Malli Nindu Jabili: మల్లి సీరియల్లో మాలినీగా నటిస్తున్న కన్నడ ముద్దుగుమ్మ దీప జగదీష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ ప్రపంచంలో కరెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ అంతకుమించి అందాలను వలకబోస్తూ హాట్ గ్లామరస్ గా ఫొటోలు షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ… సీరియల్లో చీరకట్టుతో తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. మల్లి సీరియల్ లో కట్టుబొట్టుతో పాటు తన యాక్టింగ్ తో కూడా అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో బికినీ ఫోటోలతో మరింత రచ్చ రేపుతూ ఉంటుంది.

2016లో వచ్చిన ఉదయ టీవీ మహాసతి సీరియల్ తో బుల్లితెరపై నటిగా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత బ్రహ్మాస్త్ర, కావ్యాంజలి వంటి సీరియల్స్ తో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తెలుగులో ఈటీవీలో ప్రసారమైన ప్రేమనగర్ అనే సీరియల్ లో లీడ్రోల్ పోషించిన దీపా జగదీష్.. కన్నడ దర్శకుడు సాగర్ పూర్ణాయక్ తో గత కొన్ని సంవత్సరాలు ప్రేమాయణం సాగించి.. ఇటీవలే వివాహం కూడా చేసుకుంది. ఇక ప్రస్తుతం మల్లి సీరియల్ లో మాలినిగా అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈమె భర్త సాగర్ కన్నడ నాట దర్శకుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2023 సైమా అవార్డ్స్ లో భాగంగా ఈమె భర్త సాగర్ పూర్ణాయక్ దర్శకత్వం వహించిన కన్నడ సినిమా డొల్ల సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ విభాగంలో అవార్డు లభించింది.

ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్ కి వెళ్లిన ఈమె అక్కడ దుబాయ్ అందాలను చూపిస్తూనే తన భర్త తో కలసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. సెప్టెంబర్ 15, 16 తేదీలలో జరుగుతున్న సైమా 2023 అవార్డ్స్ లో భాగంగా ఆమె దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అందరికీ ఈ విషయాన్ని తెలియజేసింది మొత్తానికైతే దీపా జగదీష్ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.