BrahmaMudi:సీరియల్ డైరెక్షన్ చేయడం అంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని, ఒక యుద్ధం చేసినట్టే, ఒక సీరియల్ మొదటి పెట్టడం మాత్రం డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఒక సీరియల్ ని ఒకరు డైరెక్ట్ చేయడమే కష్టం అనుకుంటే, రెండు సీరియల్స్ ని ఒక్కడే డైరెక్ట్ చేయడం అంటే అది కత్తి మీద సాము లాంటిదే, అలాంటిది ఇప్పుడు మన స్టార్ మా లో రెండు సీరియల్స్ హిట్ ట్రాక్ పై నడిపిస్తున్న ఒకే ఒక డైరెక్టర్, అసలు స్టార్ మా లో సీరియల్స్ అంటేనే ఒక రేంజ్ లో ముందుకు వెళుతుంటాయి అట్లాంటిది ఒక సీరియల్ కాకుండా రెండు సీరియల్స్ ని స్టార్ మా లో అది టాప్ రేటింగ్ లో దూసుకెళ్లేటట్టు చేయడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు ఆ డీటెయిల్స్ మీకోసం..

ఒక సినిమా తీయడం చాలా కష్టమైన పని. కానీ అది ఎటె టైం ఒకేసారి హిట్టా ఫట్టా అనేది తేలిపోతుంది ఒక్కరోజులో,హిట్ అనుకుంటే ఇంకో సినిమా తీస్తాడు ప్లాప్ అనుకుంటే అంతకన్నా మంచిగా తీస్తారు. కానీ సీరియల్ తీయడం అంటే చాలా కష్టం ఎందుకంటే, ప్రతి వారం సీరియల్ చేసే వాళ్ళకి చాలా గండం గానే ఉంటుంది. వారం వారం టిఆర్పి రేటింగ్ వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఒకవారం టిఆర్పి రేటింగ్ పడిపోయిన రెండో వారంలో దాని ముందుకు తీసుకెళ్లాలి లేదంటే పూర్తిగా వెనక్కి పడిపోతుంది.ఇక షూటింగ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని యాక్టర్స్ దొరకాలి వాళ్లకు షీట్స్ చూసుకోవాలి వరుసగా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేదంటే వారం మొత్తం షూటింగ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే వాళ్లు వేరే సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉంటారు నటీనటులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ అన్నీ చూసుకుంటూ ఉండాలి. మరి ఇన్ని ఆటంకాలని దాటుకుంటూ స్టార్ మా చానల్లో రెండు సీరియల్స్ ని టీఆర్పీ రేటింగ్ లో టాప్ లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు డైరెక్టర్ కుమార్ పంతం. బ్రహ్మముడి సీరియల్ ని కుమార్ పంతం డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సీరియల్ అన్ని విధాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ ఎంత టాప్ లో ఉండేదో ఇప్పుడు అదే లోటును భర్తీ చేయడానికి అదే టైమింగ్ లో వచ్చిన బ్రహ్మముడి సీరియల్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. దీనికి మొదటి కారణం సీరియల్ లో ఉన్న నటీనటులు కదా కథనం అయితే కనిపించని ఇంకో బలమే డైరెక్టర్. ఎందుకంటే ఒక్కోసారి ఆడియన్స్ ఒకే పంతాలో సీరియల్ ముందుకెళ్లాలి అని అనుకుంటారు. కానీ కథకు తగ్గట్టు ఆ సీరియల్ ని మలుపు తిప్పాల్సి ఉంటుంది డైరెక్టర్ అలాంటప్పుడు ప్రేక్షకులు డైరెక్టర్ ని తెగ తిట్టుకుంటూ ఉంటారు కానీ తిట్టిన వాళ్లే మళ్ళీ సీరియల్ ఒక దాటి లోకి వచ్చేసరికి పొగడ్తల వర్షంలో ముంచేత్తుతూ ఉంటారు అలాంటి ట్రస్టులు పెట్టడం కత్తి మీద సాము లాంటిదే డైరెక్టర్ కి, ఈ అన్ని విషయాలని అవలీలగా దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ పంతం కుమార్, బ్రహ్మముడి సీరియల్ ని అద్భుతంగా డైరెక్ట్ చేస్తున్నారు.

నిజానికి ఇటు బ్రహ్మముడి సీరియల్ తో పాటు ఇంకొక టాప్ సీరియల్ కూడా మన కుమార్ పంతమే ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్నాడు ఆ సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ కూడా కుమార్ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు,నిజానికి బ్రహ్మ ముడి సీరియల్ కంటే ముందు నుంచే గుప్పెడంత మనసు ఈయన చేతిలో ఉంది గుప్పెడంత మనసు మొదటి 100 ఎపిసోడ్ లని కాపుగంటి రాజేంద్ర (కార్తీకదీపం )చేసిన డైరెక్టర్ చేశారు ఆ తర్వాత ఇది కుమార్ చేతిలోనికి వచ్చింది. అప్పటి నుంచి కార్తీకదీపం సీరియల్ కి గట్టి పోటీ ఇస్తూ టిఆర్పి రేటింగ్ ఏ మాత్రం తగ్గకుండా ఒక్కొక్క సమయంలో కార్తీక దీపం కంటే కూడా గుప్పెడంత మనసుని టాప్ లో ఉంచిన డైరెక్టర్ కుమార్ పంతం.ఇక ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ కూడా కుమారే టేకవర్ చేశారు కార్తీకదీపం కి శుభం కార్డు పడిన తర్వాత ఆ ప్లేస్ లో బ్రహ్మకుడి సీరియల్ ని అద్భుతంగా డైరెక్ట్ చేస్తున్నారు.ఈయన ఈ రెండు సీరియల్లతో పాటు అంతకుముందు వచ్చిన చెల్లెలి కాపురం అనే సీరియల్ ని కూడా ఈనే డైరెక్ట్ చేశారు

ఇక కుమార్ భార్య కిరణ్మయి కూడా ఎన్నో సీరియల్స్ లో నటించారు. నా పేరు మీనాక్షి నేను శైలజ ఈమెకి మంచి పేరు తీసుకువచ్చిన సీరియల్స్. ఒకే చానల్లో రెండు సీరియల్స్ అది హిట్ సీరియస్ గా దూసుకుపోతూ ప్రేక్షకుల మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించిన బ్రహ్మముడి గుప్పెడంత మనసు ఈ రెండు సీరియల్స్ వెనకాల ఉన్న కుమార్ పంతం, టాలెంట్. ఈమె ఇలా డైరెక్ట్ చేయడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం తో పాటు ఈయన కూడా కష్టపడి ఈ సీరియల్స్ రెండిటిని ఇంత టాప్ లో తీసుకొచ్చారు. ఏదైనా సాధ్యం అనుకుంటే సాధ్యం కాదు అనుకుంటే అసాధ్యం. కానీ అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసి చూపించిన మనసే కుమార్ పంతం.. ఇలాంటి సీరియల్స్ మరెన్నో కుమార్ చేయాలని, అన్ని సీరియల్స్ హిట్ ప్లేస్ లో ఉండాలని ఆకాంక్షిద్దాం..