Krishnamma Kalipindi Iddarini September 20th: ఏవండీ ఇలా రండి ఈరోజు నేను మిమ్మల్ని రెడీ చేస్తాను అని గౌరీ అంటుంది. ఏంటి చానా ఎక్కువ చేస్తున్నావ్ అని ఈశ్వర్ అంటాడు. ఎక్కువే ఉందండి భార్య భర్తకు సేవలు చేస్తే తప్పేంటి రండి ఇలా వచ్చి కూర్చోండి మీ తల నేను దూతాను అని గౌరీ తల దువ్వి ఇప్పుడు చూడండి మీరు హీరో లాగా ఉన్నారు ఈరోజు మీకు మీటింగ్ ఉంది కదా అందుకని నేను ఒక కోటు సెలెక్ట్ చేసి పెట్టాను అది వేసుకుంటే మీకు అంత శుభమే జరుగుతుంది అని గౌరీ కోటి తెచ్చి ఇస్తుంది. ఏంటి కాక పడుతున్నావు నువ్వు ఎంత చేసినా నేను క్షమించను అని ఈశ్వర్ అంటాడు. సౌదామిని ఉజ్వల అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు.

వాళ్ల రాకని గమనించిన గౌరీ ఏమండీ బటన్స్ నేనే పెడతాను అని అంటుంది. ఈ కోటు నువ్వు ఇచ్చావని నేను వేసుకోవట్లేదు కలర్ నాకు నచ్చింది కాబట్టి వేసుకుంటున్నాను అనిశ్వర్ అంటాడు. అంటే నా సెలక్షన్ మీకు నచ్చినట్టే కదా అని గౌరీ అంటుంది ఏంటి చనివిస్తే ముద్దు పెట్టన అని అడిగే లాగా ఉన్నావే అని ఈశ్వర్ అంటాడు. నేను పెడతాను అన్న నా పెదాలని మీ బుగ్గలకు తగలనిస్తారా అని గౌరీ అంటుంది. ఇంతలో ఈశ్వర్ కి ఫోన్ వస్తుంది హలో టెన్ మినిట్స్ లో వస్తాను అని అంటాడు ఈశ్వర్.

ఏంటి మమ్మీ ఇది ఇంత ఓవరాక్షన్ చేస్తుంది ఆఫీస్ లో రొమాన్స్ ఇక్కడ రొమాన్స్ చూడలేక చస్తున్నాను అని ఉజ్వల అంటుంది. అది ఆఫీసుకి వెళ్లకుండా అఖిలను రెచ్చగొడదాం పద అని సౌదామిని అఖిల దగ్గరికి వచ్చి అఖిల లే మీ అక్క రెడీ అయ్యి మీ బావతో కలిసి ఆఫీసుకు వెళ్తుంది అని అంటుంది. అమ్మో టెన్ మినిట్స్ లో రెడీ వస్తాను ఈరోజు ఎలాగైనా ఆఫీస్ కి వెళ్ళాలి ఇంటి పని తప్పించుకోవాలి అని అఖిల పరిగెడుతుంది. కట్ చేస్తే ఇంతలో ఈశ్వర్ ఆఫీస్ కి వెళ్ళొస్తాను అమ్మ అని అంటాడు. ఆగండి ఆఫీస్ కి నేను కూడా వస్తాను అని అఖిల అంటుంది. ఆఫీస్ కి నువ్వెందుకు అని సునంద అంటుంది. అక్క వెళ్తుంది కదా నేను కూడా వెళ్తాను అని అఖిల అంటుంది. వదినకి కలంకారి డిజైన్ తెలుసు కాబట్టి ఆఫీసుకు వస్తుంది మరి నీకేం తెలుసు అని వస్తాను అంటున్నావు అని ఆదిత్య అంటాడు.

ఏదో ఒకటి చేస్తాను అయినా నా భర్తతో కలిసి నేను ఆఫీసుకు వెళ్తాను అని అఖిల అంటుంది. కాదమ్మా నువ్వు వెళ్లి వాడి పని డిస్టర్బ్ చేయడం తప్ప నువ్వు అక్కడికి వెళ్లి ఏం చేస్తావో చెప్పు అని సునంద అంటుంది. నాకదంతా ఏమీ తెలియదు నేను ఆఫీసుకు వెళ్తాను అని అఖిల అంటుంది. అఖిల నీకు బుద్ధుందా అత్తయ్య గారి మాటకి ఎదురు చెప్తావా అని గౌరీ అంటుంది. నేనేమీ ఎదురు చెప్పడం లేదు ఆఫీస్ కి వెళ్తాను అని అంటున్నానుఅయినా నువ్వు ఆఫీస్ కి వెళ్తానని అనగానే అందరూ సరే అన్నారు నేను మాత్రం ఆఫీసుకు వస్తాను అనగానే అందరూ నువ్వు ఎందుకు అని అంటున్నారు నీకు న్యాయం నాకు న్యాయమా అని అఖిల్ అంటుంది. అఖిల ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు మీరిద్దరూ ఒకటే ఒక్కరోజు ఇంటి పనులు చేయగానే నిన్ను ఇంట్లో పని రోజు చేయనిస్తానని అనుకుంటున్నావా అని సునంద అంటుంది. అమ్మ తనకు ఆఫీసుకు రావాలని ఉంటే తీసుకెళ్దాం దాంట్లో పోయేదేముంది అని ఈశ్వర్ అంటాడు. అయినా నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు అని ఆదిత్య అంటాడు.

ఆదిత్యాతనేదో సరదాగా వస్తానని అంటుంది తీసుకెళ్ళు అని సునంద అంటుంది. అమ్మ గౌరీ ఇంట్లో పనిమనిషి రావట్లేదు మీరు ఇద్దరు వెళ్ళిపోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు అందుకని నువ్వు ఇంట్లో ఉండి పని చెయ్యి అని సౌదామని అంటుంది. అయ్యో పిన్ని గారు ఏమీ అనుకోకుండా ఈ ఒక్క రోజుకి ఇంట్లో పని చేయండి చెప్పకూడదని అనుకున్నాను కానీ చెప్పాల్సి వస్తుంది అని గౌరీ అంటుంది. వాళ్ళ అమ్మని చూసి ఉజ్వల కోపంతో వెళ్లిపోతుంది.కట్ చేస్తే అందరూ కలిసి ఆఫీసుకు వస్తారు రండి సార్ రండి మేడం గుడ్ మార్నింగ్ మేడం అని అందరూ అంటారు. ఏవండీ నేను ఎవరినో చెప్పండి వీళ్ళందరికీ అని అఖిల అంటుంది.మై డియర్ స్టాప్ ఈవిడ నా భార్య తన పేరు అఖిల అని ఆదిత్య పరిచయం చేస్తాడు. ఆదిత్య డెలికేట్స్ తో మీటింగ్ అరేంజ్ చేసావా అని ఈశ్వర్ అంటాడు. చేశాను సార్ 10:30 కి ఉంది అని ఆదిత్య అంటాడు. కట్ చేస్తే మిస్టర్ విజయ్ మిస్టర్ రామ్ మా టీం నుంచి ఎక్స్ప్లేషన్ విన్నారు కదా మీకు ఓకేనా అని ఈశ్వర్ అంటాడు.

సార్ మా టీమ్ అంతా ఈ ప్రొసీజర్ ని వద్దని అనుకున్నాము మళ్లీ మీరు అదే చెప్తారేంటి అని వాళ్ళు అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్ మా సార్ దానితోపాటు ఇంకోటి కూడా అనుకున్నారు కానీ మీకు మొదటిదే నచ్చుతుందని రెండోది చెప్పలేదు మీరు అనుమతిస్తే చెబుతాను అని అంటుంది గౌరీ. ఓకే మేడం అదేంటో చెప్పండి అని రామ్ అంటాడు. ఆదిత్య ఈశ్వర్ సార్ డిప్రెషన్ లో ఉన్నారు ఆ డిజైన్ గురించి నీకు తెలుసు కదా మీరు చెప్పండి అని గౌరీ అంటుంది. అది నేను కూడా సరిగ్గా వినలేదు అని ఆదిత్య అంటాడు. సరే నేనే చెబుతాను కానీ మాట తడబడితే క్షమించండి అని గౌరీ వెళ్లి రెండో ప్రాజెక్టు తీసుకువచ్చి వాళ్ళకి చూపించి ఇలా చేస్తే కచ్చితంగా చీరలు బాగా సేల్ అవుతాయి అని గౌరీ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
కమల్‌హాసన్ గొప్ప విశ్వవిద్యాలయం.. ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టం