Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 320 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి వాళ్ళ ఇంటిలో, అను,అర్యా ల పెళ్ళికి దోష పూజ జరుగుతుంది. ఆ పూజలో పద్మావతిని విక్కీకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని, ఒక పెద్దావిడ చెప్పడం దానికి కుచల ఒప్పుకోకపోవడం జరుగుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో
పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు.నిరంతరం నా ఆలోచన లోకి వస్తూ, ఏదో తెలియని ఆనందాన్ని నాలో కలిగిస్తూ, నా జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తుంటే ఎందుకు ఆలోచిస్తున్నావ్ పద్మావతి, నువ్వు నేను వేరు కాదు ఇద్దరం ఒకటే మనసు లో ఆలోచిస్తూ ఉండగా, అరవింద వచ్చి, విక్కీ ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. విక్కి పద్మావతి గురించి అయినా ఆలోచన అంతా అని మనసులో అనుకొని, దూరం నుండి పద్మావతి గురించి విక్కీ అరవింద ముందు బయటపడతాడా అని, కృష్ణ చూస్తూ ఉంటాడు. కానీ విక్కీ అరవింద తో పడుకోలేదా అక్క నువ్వేంటి ఇంకా పడుకోలేదు అని అరవింద్ అని అడుగుతాడు. అరవింద నాకు చాలా సంతోషంగా ఉంది. అనుఅర్యా ల పెళ్లి జరుగుతున్నందుకు, ఇంకెన్ని రోజులు నాలుగు రోజులే ఉంది. ఆ సంతోషానికే నాకు నిద్ర పట్టట్లేదు విక్కీ అని చెబుతుంది. నువ్వు కూడా త్వరలోనే ఒక శుభవార్త చెప్పు. నీ పెళ్లి గురించి చెప్పు, నేను ఇంకా సంతోష పడతాను అని, అనగానే విక్కీ చెప్పడానికి ఏముంది అక్క పద్మావతి నుంచి ఇంకా ఏ ఆన్సర్ రాలేదు. అని మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటాడు. అరవింద విక్కినేని నేనేం ఫోర్స్ చేయడం లేదు కానీ, అమ్మ కోరుకున్నట్టు నీ మనసుకి నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటున్నాను. అన్నట్టు ఉదయం పద్మావతి ఊర్లో కూడా, ఒక పెద్దావిడ పద్మావతిని పెళ్లి చేసుకోండి అనగానే, నేను షాక్ అయ్యాను. నువ్వు కూడా షాక్ అయ్యే ఉంటావు. అందుకే ఏం మాట్లాడలేకపోయావు కదా, ఆవిడ క్యాజువల్ గా అన్న ఆమీ చెప్పింది బాగుందనిపిస్తుంది.

పద్మావతి చాలా మంచిది తన వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాము. తను ని భార్యగా మన ఇంటికి వస్తే మన ఫ్యామిలీ ఇంకా బాగుంటుంది. నన్ను మీద అమ్మలా చూసుకునే వాళ్ళు నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను అక్క. నాకు తెలుసు రా, పద్మావతి మనసులో ఏముందో తెలియదు కదా, తన ఫ్యామిలీ తొందరపాటు వల్ల, ఒక మోసగాడు చేతిలో మోసపోయింది. కానీ తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే, నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. సరే నేను పడుకుంటాను అని వెళ్ళిపోతుంది. మా అక్క పద్మావతి ని చేసుకోవడం ఇష్టమే కాబట్టి , పద్మావతి మాట్లాడాలి అని విక్కీ అనుకుంటాడు.

Krishna Mukunda Murari: కృష్ణ మురారి కి ఒకరికొకరు దగ్గర అయ్యారు. ఇక ముకుందా ప్రేమ దూరమైనట్లేనా…..
విక్కీ పద్మావతికి ఫోన్ చేస్తాడు. వెనకనుండి కృష్ణ పద్మావతి తో ఏం మాట్లాడుతున్నాడు అని వింటూ ఉంటాడు. పద్మావతి తో విక్కీ, నీ మనసులో మాట తెలుసుకోవడానికి ఫోన్ చేశాను పద్మావతి అని చెప్తాడు. మనసులో మాట ఏంటి సారు అని అంటుంది పద్మావతి. నీ మనసులో దాచిన ఎందుకు పద్మావతి బయట పెట్టలేకపోతున్నావు. ఆ పద్మావతికి నిన్న జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. కుచల పూజ దగ్గర విక్కీఎవరూపటితే వాళ్ళు చేసుకోవడానికి నేను ఒప్పుకోను అని అన్న మాటలు పద్మావతికి గుర్తొస్తూ ఉంటయి. నువ్వు అనవసరంగా దేనికో భయపడి నిజం చెప్పడం లేదు. మనిద్దరం కలిసి ఉండాలని నా కోరిక కాదు, ఉదయం గుడిలో మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఒకపెద్దావిడ అన్నది. ఆ మాటలకు మా అక్క చాలా సంతోష పడింది. అంటే మనిద్దరమే కాదు మనం కలవడం చాలా మందికి ఇష్టం. మనవల్ల మన బండి ఫ్యామిలీస్ ఇంకా బాగుంటాయి పద్మావతి అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. నువ్వు జస్ట్ ఓకే చెప్పు పద్మావతి మిగిలింది అంతా నేను చూసుకుంటాను. చెప్పు పద్మావతి చెప్పు అని నిలదీస్తారు. మనం ఒకటి కావడానికి ఏ అడ్డంకి ఉందో నాతో చెప్పు, నా మనసులో ఏమన్నా మీతో చెప్పే పరిస్థితిలో నేను లేను సార్ అని అంటుంది. అందరూ బాగుండాలి అంటే మీరు నన్ను మర్చిపోవటమే, అదే అందరికీ మంచిది అని పద్మావతి మనసులో అనుకుంటుంది. సరే సరే మా అక్క పిలుస్తుంది అని ఫోన్ మధ్యలోనే పెట్టేస్తుంది. మీలాంటి మంచి మనిషిని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి అని ఫోన్ పెట్టేశాక అనుకుంటుంది పద్మావతి. విక్కీ చాలా బాధగా, నీ మనసులో భయాలు నేను పోగొట్టి అందరి ముందు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అని విక్కీ అనడం కృష్ణ వింటాడు. విక్కీ ఏమాత్రం ఓపెన్ అయినా నేను లేట్ చేసిన అరవింద్ అందరిని ఒప్పించి వికీ పద్మావతి పెళ్లి చేస్తుంది అని కృష్ణ భయపడుతూ ఉంటాడు. రేపు ఉదయం ఈ విషయానికి ఒక పులిస్టాప్ పెట్టాలి అని కృష్ణ అనుకోని వెళ్ళిపోతాడు.
పద్మావతి,ఇంట్లో పెళ్లి పనులు మొదలు

పద్మావతి, అను వాళ్ళ నాన్నకి సేవలు చేస్తూ ఉంటారు. నాయన ఈరోజు నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టబోతున్నాము, ఈరోజు నుంచి అంత సంతోషమే అని చెప్తూ ఉంటుంది. వాళ్ల నాన్న మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఉగాది చూసి పద్మావతి కూడా బాధపడుతూ, వాళ్ళ నాన్న ఇలా వీల్ చైర్ లో ఉన్నందుకు ఏడుస్తూ ఉంటుంది. అదే టయానికి అండలు వచ్చి, పెళ్లి పనులు మొదలుపెట్టడానికి మీరు ఏంటి ఏడుస్తున్నారు అని, చూడండి మీరు బాధపడుతున్నారు మీ నాన్న బాధపడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయం కదా, దీనికి ఇద్దరు అట్ల బాధపడుతున్నారు అని అడుగుతుంది ఆడాల్. అన్నీ తానే అక్క పెళ్లి నాన్న చేయాలి అని అనుకునే టయానికి ఇలా జరిగింది. నాన్న కి బావుంటున్నట్టయితే ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని అంటుంది పద్మావతి. మీ నాన్నకి అంత బాధ ఉందా అను కోరుకున్న వాళ్ళతో పెళ్లి అవుతుంది అని చాలా సంతోషపడుతున్నాడు. మీరు ఇంకా ఏడవడం ఆపండి అని అరుస్తుంది అండల్.
పద్మావతి వాళ్ళమ్మ ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి ఆయన సంతోషంగానే ఉన్నారు మీరు బాధపడకండి అని వాళ్ళకి నచ్చిన చెప్తుంది. రాహుకాలం వస్తుంది పెళ్లి పనులు మొదలు పెట్టాలి పదండి, అని అను ఆండాలు వెళతారు. ఇక అందరూ పనుల్లో మునిగిపోతారు.

కృష్ణ వంకర బుద్ధి
కృష్ణ,పద్మావతిని, విక్కీ భార్యగా చేయాలని అందరూ అనుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.పద్మావతి నాది నాకు మాత్రమే సొంతం, తనని ఎలాగైనా నిన్ను సొంతం చేసుకోవాలి అని, పద్మావతి విక్కి ల పెళ్లి జరగడానికి వీలులేదు నేనే పెళ్లి చేసుకోవాలి అని కారులో ఉన్న తాళిబొట్టు తాళం తీసుకొని జేబులో పెట్టుకొని బయలుదేరుతాడు. పద్మావతి ఇంట్లో అందరూ ముడుపు కట్టి దేవుడికి పెళ్లి పనులు మొదలుపెడతారు. కృష్ణ కారులో చాలా ఆవేశంగా పద్మావతి ఇంటికి బయలుదేరుతాడు. అను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొంటువుండగా, వాళ్ల నాన్న బాధపడుతూ ఉండడం పద్మావతి చూసి, అక్క సంతోషంగా ఉంటుంది నాన్న నువ్వు బాధపడకు అని చెప్తుంది. అందరూ పెళ్లి పనుల్లో వుంటారు. అదే టయానికి పద్మావతి గారు అనుకుంటూ కృష్ణ లోపలికి వస్తాడు.

పద్మావతి ఇంటికి వచ్చిన కృష్ణ
ఇక కృష్ణుని చూసి అందరూ షాక్ అవుతారు. పద్మావతి కృష్ణ తో ఎందుకు ఇక్కడికి వచ్చావు. ఏ డైర్యం లోపలికి వచ్చావు బయటికి వెళ్ళు అని అంటుంది. ఏంటండీ మీరు నేను ఎంతో ప్రేమగా పలకరిస్తే మీరు అంత కోపంగా ఉంటారు ఏంటి అని అంటాడు కృష్ణ. నా బాధ కొంచెం అర్థం చేసుకోండి, అసలు ఏందిరా నీ బాధ వండుకోవేకి తిన్నది అరక్క ఇట్లా చేస్తున్నావు, అయినా నీతో నాకు మాటలు ఏంటి,బయటకు వీళ్ళు అని ఆండాల్ అంటుంది… చూడాలి కృష్ణ తన తీసుకొచ్చిన తాగిన పద్మావతి మెడలో కడతాడా… పద్మావతి ఎవరు కాపాడతారో రేపటి ఎపిసోడ్ లో చూదాం…

రేపటి ఎపిసోడ్ లో
విక్కీకి పంచ కట్టుకోవడం రాదు, పంచ కట్టుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే పద్మావతి చూసి హెల్ప్ చేస్తుంది. వాళ్ళిద్దరిని అలా ఉండడం కృష్ణ దూరం నుంచి చూస్తాడు. చూడాలి పద్మావతిని కృష్ణ ఎం చేయమన్నాడు…