NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 21 2024 Episode 310: పంచమి స్థానం నేను పొందాలి అంటున్న కరాలి, మేఘనని తీసుకొచ్చి మోక్షకి పెళ్లి చేస్తా అంటున్న వైదేహి..

Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights

Naga Panchami March 21 2024 Episode 310:  ఆ పంచమి గర్భవత తను సంతోషంగా ఉండడానికి వీల్లేదు అని కరాలి అంటుంది. స్వామి ఆశలన్నీ వదులుకున్న మాకు జీవం పోశారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని శబరి అంటుంది. ఆ ఊరు పెద్ద దగ్గర గుడిలో పూజారి దగ్గర సెలవు తీసుకొని వాళ్లు అక్కడి నుంచి బయలుదేరుతారు. పంచమి గర్భవతి అంటే ఇక నాతో నాగలోకానికి రాదు పంచమిని సంతోషంగా నేను ఉండనివ్వను అని ఫణీంద్ర పాముగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights
Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights

అన్నయ్య ఆ పంచమి గెలిచింది అన్ని పోగొట్టుకొని నేనే ఓడిపోయాను ఎంతో సంతోషంగా ఉండబోతున్న పంచమిని చూస్తూ నేను బ్రతకలేను ఆ పంచమి కన్నా నేను ఒక మెట్టు పైనే ఉండాలి అని కరాలి అంటుంది. మోక్షని సొంతం చేసుకొని ఉంటే ఆ సంతోషం నీకు సొంతం అయ్యేది కారాలి నీ పరిమిత శక్తులతో ఏం చేయగలవు అది మాత్రం ఆలోచించు అని నంబూద్రి అంటాడు. అలా జరగాలంటే పంచమి స్థానం నేను పొందాలి అన్నయ్య పంచమి ఓటమి వైపు అడుగు వేస్తుంది అని కరాలి అంటుంది. ముందు ఆ పని చెయ్ కరాలి అని నంబూద్రి అంటాడు.పంచమి ఇల్లు అలకగానే పండగ అయిపోతుందనుకోకు నీకు ఎలాంటి ఆనందం దక్కనివ్వను అని కరాలి అనుకుంటుంది.కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights
Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights

స్వామి నువ్వు తలుచుకుంటే ఈ పని ఎప్పుడో చేసే వాడివి కదా భార్యాభర్తల్ని ఇద్దరినీ ఒకటి చేసి ఉండేవాడివి ఆ పని ఎందుకు చేయలేకపోయారు అని సుబ్రహ్మణ్య వాహనమైన నెమలి అంటాడు. ఏదైనా ఊరికే వచ్చింది అంతా బాగోదు కష్టపడి సంపాదించుకున్నది ఒక్క రొట్టె ముక్క అయినా సరే సంతోషాన్ని ఇస్తుంది అలాగే పంచమి జీవితం కూడా అలాంటిదే ఇన్ని కష్టాల నుంచి దాటుకొని ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యారు అంతా దైవ నిర్ణయం మనం చేయగలిగిందేముంది అని సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాడు. స్వామి ఇక పంచమి కష్టాలు తీరిపోయినట్టే తను భర్తతో సంతోషంగా ఉంటుంది అని నెమలి అంటాడు. తన శత్రువులు పొంచి ఉన్నారు ఇకమీదటే పంచమి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది పంచమి సంతోషంగా ఉండడం తన శత్రువులకి నచ్చదు కదా నెమలి అందుకే తన చుట్టూ చెరి ఇబ్బంది పెట్టడానికి చూస్తారు అని సుబ్బు అంటాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights
Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights

పంచమిని తీసుకొని అందరూ ఇంటికి వస్తారు. మీనాక్షి ఎర్రటి నీళ్లు తెచ్చి పంచమికి మోక్షకి హారతివ్వు అని శబరి చెబుతుంది. మీనాక్షి వెళ్లి నీళ్లు తెచ్చి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది. మోక్ష పంచమి తీసుకొని లోపలికి వెళ్ళు అని శబరి అంటుంది. పంచమి ఇదంతా ఎలా సాధ్యం నీకు పిల్లలే పుట్టి అవకాశం లేనప్పుడు నువ్వు గర్భవతి ఎలా అయ్యావు నేను నమ్మలేకున్నాను అని వైదేహి అంటుంది. వైదేహి మోక్ష బ్రతికి వచ్చాడు ముందు అది గుర్తుపెట్టుకో పంచమి నిందిస్తావ్ ఏంటి చెప్పాడు కదా నాగ సాధువు శివయ్య తలచుకుంటే ఏదైనా చేయగలడని మోక్షకి ప్రాణం పోయేగా లేనిది పంచమి తల్లి కావడం పెద్ద విశేషమా అని రఘు అంటాడు. మావయ్య మీరు దీన్ని నమ్ముతున్నారు కానీ ఈ పంచమి పాము ఇదే ఏదో మాయ చేసిది టక్కులాడి నాటకమాడి గర్భవతి అంటుంది దీన్ని మాటలు నమ్మడానికి వీల్లేదు అని చిత్ర అంటుంది.

Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights
Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights

వదిన ఇంతకుముందే మికు చెప్పాను పంచమిని ఇకమీదట ఎవ్వరు ఏమన్నా ఊరుకునేది లేదు అని మోక్ష అంటాడు.పాపం ఆ మేఘనని పెళ్లి కాక ఒప్పించినట్టు ఒపించి ఇప్పుడు గర్భవతి అని నాటకం ఆడుతుంది అందుకే తను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది అని జ్వాల అంటుంది. ఇక ఆపుతారా మీరు ఈ పాముల గోల ఎప్పుడు చూసినా పంచమి తిట్టడమే కానీ ఇంకోటి లేదా మోక్ష ప్రాణాలతో బతికి వచ్చాడంటే అదంతా పంచమి పుణ్యమే అని భార్గవ్ అంటాడు.మోక్ష చావు బతుకుల మధ్యలో ఉండగా మనమందరం ఆశలు వదులుకున్నాం పంమి నమ్మకంతో శివయ్య బతికిస్తాడని అక్కడికి తీసుకువెళ్ళింది మోక్ష అని బ్రతికించుకుంది ఇప్పుడు తనని ప్రశ్నించే అధికారం మనకు లేదు అని వరుణ్ అంటాడు. పంచమి మా వంశంలో నాగ గండన్ని తప్పించి మా వంశాన్ని కాపాడావు ఈ గణతంత్ర నీకే దక్కుతుంది అని శబరి అంటుంది.

Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights
Naga Panchami Today Episode March 21 2024 Episode 310 highlights

ఇలా మెచ్చుకొని దాని నెత్తికెక్కించుకోకండి ఇక మమ్మల్ని అడగదొక్కాలని చూస్తుంది అని చిత్ర అంటుంది.మోక్ష పంచమిని తీసుకొని వెళ్ళు వీళ్ళెప్పుడు ఇలాగే మాట్లాడుతారు  అని మీనాక్షి అంటుంది. నాకు సమాధానం చెప్పి కదులు పంచమి అని వైదేహి అంటుంది. ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అమ్మగారు అంత ఆ శివయ్య దయ అని పంచమి అంటుంది. పంచమి మేఘన ని  పెళ్లి పీటలు దాకా తీసుకువచ్చావ్ తనని కాదంటే తను ఎంత బాధపడుతుంది మేఘన ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొచ్చి మోక్షకి పెళ్లి చేస్తాను అని వైదేహి అంటుంది.అయితే మోక్ష ప్రాణాలతో బ్రతికి వచ్చాడని సంతోషించకుండా ఏంటి ఈ పంచాయతీ మోక్ష పంచమిని తీసుకుని లోపలికి వెళ్ళు అని రఘు అంటాడు.కట్ చేస్తే,

మోక్ష బాబు ఇదంతా నాకు ఒక కలలా ఉంది నేను మళ్లీ నీతో కలిసి ఇంటికి వస్తాను అనుకోలేదు అని పంచమి అంటుంది. నా ప్రాణాల మీదికి వచ్చిన సరే మనకు మేలే జరిగింది పంచమి అని మోక్ష అంటాడు. మీ ప్రాణాలు పోయి ఉంటే నేను అక్కడికక్కడే ప్రాణం విడిచి మీవెంటనే వచ్చేవాదని మోక్ష బాబు అని పంచమి అంటుంది. పంచమి ఇక మనకు అలాంటి అవసరమే లేదు నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు నువ్వు నాగలోకం వెళ్లే దారి కూడా మూసుకుపోయింది అని మోక్ష అంటాడు.  మన బిడ్డ రూపంలో మనకు ప్రమాదం పొంచి ఉంది మోక్ష బాబు అని పంచమి అంటుంది…

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri