Krishnamma Kalipindhi Iddarini: చూపు లేని వాడికి చూస్తూ చూస్తూ నా కూతుర్ని ఎలా ఇవ్వాలని ఆలోచించాను కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని తెలిపాక కాదనలేక ఒప్పుకున్నాను నువ్వు నీ చెల్లెలు జీవితాంతం ఏ కష్టం లేకుండా బ్రతుకుతారని అలా చేశాను అంతే తప్ప ఇందులో ఎలాంటి మోసం లేదమ్మా అని భవాని అంటుంది. అది సరే అమ్మ ఆ మాటే వాళ్లతో చెబుదువు గాని పద అని గౌరీ అంటుంది. ఇప్పటికే మీ ఆయన కోపంతో ఉండి ఉంటాడు ఇప్పుడు నేను వచ్చి చెప్తే ఆ అబ్బాయి అర్థం చేసుకోకపోవడం కాదు కదా తన కోపం ఇంకా ఎక్కువ అవుతుంది దానివల్ల నువ్వు నీ చెల్లెలు ఆ ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి రావలసిన పరిస్థితి వస్తుందమ్మా అని భవాని అంటుంది. అయితే ఆయన బాధకి ఈ సమస్యకి నా కన్నీళ్ళకి పరిష్కారం ఏంటమ్మా ఆయన నన్ను ఒక భార్యగా చూడడం లేదు ఆ బాధని నేను ఎలా భరించగలను అని గౌరీ అంటుంది.

వీటన్నింటినీ జయించే శక్తి నీకు ఉంది అతని మీద నీకున్న ప్రేమ బలమైనది అయితే రెండు మనసుల మధ్య అపార్థాలతో కొంతకాలం దూరం ఏర్పడుతుంది తప్ప ఎప్పటికీ విడిపోయే పరిస్థితి రాదు అందుకే ఈ క్షణం నుంచి ఈ కన్నీళ్లను వదిలేయ్ నీ ప్రేమతో నీ భర్తని ఎలా గెలుచుకోవాలో ఆలోచించు నీ మంచి తనంతో అతనిలో ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయి నిన్ను ప్రాణంగా ప్రేమించిన వాడు నిన్ను అర్థం చేసుకోకుండా ఉంటాడా చూస్తూ చూస్తూ నిన్ను దూరం చేసుకోగలడా అమ్మ గౌరీ ఈ పరిస్థితులన్నీ త్వరలోనే సర్దుకుంటాయి మీరందరూ సంతోషంగా ఉంటారు అమ్మ గౌరీ నీ కాపురమే కాదు నీ చెల్లెలు కాపురం కూడా నీ చేతుల్లోనే ఉంది ఇన్నాళ్లు నువ్వు ఈ ఇంటిని ఎలాగైతే చక్కదిద్దావో మీ కాపురాలను కూడా నువ్వు అలాగే చక్కదిద్దుకో తల్లి మీ కాపురాలకు ఏమన్నా అయితే నేను మీ నాన్నగారు గుండె పగిలి చేస్తాం అర్థం చేసుకో తల్లి అని భవాని అంటుంది. కట్ చేస్తే ప్లీజ్ సార్ తప్పైపోయింది క్షమించండి అని ఒక ఎంప్లాయ్ అంటాడు.

నాకే అబద్ధాలు చెప్తావా కొన్నాళ్ల నుంచి నా లైఫ్ లో అందరూ మోసగాళ్లే కనపడుతున్నారు అని ఈశ్వర్ అంటాడు. లేదు సార్ నేను నిజమే చెబుతున్నాను దయచేసి నన్ను నమ్మండి సార్ ప్లీజ్ సార్ అని ఎంప్లాయ్ అంటాడు. నువ్వు అబద్ధం చెప్పావని ఆధారాలు ఉన్నాయి నువ్వు మోసం చెయ్యలేదని నిరూపించుకోగలవా అని ఈశ్వర్ అంటాడు. సార్ నేను నిరూపించుకొని చూపిస్తాను సార్ అని ఆ ఎంప్లాయ్ అంటాడు. మోసం చేయని వాడు తన తప్పు లేదని నిరూపించుకోవాలని చూస్తాడు అంతే తప్ప కన్నీళ్లు పెట్టుకోడు గెట్ అవుట్అని ఈశ్వర్ అంటాడు. కట్ చేస్తే స్వామి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడం ఒక వరంగా భావించాను బ్రతికినంత కాలం ఆయన రుణం తీర్చుకుంటూ ఆయన సంతోషం కోసం బ్రతకాలి అని అనుకున్నాను కానీఆయన బాధపడడానికి కారణం నేనే అయ్యానని భరించలేకపోతున్నాను స్వామి మా ఇద్దరి మనసులు అద్దమంత పారదర్శకంగా మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని ఆయన చెప్పారు నేను అలాగే ఉంటానని ఆయన నమ్మారు కానీ ఆయన నా మీద పెట్టుకున్నా నమ్మకంలో నేను ఓడిపోక తప్పలేదు ఆయనకు నేను నిజం చెప్పకపోవడం చాలా పెద్ద తప్పే కానీ ఎలాంటి పరిస్థితుల్లో నేను చెప్పలేకపోయాను అనేది ఆయన నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు స్వామి నా కుటుంబం కోసం నా చెల్లెలి కోసం నన్ను నేను మార్చుకుంటున్నాను

నా మీద పడిన నిందను పోగొట్టుకోవడానికి నా భర్త మనసును మార్చుకోవడానికి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను ఇకనుంచి ఈ కన్నీళ్లను దిగమింగుతానే తప్ప పైకి కనపడనివ్వను ప్రతిక్షణం నా భర్త సంతోషం కోసమే ప్రయత్నిస్తాను అమ్మ కనకదుర్గమ్మ తల్లి ఇప్పటివరకు నా ప్రతి అడుగులోనూ నువ్వే తోడుగా ఉన్నావు ఇప్పుడు మొదలు పెట్టబోతున్న నా సంకల్పానికి నువ్వే అండగా నిలబడి నన్ను గెలిపించు తల్లి అని గౌరీ అంటుంది. కట్ చేస్తే గౌరీ ఈశ్వర్ రూములో సాంబ్రాణి పొగ వేస్తుంది.భానుమతి చూసావా పెద్ద మనవడి గదిలో సాంబ్రాణి ఎలా గుబాలిస్తుందో సాంబ్రాణి అందరూ భక్తికి ప్రతీక అంటారు ఆ వాతావరణం రొమాన్స్ కి ప్రతీక అని భానుమతి వాళ్ళ ఆయన అంటాడు. ఊరుకోండి మీ మాటలు మీరు అని భానుమతి అంటుంది. ఏంటి పొగ అని ఈశ్వర్ అంటాడు. పొగ కాదండి సాంబ్రాణి అని గౌరీ అంటుంది. అది ఏంటి అనేది కాదు నేను అడిగింది ఎందుకు అని అడిగాను అని ఈశ్వర్ అంటాడు. మీకు సాంబ్రాణి అంటే ఇష్టమట కదా భర్త ఇష్టాలని తెలుసుకొని ఆచరించడం భార్యగా నా ధర్మం కదా అని గౌరీ అంటుంది. భర్తని ఎలా ఆకట్టుకోవాలో చెప్పావు నువ్వు సూపరు మనవరాలా అని వాళ్ళ తాతయ్య అంటాడు. చూడు గౌరీ ఇకమీదట నుంచి ఇలాంటి పొగలు ఎప్పుడూ నా గదిలో వేయకు అని ఈశ్వర్ అంటాడు.

నీ భార్య నీ ఇష్టం తెలుసుకొని సాంబ్రాణి వేస్తుంటే ఇవన్నీ వద్దంటావ్ ఏంట్రా అని వాళ్ళ నాయనమ్మ అంటుంది. గౌరీ అలా సాంబ్రాణి వేస్తుండగా ఈశ్వర్ కళ్ళల్లో నలకపడుతుంది. గౌరీ వాడి కళ్ళల్లో నలకపడింది తీయమ్మ అని భానుమతి అంటుంది. దూరంగా ఉండి తీస్తాను మీరు అలాగే ఉండండి అని గౌరీ అంటుంది. దూరం అని చెప్పి ఇంత దగ్గరగా వస్తావే అని ఈశ్వర్ అంటాడు. మన మధ్య ఈ మాత్రం దగ్గర ఉండాలి నలక తీయడం గురించి స్వామి అని గౌరీ నాలుకతో నలకతీస్తుంది ఏవండీ నలక పోయిందా అని గౌరీ అడుగుతుంది. ఇంకోసారి ఇలాంటివి చేయకు అని ఈశ్వర్ అంటాడు. ఏంటండీ ఎలాంటివి అని గౌరీ అంటుంది.ఇదే నలకలు కలకలు అని ఈశ్వర్ అంటాడు. కలకలం కాదండి కేవలం నలకలే అని గౌరీ అంటుంది.అసలే చిరాకు లో ఉన్నాను జోకులు వేయకు అని ఈశ్వర్ అంటాడు. నలకపడింది తీసేశాను దానికి ఎందుకండి ఇంత చిరాకు పడతారు మనల్ని బాధ పెట్టేది ఏదైనా తీసేయాలి అది నలకైనా ఇంకేదైనా అని గౌరీ అంటుంది.నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు కానీ ఆ విషయం నా మనసులో నుంచి పోదు ఆ విషయం ముందు నువ్వు తెలుసుకో చూడు నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా తాతయ్య వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నువ్వు నా కంట్లో నాలకను తీయడం ఎందుకు ఆపేయలేదు అని ఈశ్వర్ అంటాడు. వాళ్లు వెళ్లిపోయారని మీకు తెలిసినప్పుడు ఆపేయమని మీరు ఎందుకు చెప్పలేదు అని గౌరీ అంటుంది. అవును కదా నేనెందుకు అలా చేయలేదు అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు. కోపంలో నైనా ప్రేమ బయటికి వస్తుంది మీరు అది తెలుసుకోండి మాస్టారు అని గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది