Heroine: ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. దానికి కారణం బాహుబలి, RRR, పుష్ప సినిమాలు సృష్టించిన రికార్డులు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రపంచ ప్రతిష్టాత్మక సినీ అవార్డు ఆస్కార్ RRR గెలవడం జరిగింది. దీంతో ఒకప్పుడు ప్రపంచ సినిమా రంగంలో భారతీయ చలనచిత్రాలు అంటే హిందీ సినిమాలు గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాల గురించి చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం సౌత్ సినిమాలనే నమ్ముకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతూ పరిణామాలు మొత్తం మారిపోయాయి. ఒకప్పుడు సౌత్ హీరోయిన్స్ కంటే హిందీ సినిమా హీరోయిన్స్ కి రెమ్యూనిరేషన్ ఎక్కువ ఉండేది. కానీ పాన్ ఇండియా ప్రభావం వల్ల.. నటీనటుల రెమ్యూనికేషన్ అక్కడ ఇక్కడ ఒకే రకంగా సరిసమానమయ్యాయి.

దీంతో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, ఆలియా భట్, జాన్వి కపూర్ ఇలా అందరూ ప్రస్తుతం తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి కంటే ముందుగానే కియారా అద్వానీ.. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేయడం జరిగింది. ఈ రెండిటిలో మహేష్ బాబుతో నటించిన “భరత్ అనే నేను” బ్లాక్ బస్టర్ విజయం కాగా..

చరణ్ తో నటించిన “వినయ విధేయ రామ” సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్” సినిమా చేస్తోంది. ఈ సినిమాకి దాదాపు మూడు కోట్ల రెమినేషన్ అందుకుంటూ ఉందట. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రానీ కియారా పెళ్లాడటం జరిగింది. ఈ క్రమంలో ఈ టాప్ హీరోయిన్ కి పెళ్లయిన గాని వరుస పెట్టి అవకాశాలు వస్తూ ఉన్నాయంట.

ఈ క్రమంలో రెమ్యూనరేషన్ పరంగా ఎంత అడిగినా ఇవ్వడానికి.. నిర్మాతలు రెడీగా ఉన్నారట. కానీ సినిమాలో రొమాన్స్ సన్నివేశాలు లేని కంటెంట్ ఉన్న సినిమాలు అయితేనే చేస్తానని… కరాకండిగా నిర్మాతలకు చెప్పేస్తుందట. హీరోతో ఏమాత్రం రొమాన్స్ సన్నివేశాలు ఉంటే.. సినిమాలకు నో చెబుతూ ఉందంట. కారణం పెళ్లి కావడంతో ఇంకా కాస్త సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. కీయారా భావిస్తుందట. “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ తో కియరా..ఫెట్ మారిపోయింది. అయితే పెళ్లి అయినా అటువంటి కథలే ఇప్పటికి కూడా వస్తూ ఉండటంతో… ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కంటెంట్ సినిమాలు చేసే ప్రసక్తి లేదని నిర్మొహమాటంగా నో చెప్పేస్తుందట. ఈ క్రమంలో చరణ్ తో రెండోసారి జత కడుతున్న కియరా “గేమ్ చేంజర్” సినిమాతో ఏ మేరకు హిట్ అందుకుంటుందో చూడాలి.