టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తొలి పాన్ ఇండియా చిత్రం `కార్తికేయ 2`. చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇందులో కీలక పాత్రను పోషించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో.. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 15వ రోజు కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.21 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. వరల్డ్ వైడ్ గా రూ. 2.43 కోట్ల రేంజ్ లో షేర్ ను దక్కించుకుంది. ఇక `కార్తికేయ 2` 15 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 10.85 కోట్లు
సీడెడ్: 4.27 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.82 కోట్లు
తూర్పు: 2.22 కోట్లు
పశ్చిమ: 1.43 కోట్లు
గుంటూరు: 2.37 కోట్లు
కృష్ణ: 1.92 కోట్లు
నెల్లూరు: 0.90 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ= 27.78 కోట్లు(46.35 కోట్లు~ గ్రాస్)
—————————–
కర్ణాటఖ+రెస్టాఫ్ ఇండియా: 2.45 కోట్లు
ఓవర్సీస్: 5.30 కోట్లు
నార్త్ ఇండియా: 10.55 కోట్లు
——————————–
టోటల్ వరల్డ్ వైడ్= 46.08 కోట్లు(91.30 కోట్లు~ గ్రాస్)
——————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 12.80 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే 15వ రోజు సాధించిన కలెక్షన్స్‌తో రూ. 32.78 కోట్ల లాభాలను సొంతం చేసుకుని అందరికీ దిమ్మతిరిగేలా చేసింది.