Krishna Mukunda Murari:కృష్ణా ముకుందా మురారి సీరియల్లో ముకుంద గురించి మనందరికీ తెలిసిందే, ఈమె అసలు పేరు యష్మి గౌడ.1995 ఆగస్టు 30న ఈమె బెంగళూరు కర్ణాటకలో జన్మించింది. చిన్నతనం నుంచి నటన మీద ఇంట్రెస్ట్ తో ఈమె మోడలింగ్‌లో అడుగుపెట్టి తర్వాత కన్నడ టీవీ షోస్ లో 2017 లో ఎంటర్ అయింది.
కన్నడంలో కొన్ని సీరియల్స్ లోనూ మరియు నటించి మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈమె తెలుగులో స్వాతి చినుకులు తో అందరికీ పరిచయమైంది నాగభైరవి సీరియల్ లో భైరవి పాత్రలో బుల్లితెర మీద ఒక వెలుగు వెలిగిన నటి యశ్మీ గౌడ. సీరియల్స్ లో తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసి క్యారెక్టర్ ఏదైనా సరే ఇట్టే వదిలిపోయే ఈ ముద్దుగుమ్మ ఫాన్స్ కోసం తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో ముకుంద క్యారెక్టర్ లో ఇప్పుడు తెలుగుబుల్లితెర మీద తన నటనతో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్లోహీరోని అమితంగా ప్రేమించే హీరోయిన్ పాత్రలో, కొంత నెగిటివ్ కొంత పాజిటివ్ యాక్టింగ్ తో అందర్నీ అలరిస్తోంది మనం ముకుంద. రీసెంట్ గా మాటీవీలో జరిగిన” గణపతి బప్పా మోరియా” ప్రోగ్రాంలో కనిపించి అందరినీ అలరించింది.
పండగ ఏదైనా సరే బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మా టీవీ. ఇక వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ షోలో రవి,వర్షిని యాంకర్స్ గా చేసి అలరించారు. ఈ షోలో సిటీ టీం పల్లెటూరు టీం గా విడిపోయి ప్రేక్షకులకు కామెడీ పంచుతారు. ఈ షోలో ముకుంద తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, తన ఫ్రెండ్స్ ను టాగ్ చేసింది.
ఈ పిక్ లో ముకుంద తో పాటు లహరి రాఘవేంద్ర మరియు రౌడీ సిద్ధ, సంయుక్త,రాజీవ్,ఇలా బుల్లితెర నటులతో వీళ్లే నా ఫ్రెండ్స్ మరియు నా ఫ్యామిలీ అని పోస్ట్ చేసింది.ముకుంద దిగిన ఫోటో ఇప్పుడుమీరు చూసేయండి.