21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam 22 October,1490 Episode: మోనితను అనుమానించిన కార్తీక్…సౌర్యను వెతికే క్రమంలో దీప, కార్తీక్..!

Share

Karthika Deepam 22 October,1490 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1490 వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 22 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో కార్తీక్ కు సౌర్య నవ్వు వినిపించి సౌర్యా అంటూ అరుస్తూ ఉంటాడు.ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో కంటిన్యూ అవుతుంది కార్తీక్ శౌర్య గొంతు విని ఎక్కడికి వెళ్లి పోయావు శౌర్య నీకోసమే ఎదురు చూస్తున్నాను అని ఆలోచిస్తూ ఇంటి వరకు వస్తాడు. అప్పటికే మోనిత హాల్లో కూర్చుని కార్తీక్ ని ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకెళ్లి పోవాలి అని అనుకుంటుంది.

మోనితను అనుమానించిన కార్తీక్ :

Karthik,monitha

అదే సమయంలో ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు కానీ మోనితకి ఆ ఏడుపు వినబడదు. ఇంటి బయట ఉన్న కార్తిక్ కి ఏడుపు వినబడి వెంటనే ఆనంద్ దగ్గరికి వచ్చి ఆనంద్ ని బుజ్జగిస్తూ, అసలు నీకు బుద్ధి ఉన్నదా మోనిత ఇంట్లో బాబు ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అని తిడతాడు. నిజంగానే వినిపించలేదు కార్తీక్ ఏదో ఆలోచనలో ఉన్నాను అని మోనిత అనగా, దుర్గ గారు ఇంట్లో ఉన్నారా దుర్గ గారు అని అరుస్తాడు కార్తీక్. దుర్గ ఇక్కడ ఎందుకు ఉంటాడు కార్తీక్ అని మోనిత అడగగా, అందుకే నువ్వు పరజ్ఞానంలో ఉన్నావు అన్నమాట అంటాడు.. దుర్గ లేనప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటూ ఉన్నావు అని అనగా మోనిత ఆ మాటలకు చిరాకు పడుతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్… నన్ను ఎలా అనుమానిస్తున్నావ్ నీ గురించి ఆలోచించే నా మైండ్ ఆబ్సెంట్ అయింది. నువ్వు నన్ను అంత అనుమానంగా చూస్తుంటే నా బుర్ర పని చేయడం లేదు నన్ను అంత అనుమానించొద్దు కార్తీక్ అని మోనిత అరుస్తుంది. దానికి కార్తీక్, అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 

మోనితకు నిజం చెప్పేసిన శివ :

Siva, monitha

ఆ తర్వాత సీన్లో శివ, దీప ఇంటి నుంచి మోనిత ఇంటికి వస్తూ, ఏంటో ఉదయం అక్కడ సేవలు చేయాలి రాత్రి వంటలక్క ఇంటి ఎదురుగుండా పడుకోవాలి అనుకుంటూ వస్తాడు. ఇక శివ రావడం చుసి పొద్దునే ఎక్కడికి వెళ్ళావ్ అంటే జాగింగ్ అని చెప్పి ఆవలిస్తాడు. మరి ఆవలింతలు ఏంటి.. నిజం చెప్పు అంటే కార్తీక్ సార్ నన్ను రాత్రి పూట ఆ వంటల్క ఇంటి ముందు కాపలాగా పనుకోమన్నాడు అనే నిజాన్ని చెప్పేస్తాడు. దానికి మోనిత ఆశ్చర్య పోతుంది. ఈ మధ్య కార్తీక్ ప్రవర్తనలో మార్పు వస్తుంది అని అనుకుంటుంది.

Karthika Deepam 22 October,1490 Episode: మోనితను కార్తీక్ దగ్గర బుక్ చేసిన దుర్గ:

Monitha, karthik, durga

ఇక అంతలో దుర్గ అక్కడికి వచ్చి కొంచెం పాలు ఇవ్వు మోనిత అని అడగగా, నీకు పాలు కాదురా విషం ఇవ్వాలి అని మోనిత అంటుంది. నువ్వు విషం ఇచ్చినా అమృతమే అని దుర్గ అంటాడు. నిజంగానే ఏదో ఒక రోజు నీకు విషం ఇవ్వాలిరా అప్పుడు గానీ నాకు పట్టిన దరిద్రం వదలదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోనిత.ఆ తర్వాత సీన్లో కార్తీక్, బాబుని ఉయ్యాలలో పడుకోబెడుతూ నీది ఎంత మంచి మనసు దీప ఆనంద్ మోనిత బిడ్డ అని తెలిసిన సరే శౌర్య ని, హిమని పెంచినంత ప్రేమతోనే ఆనంద్ ని కూడా పెంచావు అని అనుకుంటాడు. అప్పుడే మోనిత వచ్చి కాఫీ కావాలా కార్తీక్ అని అడుగుతుంది. దుర్గకి ఇచ్చావా అని కార్తీక్ అడగగా, వాడు నాకు ఏమవుతాడని నేను వాడికి కాఫీలు ఇవ్వడానికి అని అంటుంది మోనిత.ఇంతలో దుర్గ అక్కడికి కాఫీ కప్పు పట్టుకొని వచ్చి థాంక్స్ మోనిత నా కోసం చాలా బాగా కాఫీ పెట్టావు అనగానే కార్తీక్ నవ్వుతాడు. కార్తీక్ వీడి మాటలు నమ్మొద్దు,వీడు అబద్ధాలు చెప్తున్నాడు అని మోనిత అంటుంది. కార్తీక్ మోనిత వంక అనుమానంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.అప్పుడు మోనిత దుర్గతో, ఎందుకురా నా జీవితాన్ని ఇలా సాధిస్తున్నావు అని ఏడుస్తూ ఉండగా.. నువ్వు ఏడుస్తున్నా సరే నీ దగ్గర నుంచి వచ్చేది విషపు చుక్కలు మాత్రమే ఎందుకంటే నీ ఒళ్ళంతా విషయమే ఉంది అని అంటాడు దుర్గ

సౌర్య ఆలోచనలో దీప :

Deepa thinking about sourya

ఆ తర్వాత సీన్లో దీప ఇంటి బయట బట్టలు ఆరేస్తూ దసరాలో పండగ ఉత్సవాళ్ళో చంద్రుడు తనని కలిసిన విషయాన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.అదే రోజు నాకు శౌర్య గొంతు వినిపించింది. నిజంగా అది శౌర్య ఎనా? పైగా ఆటో వెనుకాతల అమ్మ నాన్న ఎక్కడున్నారు అని రాసి ఉన్నది నిజంగా శౌర్య ఈ ఊర్లోనే ఉంటే నేను ఆరోజు అనవసరంగా తప్పు చేశాను అని అనుకుని. సౌర్యను ఎలా అయినా వెతకాలి అని సందులన్నీ వెతుకుతూ శౌర్య ఆటో కోసం గాలిస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడున్న పాప్ కార్న్ కొట్టు దీపకి కనిపిస్తుంది. శౌర్యకి పాప్ కార్న్ అంటే ఎంత ఇష్టమో అనుకోగా అదే సమయంలో కార్తీక్ ఆ కొట్టులో పాప్ కార్న్ కొనుక్కొని బయటకు వస్తాడు.

సౌర్యను చూసిన దీప :

Deepa seeing Sourya

తిరిగి చూసేసరికి అక్కడ దీప ఉంటుంది. మీరు ఇది ఎందుకు కొంటున్నారు డాక్టర్ బాబు అని దీప అడగగా, ఏమో వంటలక్క చూసిన వెంటనే కొనాలని అనిపించింది అంటాడు.అప్పుడు దీప, నా శౌర్యకు కూడా పాప్ కార్న్ అంటే ఇష్టమే అని అంటుంది.  ఇక్కడ ఏం చేస్తున్నావు అని దీప ని కార్తీక్ అడగగా శౌర్య కోసం వెతుకుతున్నాను అని దీప అంటుంది. అప్పుడు కార్తీక్  ఆత్రుతతో, శౌర్య ఇక్కడే ఉన్నదా నీకు కనిపించిందా అని అడగగా, లేదు శౌర్య గొంతు వినిపించింది అలాగే ఆటో వెనుకాతల అమ్మ నాన్న ఎక్కడ అని కూడా రాసి ఉంటుంది అందుకే వెతుకుతున్నాను అని దీప అంటుంది. అదే సమయంలో శౌర్య ఇంకొక ఆటో వాడితో ఆటోలో వెళుతూ వీళ్ళిద్దరిని దాటుతుంది. అప్పుడు దీప శౌర్య నీ చూసి శౌర్యా! అని అరుస్తుంది. ఇక దీప, కార్తీక్ ఇద్దరు కూడా సౌర్యను ఫాలో అవుతూ వెళ్లడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 


Share

Related posts

భారీ ధరకు “లైగర్” డిజిటల్ రైట్స్..??

sekhar

బిగ్ బాస్ సీజన్ 6లో కొత్త కొత్త రూల్స్..??

sekhar

Rashmika: ఆ హీరో ఒక్క‌డే న‌న్ను అలా పిలుస్తాడంటూ ఉప్పొంగిపోయిన ర‌ష్మిక‌!

kavya N