Krishna Mukunda Murari: కృష్ణ మురారి మాట్లాడుకుంటూ ఉంటారు. మురారి కృష్ణ ఒడిలో పడుకుని నిద్ర పోతాడు. ఇక నిద్ర లేచిన వెంటనే రాత్రంతా ఇలా మీ ఒడిలోనే నిద్రపోయాన అని అంటాడు. అవును అని కృష్ణ అంటుంది. మీతో మాట్లాడుతునే నేను నిద్ర పోయనా, అప్పుడు లేపచ్చు కదా అని అంటాడు. కృష్ణ నాకు గతం గుర్తుకు రాకపోతే బాగుండు అని మురారి చెప్పి వెళ్ళిపోతాడు. ఏసిపి సార్ లైఫ్ లో నేను గతంలో ఏంటో తెలీదు కాబట్టి ఇప్పుడు కావాలని అనుకుంటున్నారు అని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

మురారి కృష్ణ ముగ్గేస్తుండగా తన దగ్గరకి వెళ్తాడు. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని మురారి కృష్ణని అడుగుతాడు. ఇలాంటి పర్మిషన్స్ ఏమీ అవసరం లేదని చెప్పాను కదా అడగండి సార్ అని కృష్ణ అంటుంది. ఇంకోసారి అలా అనను ఒకవేళ అంటే నా చెంప పగలగొట్టండి అని మురారి అంటాడు సార్ అని కృష్ణ ఆగిపోతుంది. మీరంటే నాకు అని చెప్పబోతూ ఆగిపోతే ఆ నేనంటే మీకు అని అంటాడు. అప్పుడు కృష్ణ మీరంటే నాకు అపారమైన అభిమానం, గౌరవం అని కృష్ణ అంటుంది. ఎందుకు అని మురారి అడుగుతాడు. మీ పెద్దమ్మ చెప్పారు కదా మీరు నన్ను డాక్టర్ని చేశారని. అలాగే అని కృష్ణ అంటుంది. మీరు చాలా గ్రేట్ కృష్ణవేణి గారు ఒకపక్క డాక్టర్ గా సేవలందిస్తూనే గృహిణిగా ఇంట్లో పనులన్నింటినీ పూర్తి చేస్తున్నారు అని అంటాడు. అలా మాటల మధ్యలో కృష్ణ మురారి ఇద్దరు తలకి ఢీకొట్టుకుంటారు. ఇదంతా ముకుందా మిద్దె మీద నుంచి గమనిస్తూ ఉంటుంది. మీరు ముగ్గు బాగా వేశారు. కేవలం ఆడవాళ్లు మాత్రమే ముగ్గు వేస్తారా అంటే లేదు మగవాళ్ళు కూడా ముక్కు వేయచ్చు అని కృష్ణ అంటుంది. అయితే నాకు రాదు అంటే కృష్ణ మురారి కి ముగ్గు వేయడం నేర్పిస్తుంది.

మురారి ఎక్కడికి వెళ్ళాడు అని భవాని మధుని ఆరా తీస్తుంది. ఏం అడిగినా తెలీదు అని అనడంతో భవాని కోపంగా నీకు ఏమీ తెలియదు. ఫుల్లుగా ముందు తాగడం ఆ కృష్ణ మురారి లను కలపడం నీకు తెలుసా రేవతి ఫుల్లుగా మందు తాగేసి తన ఫోన్లో మురారి కి ముకుందతో కలిసి అమెరికా వెళ్ళొద్దని, ఆ కృష్ణని తీసుకొని లేచిప్పోమన్ని మెసేజ్ పెట్టబోయాడు. ఇదంతా నేను చూశాను కాబట్టి సరిపోయింది. వీడు నీకు లాగానే నాకు చెప్పలేక మౌనంగా లోలోపల బాధపడుతున్నాడు. నువ్వు కూడా అంతే అని భవాని మధు రేవతి లకు చివాట్లు పెడుతుంది. మన మురారి ఆ కృష్ణమూర్తి వెళ్లొద్దు అలా వెళ్లకుండా చేయమంటే మీరిద్దరూ నా మాట వినడం లేదు. ఎలాగో ఆ పెద్దపల్లి ప్రభాకర్ తప్పు చేస్తే ఒప్పుకున్నాడు. పోనీ మీ దృష్టిలో తప్పు చేయలేదు అని మీరు అనుకుంటే ఎలా చేయలేదు నిరూపించండి. అప్పుడు నేను కూడా నమ్ముతాను కదా అని భవాని అంటుంది. అప్పుడే మురారి ఇంట్లోకి వస్తాడు. ఎక్కడికి వెళ్లావు నాన్న అని అడిగితే తలనొప్పిగా ఉంటే ఆ కృష్ణవేణి దగ్గరకు వెళ్లి వస్తున్నాను అని మురారి అంటాడు. ఇక ఆ మాటకు కోపం వచ్చిన భవాని చూశారుగా మురారి ఏం చెబుతున్నాడు మీ సమస్యకు ఒకటే పరిష్కారం. ఉన్నపలంగా మురారి ముకుందను అమెరికా పంపించాలి అని భవాని అంటుంది.

కృష్ణ తులసిమ్మ తల్లికి దండం పెట్టుకుంటుంది. ఆ ఇంట్లో ఏం జరగబోతుందో నాకు ముందుగానే చెబుతున్నావు తల్లి, అలాగే మురారిని నన్ను కలపమని వేడుకుంటుంది. ఇక అప్పుడే ముకుందా కృష్ణ దగ్గరకు వస్తుంది. ఏంటి మురారి నీకు దక్కని భయపడుతున్నావా అని ముకుందా అంటే.. కృష్ణ హారతి తీసుకోమని ముకుంద కి చూపిస్తుంది. కృష్ణ నా చేతిలో ఉన్న ఈ కవర్ ఏంటో నీకు తెలుసా మీ ఆశలన్నింటినీ అడియాసలు చేస్తుంది ఈ కవర్ అని ముకుంద అంటుంది. కృష్ణ ఇంకా నాలుగు రోజులు మాత్రమే నా మురారి నీకు కనిపిస్తాడు అని ముకుందా అంటుంది. ఆ మాటని కృష్ణ కంగు తింటుంది. దీనికే ఇలా అయిపొయావు. పూర్తిగా విషయం తెలిస్తే ఏం అయిపోతావు. ఇవి మురారి నేను అమెరికా వెళ్లబోయే టికెట్స్ అని ముకుంద అంటుంది. కృష్ణ స్ట్రాంగ్ గా వెళ్ళు వెళ్లి త్వరగా మురారి తో అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకో అని తులసమ్మ సాక్షిగా చెబుతుంది. నేను ఇచ్చిన షాక్ కి ముకుంద గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మురారి అక్కడికి వస్తాడు. శుక్రవారం ఏ నా అమెరికా ప్రయాణం. కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు. కానీ నేను మిమ్మల్ని ఎందుకు వెళ్ళమంటున్నాను అంటే.. మీ మదిలో ఎన్నో ప్రశ్నలకు అక్కడ సమాధానం దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది అని కృష్ణ అంటుంది. మనం ఏ పని చేయడానికి భయపడతామో ఆ పని చేసేస్తే ఆ కిక్కే వేరు అని కృష్ణ అంటుంది. వెళ్ళమంటారా అని మురారి కృష్ణను అడిగితే వెళ్ళండి అని అంటుంది. మీ మాట కాదు అనలేక వెళ్తాను అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ముకుంద కృష్ణ చెప్పిన మాటలు భవానికి చేర వేస్తుంది. ఆ మాటలకు కోపం వచ్చినా భవాని పెద్దగా రేవతి అని పిలుస్తుంది. ఏంటి ఆ కృష్ణ కొత్త నాటకానికి తెర తీసింది. అని అనగానే ఏంటమ్మా కొత్త నాటకం తెరతీసింది అని అంటున్నావు ఎవరిని అని నందు అడుగుతుంది. ఇంకెవరు ఆ కృష్ణ మొన్నటి వరకు మురారి అమెరికా వెళ్తున్నాడు అంటే తెగ కంగారు పడిపోయింది కానీ, ఇప్పుడు మాత్రం ఇంకా ముందే అమెరికా వెళ్లొచ్చు అని చెబుతుంది. అసలు ఏంటి తన ప్లాను అని భవాని అంటుంది.

ఇక రేపటి ఎపిసోడ లో మనం అమెరికాలో ఎన్ని రోజులు ఉంటాము అని మురారి ముకుందని అడుగుతాడు. ఎవరైనా ఇక్కడే పర్మినెంట్ గా ఉండిపోమంటే ఉండిపోదాము అని ఆ కృష్ణ మీతో చెప్పిందా అని ముకుందా అడగగానే.. లేదు కృష్ణ నీతో పాటు అమెరికా వెళ్ళమని నాకు చెప్పింది అని మురారి అంటాడు. ఎలాగూ కృష్ణవేణి గారు నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, అమెరికాలో ఏ డాక్టర్ అయితే నాకు ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ కృష్ణకి ఇస్తే కృష్ణ వాళ్లతో మాట్లాడుతుంది కదా అని మురారి భవానితో అంటాడు. ఇప్పుడు అక్క కృష్ణకి ఆ డాక్టర్ నెంబర్ ఇస్తే ముకుంద వేషాలకు అడ్డు కట్ట పడుతుంది అని రేవతి మనసులో అనుకుంటుంది. ఇక ఆ డాక్టర్ నెంబర్ భవాని కృష్ణకు ఇస్తుందా లేదా అనేది చూడాలి.