NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: దేవ్ జైలుకి.. ముకుంద జీవితం అయోమయం.. ఒక్కటైన కృష్ణ ,మురారి

Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights

Krishna Mukunda Murari Serial Today January 8 2024 Episode 361: క్రిష్ణ ఒక్కతే నిలబడి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మురారి అక్కడికి వస్తాడు. ఏంటి కృష్ణ నువ్వు కూడా ఇలా బాధపడితే ఎలాగా అని మురారి అంటాడు. అయినా మనమీద ఇంత కక్ష కట్టి చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంటుంది అని మురారి అడుగగా.. ఇంకెవరికి ఆ ముకుందకే ఉంటుంది. ముకుందా ఎప్పుడు ఒకరి హెల్ప్ తీసుకోదు. ఒకల్ని ఇలాగా అన్యాయం చేయమని చెప్పద. తనకి ఒకటే ఒక ఆలోచన నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే అంతకుమించి తను ఇలాంటివి చెయ్యదు చేసిన ఎంకరేజ్ చేయదు అని మురారి ముకుంద గురించి కాన్ఫిడెంట్ గా చెబుతాడు. మరి అంత అవసరం ఉంటుంది అని కృష్ణ అంటుంది. నువ్వు ఒకసారి మీ చిన్నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడి రమ్మని మురారి చెబుతాడు. సరే అని కృష్ణ అంటుంది. నేనే కనుక్కునేవాడిని పెద్దమ్మ నేను ఇంట్లో నుంచి బయటకు రాకుండా నా కాళ్లు కట్టేసింది నువ్వు ఒక్కదానివే వెళ్లి అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అని రారే చెబుతాడు. ఈ లోపు నేను ఆ ఉంగరం గురించి డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయమని కానిస్టేబుల్ కి కాల్ చేసి చెబుతాను అని మురారి అంటాడు. ఇక వెంటనే మురారి కానిస్టేబుల్ కి కాల్ చేసి అదంతా ఎక్కడ వరకు వచ్చింది అని అడుగుతాడు. అదే పనిలో ఉన్నామని పోలీసులు చెబుతారు. ఇంటికి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights
Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights

ఆ తరువాత కృష్ణ మురారి చెప్పినట్టుగానే జైలుకు వెళుతుంది‌. కృష్ణ జైలుకు వెళ్లి సుపీరియర్ ఆఫీసర్ ని కలువగా మా బాబాయ్ ని కలవడానికి వచ్చాను అని కృష్ణ చెబుతుంది. సారీ అమ్మ ఆయన నిన్న జైల్లో వేరొక అతన్ని కొట్టారు. ఇప్పుడు ఆయన్ని వేరే సెల్ కి మార్చాము. క్రమశిక్షణ రహితంగా చర్యలు చేసినందున ప్రస్తుతానికి ఆయన్ని ఎవరూ కలవకూడదు అని చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణ ఏంటి ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. చిన్నాన్న ఎవరినైనా ఎందుకు కొడతాడు. ఒకవేళ కొట్టాడు అంటే ఆ రింగ్ ఉన్న వ్యక్తికి ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి చెప్పింది అబద్ధం కాబట్టి అలా చెప్పించిన అతనికి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా? చిన్నాన్నకు ఈ విషయం గురించి ఏమైనా తెలుసా.. తెలిసిన ఇప్పుడు నేను తెలుసుకోవడానికి వీలుపడటం లేదు కదా అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights
Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights

ఇక కృష్ణ ఇంటికి వచ్చేసరికి శకుంతల గుమ్మంలో నిలబడి ఉంటుంది. కృష్ణ శకుంతల పక్కన నిలబడి ఉండగా ఆ ఇంటి నుంచి నవ్వులు వినిపిస్తాయి. ఏంది బిడ్డ ఏంది నీ జీవితం ఎట్లా అవుతుంది? రేపొద్దున కల్లా నీ పెనిమిటితో ఆ ముకుంద కి లగ్గం జరుగుతుంది. అదే కనుక జరిగితే ఇంకేమైనా ఉందా అని శకుంతల అంటుంది అప్పుడే అక్కడికి రేవతి నందిని వస్తారు. కృష్ణ నీకు ఎలా ఉంది ఉందో తెలియదు కానీ నాకు మాత్రం నీ మీద చాలా భయంగా ఉంది అని అంటుంది. అప్పుడే మురారి కూడా అక్కడికి వస్తాడు కృష్ణ ఒకవేళ ఈ పెళ్లి జరిగేటట్టుగా ఉంటే నువ్వు ఏం చేసుకుంటావోనని నాకు భయంగా ఉంది. ఈ పెళ్లి జరిగే వరకు నువ్వు నా పక్కనే ఉండాలి రా ఇంటికి వెళ్దాం అని రేవతి కృష్ణ ని రమ్మని పిలుస్తుంది. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు అని మురారి అంటాడు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు. మీకు ఉన్నంత ధైర్యం మాకు లేదు అని రేవతి అంటుంది. కృష్ణ పొద్దున్నుంచి చిన్నమ్మ భోజనం కూడా చేయలేదు అని నందిని అంటుంది. ఒక్క పూట భోజనం చేయకపోతే నేనేం చావనులే అని కోపంగా రేవతి అరుస్తుంది. అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు కృష్ణని నేను తీసుకు వస్తాను అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights
Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights

ఇక మురారి కృష్ణ ఇద్దరూ ఇంట్లో మేడ మీద నిలబడి ముకుంద గోరింటాకు పెట్టుకోవడం చూస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణ ఎ సి పి సార్ ఈ పెళ్లి జరిగితే నేను మీకు మాజీ భార్యను కదా అని కృష్ణ అంటుంది. అలా మాట్లాడుతూ కృష్ణ అనే మురారి అంటాడు. నేను ఓ ఆడపిల్ల నే కదా ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది అయినా నీ ధైర్యం అంత ఏమైపోయింది కృష్ణ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని మురారి అడుగుతాడు. నాకున్న ధైర్యాన్ని పరిస్థితుల అనుకూలంగా మార్చుకోలేను కదా.. పరిస్థితులు ఎటైనా మారొచ్చు అనే కృష్ణ అంటుంది. ఇంక ఎలా మాట్లాడాలి. నా స్థానాన్ని అని క్రిష్ణ ముకుంద వైపు చూస్తూ వాళ్ళు తీసేసుకుంటారు అని కృష్ణ అంటుంది. అలా మాట్లాడకు కృష్ణ అని మురారి అంటాడు ఈ విషయంలోనైనా రాజీ పడొచ్చు కానీ ఈ విషయంలో రాజీ పడకూడదు అని కృష్ణ అంటుంది. ఇలా అని క్రిష్ణ మాట్లాడుతూ ఏడుస్తుంది. మురారి కృష్ణని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు.

Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights
Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights

పిన్ని అంతా అయిపోయిందా మనం ఇంకా ఏం చేయలేమా అని నందిని అంటుంది. నేనే నా కొడుకు జీవితంని నాశనం చేస్తున్నాను. ఏంటి పెద్దమ్మ అలా మాట్లాడుతున్నావు అని మధు అంటాడు. మనందరం తప్పు చేస్తున్నాం పెద్దమ్మ అని మధు అంటాడు అప్పుడే అక్కడికి దేవ్ వస్తారు మీరందరూ ఎదురు తిరిగి మాట్లాడాలి కదా అని నందిని చూసి దేవ్ అంటాడు. అలా మాట్లాడితే కదా అని నందిని అంటుండగా భవాని దగ్గరకు వెళ్తాడు. అప్పటికే భవాని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని చెబుతుంది. మీరు చేసేదే తప్పు , మళ్లీ వీళ్ళకి భోజనాలు కూడానా అని దేవ్ అనగానే భవాని దేవి కోపంగా దేవ్ వైపు చూస్తుంది. దెబ్బకి అందరూ అక్కడికి వస్తారు. పోనీలే కదా అని వదిలేస్తున్న నన్నే తప్పు పడతావా హౌ డేర్ యు అని దేవుని అరుస్తుంది భవాని. భవాని దేవ్ కి క్లాస్ పీకుతోంది అప్పుడు దేవ్ కృష్ణ దగ్గరికి వెళ్లి నువ్వేం బాధపడకు.. మీ బాబాయిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చేతిలో చెయ్యేసి చెప్తాడు. అప్పుడే కృష్ణ దేవ్ చేతి ఉంగరాన్ని గుర్తుపడుతుంది. వెంటనే అప్పుడు శ్రీధర్ ముఖం మీద ఎవరైతే ఉంగరం గుర్తు ఉన్నదో అదే ఉంగరం గుర్తు అదే ఉంగరాన్ని, దేవ్ చేతికి పెట్టుకోవడం చూసి కృష్ణ షాక్ అవుతుంది. వెంటనే దేవ్ కాలర్ పట్టుకుని ఎంత మోసం చేశావు. యూ చీటర్ నువ్వే కదా ఇదంతా చేసింది అని అంటుంది. ఇంట్లో అందరూ ఒక సరిగా షాక్ అవుతారు. మురారి అక్కడే ఉంటాడు. మురారి ఏంటి కృష్ణ అని అనగానే శ్రీధర్ ని చంపింది. ఇదంతా చేసింది దేవ్ అని అందరి ముందు చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights
Krishna Mukunda Murari Today Episode January 08 2024 Episode 361 Highlights

ఇక వెంటనే దేవ్ దగ్గరకు మురారి వచ్చి యూ రాస్కెల్ ఇలా ఎలా చేశావు అని అడగగా.. ఏంటి బావ అలా మాట్లాడుతున్నావ్ అని దేవ్ అంటాడు ఇదిగో ఈ హత్య చేసిన అతనికి ఇదే రింగ్ ఉంది అని మురారి అంటాడు అప్పుడు భవాని మురారి కి మ్యాచ్ చెప్పడానికి దగ్గరికి వస్తుంది నువ్వు ఆగు పెద్దమ్మ అని మురారి అంటాడు ఇక లాభం లేదు అడ్డం తిరగాలి అని దేవ్ అనుకుంటాడు.. ఏంటి బావ ఇలాంటి ఉంగరం నేనొక్కడినే కొన్నానా? చాలామంది కొంటారు అని దేవ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు అదే చెప్పబోతున్నాను అని భవాని అంటుంది. సరిగ్గా అదే సమయానికి పరిమళ అక్కడికి వచ్చి పలానా స్టోర్లో ఆరు రోజుల ముందు ఈ ఉంగరాన్ని కొన్నాడు అని పరిమళ చెబుతుంది. ఇక పోలీసులు కూడా సరిగ్గా అదే సమయానికి వచ్చి సిసి ఫొటోస్ చూడండి అని చూపించబోతుంటే.. దేవ్ వద్దు అని నేనే నా చెల్లెలి సంతోషం కోసం ఇదంతా చేశాను అని దేవ్ ఒప్పుకుంటాడు. అప్పుడు భవాని కి మురారి, కృష్ణ ఈ విషయంలో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. అప్పుడు ముకుందా కోపంగా దేవ్ దగ్గరికి వచ్చి చంప చెల్లుమనే లాగా కొట్టి నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసావ్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని ముకుంద బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ చూస్తుండగానే దేవ్ పోలీసులతో కలిసి వెళ్లిపోతాడు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu