Krishnamma Kalipindi Iddarini: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఈ సీరియల్లో ఈశ్వర్ పాత్రలో నటిస్తున్న హీరో పేరువిజయ్ సూర్య.ఇతను 1990లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించాడు. ఇతని బాల్యమంతా బెంగళూరులోనే సాగింది. ఇతను కన్నడ స్టార్ కన్నడలో కొన్ని టీవీ సీరియల్స్ లోనూ మరియు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అలా కన్నడంలో చేస్తూనే తెలుగులో కూడా కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే సీరియల్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇతను మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవాలి. ఇతనికి బాగా గుర్తింపు తెచ్చింది అగ్నిసాక్షి అనే కన్నడ సీరియల్ 2014లో ఈ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్.

ఇతను కొన్ని కన్నడ షోలలో యాంకర్ గాను హోస్ట్ గాను చేశాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్లో ఇతను కళ్ళులేని ఒక హీరో పాత్ర నటిస్తున్నాడు. కళ్ళు లేని పాత్ర చేయడం అంటే ఒక టాస్కే అయినా కానీ అలాంటి పాత్రను కూడా చాలా ఒకగా తన అందరిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పాత్రకి తగ్గట్టుగా న్యాయం చేస్తున్నాడు విజయ్. ఇతనికి 2019 లోనే మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇతని భార్య పేరు చైత్ర శ్రీనివాస్.

ఇతను కన్నడంలో ఇష్టకామ్య అనే మూవీ ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇతను కన్నడంలో ప్రస్తుతం ప్రేమలోక అనే సీరియల్ లోను, నమ్మలచ్చి అనే కన్నడ సీరియల్ లోను, తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే సీరియల్లో నటిస్తున్నాడు. వీటితోపాటు వీరపుత్ర అనే సినిమాలోని యాడ్ చేస్తున్నాడు. ఇతను ప్రస్తుతం కన్నడలో చేస్తున్న వీరపుత్ర సినిమా 60%షూటింగ్ కంప్లీట్ అయింది.మెడికల్ మాఫియా తో ఈ సినిమా రన్ అవుతుంది. గురుబంధి ఈ సినిమా ప్రొడ్యూసర్, ఎస్ దేవరాజ్ ఈ సినిమాకి డైరెక్టర్.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మోషన్ పోస్టర్ని, విజయ్ సూర్య బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 15 తారీఖున రిలీజ్ చేశారు. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇతను మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవాలి. అటు సీరియల్స్ లోను ఇటు సినిమాల్లోనూ కన్నడ టెలివిజన్స్ లోనూ రెండు వైపులా రెండు చేతుల సంపాదిస్తున్నాడు విజయ సూర్య. ఇతను స్టార్ సువర్ణ అనే కన్నడ చానల్లో, ఒక టెలివిజన్ షో లో ఒక సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ,తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు విజయ్ సూర్య. నమ్మలొచ్చి సీరియల్ ప్రమోషన్ లో భాగంగా, ఇతను ఆ టెలివిజన్ షోలో, ప్లే చేసిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో అతను ముందుగా నాకు డాన్స్ లోనూ సీరియల్స్ లో యాక్టింగ్ చేయడంలోనూ అన్నిట్లో అనుభవం ఉంది కానీ మ్యూజిక్ ప్లే చేయడంలో లేదు ఇప్పుడు నాలో ఉన్న టాలెంట్ ని మీకు చూపిస్తాను అని డ్రమ్స్ వాయించి మ్యూజిక్ ప్లే చేసి మీలో కూడా ఇలాంటి టాలెంట్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అని విజయ్ సూర్య పోస్ట్ చేశారు. ఇతని మల్టీ టాలెంటెడ్ కి అభిమానులంతా ఫిదా అవుతున్నారు ఇప్పుడు ఆ వీడియో మీరు చూసేయండి.
View this post on Instagram