విజయ్ దేవరకొండ.. ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారి యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకున్న విజయ్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోల చెంత చేరిపోయాడు. మధ్య మధ్యలో పలు ఫ్లాపులు పడినా విజయ్ క్రేజ్ ఏ మాత్రం దగ్గలేదు.
టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ లోనూ విజయ్ దేవరకొండకు ఫాలోయింగ్ ఎక్కువే. అక్కడి స్టార్ హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని, ఆయనతో నటించాలనుందని ఓపెన్‌గానే చెప్పారు. అలాంటి హీరో మూవీని న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. అయితే ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు. కొన్నేళ్ల క్రితం జరిగింది.
`గీత గోవిందం` హిట్ అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `డియర్ కామ్రేడ్`. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 2019లో విడుదలైంది. కానీ, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో రష్మిక కంటే ముందు మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించారట.
కానీ, ఈ సినిమాలో ముద్దు సీన్ ఉండటం వల్ల.. తాను నటించను అని చెప్పిందట. సాయి పల్లవి కెరీర్ స్టార్టింగ్ నుండి గ్లామర్ షోకు, రొమాంటిక్ సన్నివేశాలకు దూరం. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సినిమాను కూడా రిజెక్ట్ చేసిందట. దాంతో అప్పుడు ఆమె స్థానంలో రష్మికను ఎంపిక చేశారట.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!