NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha manasu: మరొక కుట్ర పన్నిన దేవయాని.. ఈసారి శాశ్వతంగా వసు, రిషిలు విడిపోబోతున్నారా..??

Guppedantha Manasu October 19 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 584వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 19న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో రిషికి వసు భోజనం తెస్తుంది.అయితే ఆ భోజనం పంపింది వసునే అని రిషి గుర్తు పడతాడు.

రిషికి భోజనం పంపిన వసు :

Vasu rishi gowtham


ఇక ఈరోజు ఎపిసోడ్ లో లంచ్ తెచ్చింది వసు తెలిసి ఈ లంచ్ లు అవి తేవడం ఏమిటి అని అడుగుతాడు వసుని, అంటే ఆకలితో ఉంటారు కదా అని అంటుంది వసు, అప్పుడు గౌతమ్ వంక చూస్తాడు రిషి. వసుచెప్పొద్దన్నది బాబు, నాకు ఆకలి వేస్తుంది మీరు మీరు చూసుకోండి అని చెప్పి తన భోజనం చేయడం ప్రారంభిస్తాడు.ఇక కాసేపు అయ్యాక వసుని కూడా భోజనం చేసి వెళ్లమంటాడు రిషి. అందుకు సంతోషిస్తుంది వసు. సార్ ఇంటికి వెళ్లకుండా ఇలా కాలేజ్ లోనే ఉంటే మేడం వాళ్ళు బాధపడతారు కదా అంటే నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు అంటాడు.

మరొక కుట్రతో వసు ఇంటికి దేవయాని:

Devayani came to vasu house


సీన్ కట్ చేస్తే వసు రూమ్ తలుపు ఎవరో కొట్టడంతో తలుపు తీస్తుంది వసు. అయితే వసుకు ఎదురుగా దేవయాని కనిపించడంతో వసు షాక్ అయ్యి మేడం మీరు ఇక్కడికి అని కంగారుగా అడుగుతుంది. ఏం రాకూడదా అని అడుగుతుంది దేవయాని. అలా అని కాదు ఫోన్ చేస్తే నేనే వచ్చేదాని కదా అన్న వసుతో పర్వాలేదులే కానీ బట్టలు సర్దుకో పదా నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్లడానికే వచ్చాను అని అంటుంది.అదేంటి అని షాక్ అవుతుంది వసు. అవును నువ్వు గురుదక్షిణ అది ఇది అని చెప్పి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావ్ నీకు రిషికి నేను పెళ్లి చేస్తాను కదా బట్టలు సర్దుకుని రా, అని బయటకు వస్తుంది దేవయాని.నా పెద్దరికంను సైతం పక్కనపెట్టి వచ్చాను అని అంటుంది దేవయాని. ఈవిడ ఏదో కుట్రతోనే ఇక్కడికి వచ్చారు అని అనుకుంటుంది వసు.

వసును దూరం పెట్టకు అని రిషికి సలహా ఇచ్చిన గౌతమ్ :

Rishi gowtham


కాలేజ్ లో గౌతమ్, రిషిలు టెన్నిస్ ఆడుతూ ఉంటారు అలా ఆడుతున్న రిషితో గౌతమ్ ప్రేమ గురించి మాట్లాడుతూ నువ్వు ఎందుకు వసుని దూరం పెడుతున్నావ్ అని అడుగుతాడు. తనని దూరం పెడుతున్నానని నువ్వెందుకు అనుకుంటున్నావు నీకు నాకు మధ్య ఈ నెట్ ఎలా అడ్డుగా ఉందొ, వసుకు నాకు మధ్య చిన్న అడ్డుతెర ఉంది అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అని చెప్తాడు.

రిషికి కాల్ చేసి రమ్మని చెప్పిన వసు :

Vasu rishi devayani

దేవయాని వచ్చిన విషయాన్ని వసు రిషికి ఫోన్ చేసి చెబుతుంది.అది గమనించిన దేవయాని నువ్వు రిషి కి ఫోన్ చేయటమే నాకు కావాలి వాడు ఇక్కడికి వస్తేనే కదా నేను అనుకున్నది జరుగుతుంది అని అనుకుంటుంది మనసులో.కారులో వస్తున్న రిషి పెద్దమ్మ ఎందుకు అక్కడికి వెళ్ళింది అని ఆమెకి ఫోన్ చేస్తాడు. కానీ దేవయాని కావాలనే లిఫ్ చేయదు. ఇక రిషి వసు ఇంటికి వచ్చేసరికి వాకిట్లోనే ఉన్న పెద్దమ్మని చూసి ఏంటి పెద్దమ్మ ఇది అంటాడు.నీకోసమే, నాకు నీ సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదు వసుని తీసుకుని మన ఇంటికి వెళ్దాం.మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అని చెప్పి అంటుంది దేవయాని. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావ్, ఉండవలసిన వాళ్ళకి లేని కంగారు నీకెందుకు అని అడుగుతాడు రిషి. అలా మాట్లాడుకుంటూ ఉంటుండగా పొరుగింటావిడ, బయట మాట్లాడుకుంటున్నారు ఏదైనా సమస్య అని వసుని అడుగుతుంది.లేదండి ఇది మా కుటుంబ సమస్య అని అంటుంది.

రిషి దగ్గర దొంగ ఏడుపు ఏడుస్తున్న దేవయాని :

Devayani cunning mind



ఇక రిషి వాళ్ళ పెద్దమ్మను ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.కారులో వెళుతూ దేవయాని ఏడుస్తుంది. ఏమైంది పెద్దమ్మ ఎందుకు ఏడుస్తున్నారు అంటే నీకోసం నేను కాకుండా ఇంకెవరు ఏడుస్తారు మీ అమ్మకి నాన్నకి బాధ్యత లేదు అని అంటుంది. నేను బాగానే ఉన్నాను కదా అన్న రిషితో ఏం బాగున్నావ్ సాక్షి వచ్చి వెళ్ళిపోయినప్పుడే నీ మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు వసు..వచ్చింది నువ్వు సంతోషంగా ఉంటావు అంటే ఏవో గొడవలతో మీ మధ్య దూరం పెరిగింది.అందుకే నేను నా పెద్దరికం కూడా పక్కనపెట్టి తనని నిన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమలాడ్డానికి వెళ్లాను అంటుంది.. అయినా తను నా మాటకి విలువ ఇవ్వకుండా చాలా మొండిగా ప్రవర్తిస్తుంది అని అంటుంది. అప్పుడు రిషి పెద్దమ్మ మీరు బాధపడకండి తను ఎప్పటికైనా మనసు మార్చుకొని నా దగ్గరికి వస్తుంది. మీరు చూస్తున్న వసు వేరు, నాకు అర్థమవుతున్న వసు వేరు అని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu