Dasara Oscar: ప్రపంచ స్థాయి సినిమా రంగంలో తెలుగు చలనచిత్ర రంగం ట్రెండ్ సెట్ చేస్తూ ఉంది. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయిలో అనేక రికార్డులు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటూ ఉన్నాయి. దేనికి ప్రధాన కారణం దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పవచ్చు. ఆయన తీసిన RRR, బాహుబలి విజయాలు తెలుగు చలనచిత్ర రంగం యొక్క స్థాయిని ఒక్కసారిగా పెంచేయడం జరిగింది. ఈ క్రమంలో “RRR” సినిమా ఆస్కార్ అవార్డు కూడా గెలవడం జరిగింది. ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ కూడ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో మరో సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ 20 నుంచి 2023 ఆస్కార్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. భారతదేశానికి సంబంధించి చెన్నైలో ఆస్కార్ స్పెషల్ స్క్రీనింగ్ లు ప్రారంభం కావడం జరిగింది. ఇండియాలో ఈసారి ది స్టోరీటెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), శ్రీమతి వంటి పేర్లు ఉన్నాయి. ఛటర్జీ vs నార్వే (హిందీ), ట్వల్త్ ఫెయిల్ (హిందీ), విడుతలై పార్ట్ 1 (తమిళం), ఘూమర్ (హిందీ), దసరా (తెలుగు) వంటి చిత్రాలు రేసులో ఉన్నాయి. జాబితాలో వాల్వి (మరాఠీ), గదర్ 2 (హిందీ), అబ్ తో సబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లియోక్ (మరాఠీ) వంటి సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం మొత్తం ఈసారి 22 కు పైగా సినిమాలు ఆస్కార్బరిలో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. గత ఏడాది RRR, ది ఎలిఫెంట్ విస్పరర్స్.. అవార్డులు గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ పనిలో నాని నటించిన దసరా ఉండటం ఇప్పుడు సంచలనం గా మారింది.
శ్రీకాంత్ ఒదెల అనే కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నాని కెరియర్ లోనే రికార్డు స్థాయి వసూలు రాబట్టడం జరిగింది. కీర్తి సురేష్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2024 అధికారిక ఎంట్రీ కోసం ఈ భారతీయ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ప్రముఖ ఫిలిం మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా.. ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను వీక్షిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా 22 సినిమాలు అధికారిక ఎంట్రీ కి వచ్చినట్లు అందులో దసరా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దసరా మాత్రమే కాదు బలగం సినిమా కూడా పోటీపడుతున్నట్లు కచ్చితంగా బలగం ఆస్కార్ ఎంట్రీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!