NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 27 2024 Episode 608: నీలిమ నీ కొట్టిన కౌసల్య,ఆత్మహత్య చేసుకోవద్దని మాట తీసుకున్న ఆకాష్..

Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights

Malli Nindu Jabili March 27 2024 Episode 608: ఎక్కడికి వెళ్తున్నావ్ నీలిమ అని మల్లి అడుగుతుంది. బన్నీ రైస్ మిల్లు దగ్గరికి రమ్మన్నాడు వదిన వెళ్తున్నాను అని నీలిమ చెబుతుంది.ఒక ఆడపిల్లని రైస్ మిల్లు దగ్గరికి రమ్మన్నాడు అంటే అక్కడ ఏదో జరుగుతుంది నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అత్తయ్య చూస్తే ప్రాబ్లం అవుతుంది పదా ఇంటికి వెళ్దాం అని నీలిమని తీసుకొని వెళుతుంది మల్లి. కట్ చేస్తే,మాలిని వసుంధర అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. వసుంధర కూడా మాలిని అన్న మాటలు తలుచుకొని బాధపడుతుంది. ఇంకా అమ్మాయి రాలేదు ఏంట్రా ఫోన్ చేసావా లేదా అని బన్నీ వాళ్ళ నాన్న అంటాడు. నాన్న వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉన్నాయో ఏమో అందుకే తను రాలేకపోయి ఉంటుంది అని బన్నీ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights
Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights

అది ఈరోజు ఇక్కడికి రాకపోతే అక్కడికి వెళ్లి దాన్ని చంపేస్తాను గౌతమ్ నువ్వు పనిలోకి వెళ్ళవయ్యా అని బన్నీ వాళ్ళ నాన్న అంటాడు. అలాగే సార్ అని గౌతమ్ వెళ్తూ ఉండగా గౌతమ్ నీకు చెల్లెలు ఉందా ఉంటే ఇలా చేస్తే నువ్వేం చేస్తావో చెప్పు అని అడుగుతాడు బన్నీ వాళ్ళ నాన్న. నా చెల్లెలు ఇలాంటి తప్పుడు పనులు ఇచ్చేది సార్ నేనంటే చాలా గౌరవం తనకి అని గౌతమ్ వెళ్ళిపోతాడు. చూసావా రా గౌతమ్ వాళ్ళ చెల్లెలు గురించి ఎంత గొప్పగా చెప్పాడో అని బన్నీ వల్ల నాన్న అంటాడు. అంటే బావకి ఈ విషయం తెలిస్తే మా ప్రేమకి బావ ఒప్పుకోడన్నమాట అని బన్నీ ఆలోచిస్తాడు. కట్ చేస్తే, నీలిమ ఇంట్లో లేదు ఈ విషయం వెంటనే గౌతమ్ కి చెప్పాలని కౌసల్య గౌతమ్ కి ఫోన్ చేస్తుంది.మల్లి నీలిమాని తీసుకొని ఇంటికి వస్తుంది.వాళ్లని చూసిన కౌసల్య ఏమీ లేదు గౌతమ్ మాలిని నీ షాపుకు పంపించాను ఇంకా రాలేదని తనకు చేయబోయి నీకు ఫోన్ చేశాను అని కౌసల్య అంటుంది. అమ్మ రోజుల అసలే బాగోలేవు నీలిమ ని మాటిమాటికి బయటికి పంపించకు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights
Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights

ఈ కాలం పిల్లలు మారిపోయారు రా వాళ్ల ఆనందం కోసం ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదని తెగిస్తున్నారు అని కౌసల్య అంటుంది. అమ్మ నేను చాలా బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడుకుందాం అని గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు. నీలిమని లాగిపెట్టి ఒకటిస్తుంది కౌసల్య, ఇంట్లో నుంచి బయటికి వెళ్లొద్దన్నాను కదా ఎక్కడికి వెళ్లావే చెప్పు వాడితో కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నావా అని కౌసల్య అంటుంది. అత్తయ్య నేనే నీలిమని ఫోన్ చేసి గుడికి రమ్మన్నాను అని మల్లి చెబుతుంది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నవు నీవల్ల ఏదైనా జరిగితే మాత్రం నేను జీవితాంతం క్షమించను అని కౌసల్య కోపంగా వెళ్ళిపోతుంది. నీలిమ నువ్వు లోపలికి వెళ్ళు అని మల్లి అంటుంది. కట్ చేస్తే, వసుంధర ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆకాష్ వచ్చి ఏంటి ఆంటీ ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. ఏమీ లేదు ఆకాష్ మాలిని డల్ గా ఉంది పొద్దున్నుంచి అన్నం తినలేదు అని వసుంధర చెబుతుంది.

Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights
Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights

ఆంటీ ఫ్రెండ్ ని నేను అన్నం తినిపిస్తాను మీరు రండి అని ఆకాష్ మాలిని దగ్గరికి వెళ్తాడు. శంకరమ్మ భోజనానికి ప్రిపేర్ చేయని వసుంధర చెబుతుంది. ఏంటి ఫ్రెండ్ నేను రాలేదని నా మీద బెంగతో అన్నం తినడం మానేశావంట అని ఆకాష్ అంటాడు. అదేమీ లేదు నాకు ఆకలి వేయట్లేదు అందుకే తినలేదు అని మలిని చెబుతుంది. ఫ్రెండ్ నువ్వు భోజనం చేస్తే నీకు ఒక సంతోషకరమైన విషయం చెబుతాను అని ఆకాష్ అంటాడు. సరే పద అని మాలిని భోజనం చేసే దగ్గరికి వస్తుంది. ఆంటీ మీరు భోజనం వడ్డించండి అని ఆకాష్ అంటాడు. ముందు నేను సంతోషపడే విషయం ఏంటో చెప్పు అని మాలిని అంటుంది. ఏమీ లేదు ఫ్రెండ్ నేను అమెరికా వెళ్ళిపోతున్నాను ఇది నీకు సంతోషకరమైన విషయమే కదా కడుపునిండా భోజనం చెయ్ ఫ్రెండ్ నువ్వు అన్నం తినకపోతే అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటారు అని ఆకాష్ అంటాడు. మాలిని కడుపునిండా భోజనం చేస్తుంది. ఇదేంటి బాబు సడన్గా అమెరికా వెళ్తున్నావ్ అని వసుంధర అడుగుతుంది. ఫోటోగ్రాఫర్ గా వెళుతున్నాను ఆంటీ తప్పదు కదా అని ఆకాష్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights
Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights

ఫ్రెండ్ నువ్వుఇంకెప్పుడూ సూసైడ్ చేసుకోను అని నాకు మాట ఇవ్వు నువ్వు మాట ఇవ్వకపోతే నేను అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటాను అని ఆకాష్ అంటాడు. సరే ఇక మీదట నేనెప్పుడూ ఆత్మహత్య చేసుకోను అని మాలిని మాట ఇస్తుంది. ఓకే ఫ్రెండ్ వెళ్ళొస్తాను అంటూ ఆకాష్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, గౌతమ్ మొక్కజొన్న పొత్తుల దగ్గర వెయిట్ చేస్తాడు. ఇంతలో నర్స్ అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ తో వస్తుంది. హాయ్ అండి నేను మల్లి వాళ్ళ హస్బెండ్ ని మీరు అరవింద్ ని రేపు తీసుకొస్తారని చెప్పారు కదా అని గౌతమ్ అంటాడు. అవును అరవింద్ ని తీసుకొస్తే మాలిని మేడంకి ఫోన్ చేస్తానని చెప్పాను కదా అని నర్స్ అంటుంది. అంటే మేడం ఈమధ్య మల్లికి ఒంట్లో బాగోలేదు తను ఫోన్ లిఫ్ట్ చేయదు అందుకని మీ నెంబర్ నాకు ఇవ్వండి నేను ఫోన్ చేస్తాను అని గౌతమ్ అంటాడు. తన నెంబర్ ఎందుకులే నీ నెంబర్ ఇవ్వు తనే ఫోన్ చేస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. గౌతమ్ తన నెంబరు ఇచ్చి మర్చిపోకండి రాగానే ఫోన్ చేయండి నేను మల్లి వస్తాము అని గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, గౌతమ్ ఇంటికి వస్తాడు. మల్లి డోర్ తీయగానే మల్లి నీ గట్టిగా హగ్ చేసుకుంటాడు గౌతమ్. వదలండి అత్తయ్య ఇంకా పడుకోలేదు అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights
Malli Nindu Jabili Today Episode March 27 2024 Episode 608 highlights

మల్లి ని గట్టిగా హగ్ చేసుకుని అలాగే వంట గదిలోకి తీసుకువెళ్లి ఒక ముద్దు పెట్టవా అని అడుగుతాడు గౌతమ్. కాలింగ్ బెల్ మోగింది ఎవరు మల్లి అని పిలుచుకుంటూ కౌశల్య వస్తుంది. అక్కడికి వచ్చి చూసేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది మల్లికి మతిమరుపు ఎక్కువ అయింది అంటూ డోర్ పెట్టి గ్యాస్ బంద్ చేసిందో లేదో అని కౌసల్య కిచెన్ లోకి వస్తుంది. అత్తయ్య ఇటే వస్తుందండి వదిలిపెట్టండి అని మల్లి అంటుంది. అమ్మ తన రూమ్ లోకి వెళుతుంది లే కానీ నాకు ఒక ముద్దు పెట్టు అని గట్టిగా పట్టుకుంటాడు గౌతమ్.ఇంతలో కౌసల్య కిచెన్ లోకి రాగానే గౌతమ్ టీ పెడతాడు మల్లి దాక్కుంటుంది.నువ్వెప్పుడొచ్చి టీ పెడుతున్నావ్ గౌతమ్ మల్లి ఏమైంది అని అడుగుతుంది కౌశల్య. మల్లికి తలనొప్పింట అందుకే టీ పెడుతున్నాను అని గౌతమ్ అంటాడు. నీకు టీ పెట్టడం రాదు కదా నేను పెడతాను పక్కకు జరుగు అని కౌసల్య టీ పెడుతూ ఉంటుంది. దాక్కున్న మల్లి బుగ్గను గిచ్చుతాడు గౌతమ్..

Related posts

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri