Krishna Mukunda Murari: రేవతి దగ్గరికి నందు వచ్చి మీతో ఒక మాట మాట్లాడొచ్చా పెద్దమ్మ అని అంటుంది. పర్వాలేదు చెప్పు అని అంటుంది రేవతి. కృష్ణా మురారిల ఆక్సిడెంట్ గురించి అమ్మ చెప్పింది. నిజమేనా పిన్ని అని అడుగుతుంది. అవును నందు నిజమే కానీ ఒక్కోసారి మన కళ్ళతో చూసినవి కూడా నమ్మకూడదు అని అంటారు కదా నాకు కూడా ఈ విషయంలో అదే అనిపిస్తుంది. కృష్ణ వాళ్ళు ఇలా చేశారు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నీకు కృష్ణ ఇలా చేసింది అంటే నమ్మబుద్ధి కాకపోతే నాకు ఒక హెల్ప్ చెయ్యి అని రేవతి అడుగుతుంది. వాళ్ళిద్దర్నీ కలపమని రేవతి చేతులు పట్టుకొని నందు ని వేడుకుంటుంది. అయ్యో పిన్ని మీరు నాకు ఇంతలా చెప్పాలా అని అంటుంది.

ముకుంద మురారి ప్రవర్తన చూసి కంగుతింటుంది. కృష్ణ మురారి విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ఒక అతను వచ్చి మేడం మీ సర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి షర్టుని చూపిస్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత చూసావా ముకుందా నేను మురారి భార్యను అని చెప్పినందుకే ఏసీబీ సార్ తనకి షర్టు కొనిచ్చాడు. మురారి మనసులో నా స్థానం ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమైంది అనుకుంటా అని కృష్ణ అంటుంది. కృష్ణ మాటలు వింటున్న ముకుంద కి ఒళ్ళు మండిపోతుంది.

నందిని వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళ పిన్ని చెప్పింది విన్న తర్వాత అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని శకుంతల దగ్గరకు వెళుతుంది. శకుంతల నందిని చూసి కృష్ణలేదు కాసేపట్లో వస్తుంది కూర్చోమని చెబుతుంది. ఎవరు మీరు అని నందిని శకుంతల అడుగగా ఈమెతో మామూలుగా మాట్లాడితే నాతో ఓపెన్ గా మాట్లాడదు. ఈమెను నవ్విస్తూ మాట్లాడాలి అని నేను భవాని వాళ్ళ కూతుర్ని అని శకుంతల అత్తయ్య అని పిలుస్తుంది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని నందిని అడుగగా.. మీ మావయ్య రోడ్డు పక్కన చేలల్లో పడి ఉన్న కృష్ణుని తీసుకువచ్చి హాస్పటల్లో జాయిన్ చేశాడు. తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న హాస్పిటల్లోనే మురారి కనిపించాడు. అంతకుమించి మాకు మా బిడ్డకు ఏమీ తెలియదు అని శకుంతల చెబుతుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా షాపింగ్ చేసిన కృష్ణ ఇంటికి వస్తుంది. నందిని చూసి పలకరించాలని ఉన్నా కానీ భవాని అత్తయ్య ఏమంటుందో అని ఎలా ఉన్నారు మేడం అని పలకరిస్తుంది. చాల్లే ఆపు అని నందు ఆప్యాయంగా కృష్ణ ని దగ్గరికి తీసుకుంటుంది.

నందిని తెలుసుకున్న విషయాన్ని గౌతమ్ మధుకి చెబుతుంది. మురారి గతం మర్చిపోయినా కృష్ణతో ఫ్రెష్ గా లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకునే ఉండొచ్చు. మీరు అనుకుంటున్నట్టు సినిమాల్లో లాగా గతం గుర్తుకురాదు. మురారి కి గతం గుర్తు చేయడానికి ప్రయత్నించొచ్చు అని గౌతమ్ అన్న మాటలను విని భవాని పెద్దగా అరుస్తుంది. అప్పుడే మురారి ఇంట్లోకి వస్తాడు. ఇక అందరూ మౌనంగా ఉండేసరికి ముందుగానే నందిని గౌతమ్ వస్తారు అని చెప్పిన మాటలు గుర్తొచ్చి నందిని అని ఆప్యాయంగా పలకరిస్తాడు మురారి. మురారి నీకే ఎందుకు ఇలా జరగాలి, మన ఫ్యామిలీకి ఎలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని నందిని బాధపడుతుంది. ఇప్పుడు నాకు ఏమైంది అంతా బాగానే ఉంది కదా అని మురారి అంటాడు. ముకుందా నువ్వైనా చెప్పు ఉండొచ్చు కదా నందిని వాళ్ళు వస్తున్నారని చెబితే వాళ్లకి కూడా షాపింగ్ చేసేవాళ్ళం అని మురారి అంటాడు. పర్వాలేదు నాన్న నేను బుక్ చేస్తాను అని చెబుతుంది. భవాని అప్పుడు రేవతి రెండు చీరలు కొందాము అని అంటే రెండేంటి నాలుగైనా తీసుకోమని మురారి అంటాడు. మర్చిపోయాను రేపటి పూజకి డాక్టర్ కృష్ణవేణి కూడా రమ్మన్నాను అని మురారి అంటాడు. ఆ మాటకి భవాని కూడా సైలెంట్ గా ఉంటుంది.

మురారి షాపింగ్ పూర్తయిన తర్వాత కృష్ణ వాళ్ళింటికి వెళ్తాడు కృష్ణ వాళ్ల చిన్నమ్మతో మాట్లాడుతూ వుంటుంది అప్పుడే తీసుకువస్తాడు. కృష్ణని నైట్ టైం మురారి ఒంటరిగా బయటికి రమ్మంటాడు. ఏంటో చెప్పండి సార్ అని అంటుంది. మీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని రింగ్ చూపిస్తాడు. ఇది ఎప్పుడు తీసుకున్నారు అని కృష్ణ అడుగుతుంది షాపింగ్ చేసేటప్పుడు తీసుకున్నాను మీరు మాటల్లో చెప్పి ఈ గిఫ్ట్ నన్ను ఇవ్వకుండా చేస్తున్నారని నాకు అర్థం అయ్యింది. ఇక వెంటనే కృష్ణ చెయ్యి తీసి ఎవరు చూడకుండా, కృష్ణకి ఆ రింగు ని తొడిగేస్తాడు మురారి. దూరం నుంచి ఇదంతా ముకుంద చూస్తూనే ఉంటుంది. కృష్ణ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. రేపు ఇంట్లో పూజకి నేను ఇచ్చిన చీర కట్టుకొని రమ్మని మురారి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

మురారి రేవతిని అమ్మ వేణి గారిని తీసుకురా తనని పూజలో కూర్చోబెట్టు అని మురారి అంటాడు. కానీ మురారి పక్కన ముకుంద వచ్చి కూర్చుంటుంది. అప్పుడే గౌతమ్ మురారి కి అటు పక్కన కూర్చోమని చెబుతాడు. ఇక కృష్ణ సంతోష పడుతూ తన చేతికి ఉన్న రింగ్ చూసుకుంటూ పక్కన ఉన్న మురారిని చూస్తూ సంతోష పడుతూ ఉంటుంది అప్పుడే ముకుందా నేను నిన్న షాపింగ్ లో ఒక రింగ్ కొనుక్కున్నాను అత్తయ్య అది కృష్ణ చేతికి ఉంది. ఆ రింగ్ నాదే అత్తయ్య అని భవానితో చెబుతుంది ముకుందా. కృష్ణ మురారి పెట్టిన రింగుని ముకుందకి ఇస్తుందా.. లేదంటే మురారి తానే కృష్ణకి రింగ్ తోడిగానని చెబుతాడా.. ఇక ఈ సీన్ ఎటువైపుకి టర్నింగ్ తిరుగుతుందో చూడాలి.