Krishnamma Kalipindhi Iddarini: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈ సీరియల్ కి ఒక ప్రత్యేకత ఉంది ఈ సీరియల్ లో హీరో కి కళ్ళు కనిపించవు. అలాంటి ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకున్న ఈశ్వర్. ఇతని అసలు పేరు విజయ సూర్య. ఇతను 1990 నా కర్ణాటక లో బెంగళూరులో జన్మించాడు. ఇతని బాల్యమంతా బెంగళూరులోనే సాగింది. ఇతని అమ్మ పేరు లలితాంబ నాన్న గారి పేరు నాగరాజు. విజయ్ సూర్య కన్నడలో మూడు సినిమాలు, ఆరు టెలివిజన్ సీరియల్స్ లో, నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కన్నడంలో మొదట ఒక సినిమా చేయడం ఆ సినిమాకు అంత గుర్తింపు రాకపోవడంతో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో అతను బుల్లితెర వైపుకి రావాల్సి వచ్చింది. సీరియల్స్ లో అతను కనడంలో ఆరు సీరియల్స్ లో నటించాడు. ఈశ్వర్ కి ఎప్పుడూ వాళ్ళ అమ్మగారు అన్నింటా తోడుగా నిలుస్తారు అని, అతను బుల్లితెరకి పరిచయం అవడానికి ఒక ఇంత కారణం వాళ్ళ అమ్మగారు అని, ఈశ్వర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. విజయ్ కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇది నువ్వు చదువు పిజి వరకు కంప్లీట్ చేసి యాక్టింగ్ రంగంలో కూడా శిక్షణ పొందాడు విజయ్. 2012వ సంవత్సరంలో క్రేజీలోగా అనే కన్నడ సినిమాతో పరిచయం అయ్యాడు. 2014లో అగ్నిసాక్షి అనే కన్నడ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇతను కొన్నిటెలివిజన్ షోలకు కూడా గా యాంకర్ గా హోస్ట్ చేసారు. ఇతను ప్రస్తుతం కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే సీరియల్ ద్వారా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇందులో ఈశ్వర్ అనే పాత్రలో ఒదిగిపోయాడు విజయ్. ఈ సీరియల్ లో కళ్ళు లేని వాడిలాగా ఆక్ట్ చేయడం ఇతనికి ఒక సవాలే.కానీ ప్రతిఫేంలోనూ నిజంగా కళ్ళు లేని వాళ్ళు ఎలా యాడ్ చేస్తారు అలానే నటిస్తూ మంచి ఫ్యాన్స్ ని సంపాదించాడు విజయ్.

కళ్ళు కనిపించని అందుడి పాత్రను పోషించడం అంటే ఒక సవాలే, విజయ్ సూర్య కి చైత్ర శ్రీనివాస్ అనే అమ్మాయితో 2019లో మ్యారేజ్ అయింది. వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు. సోషల్ మీడియాలో ఎప్పుడూ విజయ్ అభిమానులతో టచ్ లోనే ఉంటారు. ఇప్పుడు ఇతను ఈ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ చేస్తూనే మరో కన్నడ మూవీ లో కూడా నటిస్తున్నాడు.

ఆ మూవీ పేరు వీరపుత్ర. సూర్య పుట్టినరోజు సందర్భంగా వీరపుత్ర మూవీ పోస్టర్ని టీం విడుదల చేసింది. ఇప్పుడు ఆ పోస్టర్ని విజయ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అతని ఫ్యాన్స్ అందరూ ఇటు సీరియల్స్, సినిమాలు రెండిటిని విజయ్ కనబడిస్తున్న నటనకి, ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఆ పోస్టర్ ని షేర్ చేస్తూ లైక్ తో షేర్ తో వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నారు. ఇప్పుడు ఆ పోస్టర్ని మీరు ఓ లుక్ వేయండి