన్ను మోసం చేశాడని నిరూపించేందుకు ఒక ఆధారం ఉందని చెబుతుంది. అదేంటో వివరిస్తుంది. ఈ విషయం గురించి రాహుల్ కు తెలియనివ్వొద్దని శృతితో కావ్య అంటుంది.
మరోవైపు వెన్నెలతో ఫోన్లో మాట్లాడుతాడు రాహుల్. ఫోన్ కట్ చేశాక.. అందరి దృష్టిలోనేను వెదవను అయిపోతానని, అలా జరగనివ్వనని అంటాడు. ఉదయం అవగానే.రాహుల్ నిశ్చితార్థం హడావుడిలో పడి ఏం తినలేదని గుర్తు చేస్తుంది. హడావుడిలో పడి నువ్ కూడా ఒకటి మరిచిపోయావని రాజ్ అంటాడు. ఈరోజుతో మనం పెట్టుకున్న గడువు ముగుస్తుంది అంతే కదా అని కావ్య అంటుంది. ఒక్కసారి చెప్పాక.. నేను మరిచిపోను అని చెబుతుంది. లోపల ఎన్ని ఉన్నా.. పైకి సంతోషంగా ఉంటానని అంటుంది.

కావ్య కు గడువుని గుర్తు చేసిన రాజ్
నువ్ ఈ రోజు నిజాన్ని నిరూపించకపోతే.. హోదాను కోల్పోయేందుకు సిద్ధంగా ఉండమని కావ్యకు రాజ్ సవాలు చేస్తాడు. మీరు కూడా రాహుల్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉండమని కావ్య అంటుంది. నాకు రాహుల్ గురించి పూర్తిగా తెలుసనే నమ్మకంతో మాట్లాడుతున్నానని కావ్య కౌంటర్ ఇస్తుంది. మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసని టిఫిన్, స్నాక్స్ అందిస్తు మరోవైపు ఎలా నిరూపించబోతున్నారని కల్యాణ్ టెన్షన్ పడుతాడు. ఓ లెటర్ తీసి.. కల్యాణ్ కు ఇస్తుంది కావ్య. మా అక్క స్వప్న నిశ్చితార్థం ముగిశాక.. ఈ లెటర్ ఇవ్వాలని చెబుతుంది. ఇదే సమయంలో శృతి కాల్ చేస్తుంది. తన దగ్గర ఆధారాలు లేవని, అయితే చెప్పిన ప్లేసుకు వెళ్తే.. ఆధారాలు దొరుకుతాయని అంటుంది శృతి.ఓ వైపు కల్యాణ్ లెటర్ ఇచ్చేందుకు వెళ్తాడు, మరోవైపు కావ్య ఆధారాల కోసం వెళ్తుంది.

స్వప్న నిశ్చితార్థం
ఇక అక్కడ స్వప్న నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు జరుగుతాయి. లోపల ఉన్న దాని లోపల ఏం ఉందోనని కనకం బాధపడుతూ ఉంటుంది. అది ఏం చేసుకుంటుందోనని భయంగా ఉందని ఇంట్లో వాళ్లకి చెబుతుంది. అప్పు దగ్గరకు స్వప్న వెళ్లేసరికి ఏడుస్తూ ఉంటుంది. నా ప్లేసులో నువ్వుంటే.. నా బాధ ఏంటో నీకు తెలుస్తుందని స్వప్న అంటుంది. నేను నీలా కాదు, లేచి పోతే.. నీలా చేయను అని స్వప్న అంటుంది. మీలా పెద బతుకు నేను బతకలేనని స్వప్న అంటుంది. మాది పెద బతుకా? అని అప్పు ప్రశ్నిస్తుంది. రా.. వీధిలోకి తీసుకెళ్తా..ఇలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటువుంటారు.చూడాలి రేపు ఏమి జరుగుతుందో