NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: కృష్ణ మీద విక్కీకి అనుమానం.. అను మీద కుచల కోపం..

Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 351ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 352 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతిని కృష్ణ బెదిరించడాన్ని, విక్కీ రూమ్ బయట నుంచి వింటాడు. విక్కీకి అనుమానం వస్తుంది.పద్మావతిని అడిగితేనిజం చెప్పకుండా వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights
Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights

Nuvvu Nenu Prema: పద్మావతి,కృష్ణ ని ప్రేమిస్తునట్టు ఊహించుకున్న విక్కీ.. విక్కీ ని ప్రేమిస్తున్నట్లు,చెప్పాలని అనుకున్న పద్మావతి…

ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతి ఆర్య చెప్పులు, దాచి పెట్టి, ఆట పట్టిస్తూ ఉంటుంది. చెప్పులు ఇవ్వాలంటే నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి ఇస్తాను అని అంటుంది. 10,000 ఇవ్వు అని కుచల చెప్తుంది. నారాయణ 10,000 ఇవ్వడానికి, సరే అన్నా పద్మావతి ఒప్పుకోదు, 10 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తుంది. కుచల లక్షల్లో ఇవ్వడానికి మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం చెప్పులు కాకపోతే చెప్పులు ఫ్యాక్టరీ అయినా పెట్టుకోవచ్చు అని అంటుంది. నీకేం కావాలో చెప్పమ్మా అని అంటాడు నారాయణ, డబ్బు లేకపోతే బంగారం అయినా ఇవ్వండి అని పద్మావతి ఫ్రెండ్ అంటుంది. బంగారాలు ఇవ్వడానికి మేము ఎలా కనిపిస్తున్నామని, కుచల అంటుంది.

Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights
Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights

Brahmamudi Serial జూలై 3rd 138 ఎపిసోడ్: ఆఫీస్ లో రాజ్ సమస్య ని పరిష్కరించిన కావ్య.. ఆ తర్వాత రాజ్ రియాక్షన్ ఏమిటంటే!

పద్మావతి మీద విక్కీ ప్రేమ..

చెప్పులు తీసుకొని డబ్బులు డిమాండ్ చేయడం, ఎంత వాడికి కరెక్టు అని కుచల పద్మావతి మీద కోప్పడుతూ ఉంటుంది. అరవింద, పద్మావతి మాట మీద నిలబడుతుంది ఎంతోకొంత ఇస్తే గాని ఇప్పుడు మనకి చెప్పులు ఇవ్వదు, ఏదో ఒకటి ఇచ్చి పద్మావతి నుంచి ఎప్పుడు తీసుకోవాలి అని అంటుంది. అదే టైమ్ కి అక్కడికి విక్కీ వస్తాడు. ఏంటి గొడవ అని అడుగుతాడు. పద్మావతి ఆర్య చెప్పులుదాచి పెట్టింది ఇవ్వమంటే డబ్బులు గానీ బంగారం గానీ ఇవ్వమని అడుగుతుంది. నువ్వు ఏదో ఒకటి చెప్పు అని అంటుంది అరవింద. పద్మావతి దగ్గరికి వెళ్లి నీకేం కావాలి పద్మావతి బంగారమే కదా కావాల్సింది అని, నీకు కావాల్సింది ఏది నేను కాదని పద్మావతి అని తన మెడలో ఉన్న చైన్ తీసి పద్మావతికి ఇస్తాడు. అక్కడే కృష్ణ రగిలిపోతూ ఉంటాడు. అందరూ సంతోషపడతారు పద్మావతి ఆ చెన్ తీసుకుంటుంది. ఆర్య కి చెప్పులు తీసుకొచ్చి ఇస్తుంది. పద్మావతి మీద విక్కీ కున్న ప్రేమను చూసి అరవింద, చాలా సంతోషపడుతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి పద్మావతి వికీకి చాలా ఇష్టమైన గొలుసుని ఎవరికీ ఇబ్బందా అని నీకు ఇచ్చాడు అని అంటుంది. పద్మావతి ఆగులుసు వేసుకుని చాలా మురిసిపోతుంది.

Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights
vNuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights

Krishna Mukunda Murari: క్రిష్ణ దగ్గర ముకుంద డైరీ చూసిన మురారి.. సూపర్ ట్విస్ట్

పెళ్లి మొదలు..

పంతులుగారు పెళ్లి కొడుకుని మండపం మీదకు తీసుకురండి అమ్మ, పెళ్లికూతురు అమ్మ నాన్న వచ్చి పెళ్లి కొడుకు బట్టలు పెట్టండి అని అంటాడు. ఆర్య మండపం మీదకి వెళ్తాడు. పార్వతి భక్త ఇద్దరు భార్యకి బట్టలు పెడతారు. పెళ్లికూతురుని మండపం వెదకు తీసుకురండి అని అంటాడు పంతులుగారు. అను రెడీ అవుతూ ఉంటుంది. పద్మావతి పార్వతి అను ని తీసుకురావడానికి వెళ్తారు. ఇక అరవింద కృష్ణ ఇద్దరు బట్టలు మార్చుకోవడానికి రూమ్ కి వస్తారు.

Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights
Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights

అరవింద మీద కృష్ణ కపట ప్రేమ..

కృష్ణ అరవింద సెలెక్ట్ చేసిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకొని వస్తాడు. ఎందుకండీ నేను సెలెక్ట్ చేసింది కాకుండా వేరే వేసుకున్నారు అని అంటాడు. ఇప్పటికే నేను నీ స్థాయిని కాకపోయినా కానీ నన్ను పెళ్లి చేసుకున్నావు కదా రాణమ్మ ఇక ఈ బట్టల్లో ఏముందిలే అని అంటాడు. ఎందుకండీ అలా మాట్లాడుతున్నారు నేను ఈరోజు అయినా మిమ్మల్ని ఏమన్నా అన్నానా, స్థాయిలు గురించి మాట్లాడాల్సిన పని ఉంది అని అంటుంది అరవింద.మీరు ఎప్పుడూ,బాగుండాలనేదే నా కోరిక అని అంటుంది అరవింద.మీరు గనక నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకో పోతే నేను కూడా వేసుకోను అని అంటుంది.లేదురా నెమ్మ నువ్వు ఎప్పుడు మహారాని లా నే ఉండాలి నీ కోసం నేను వేసుకుంటాను అని అంటాడు. అదే టైం కి కృష్ణ చేతికి ఉన్న బ్రాస్లెట్ కనపడకుండా ఉంటుంది. మీ బ్రాస్లెట్ ఏమైందండీ అని అడుగుతుంది అరవింద ఇక్కడే ఉండాలి రానమ్మ చేతికి ఉండాలి ఎక్కడో పడిపోయినట్టుంది అని అంటాడు.

Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights
Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights

విక్కీకి కృష్ణ మీద అనుమానం..

అదే టైం కి రూమ్ లోకి కృష్ణ వస్తాడు. ఏంటి బాబాయ్ ఇది వెతుకుతున్నట్టు ఉన్నారు అని అంటాడు. మీరు వెతుకుతున్నది దీని కోసమే కదా అని బ్రాస్లైట్ తీసి చూపిస్తాడు. ఒకసారిగా కృష్ణ షాక్ అవుతాడు అవును దీని గురించి వెతుకుతున్నామని అంటుంది అరవింద. నీకు ఎక్కడ దొరికింది విక్కీ అని అంటుంది అరవింద. పద్మావతి రూమ్లో అని చెప్తాడు విక్కీ. అప్పటికే కృష్ణ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు విక్కి, దీంతో కృష్ణ ఏంటి నా గురించి విక్కీకి తెలిసిపోయిందా అని భయపడుతూ ఉంటాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు ఇది పద్మావతి రూమ్లో ఎందుకు పడింది అని అడుగుతాడు. ఏం చెప్పాలని కొంచెం సేపు ఆలోచించి, మావయ్య వాళ్ళు ఏవో పెళ్లి పనులు చెప్పారు కదా అవి చేయబోతుంటే అక్కడ పడిందేమో అని అంటాడు. అంతే అని, కవర్ చేయబోతాడు. కానీ విక్కీ మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటాడు. విక్కీ బ్రాస్లైట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights
Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights
ఆర్య సిద్దుల అల్లరి..

ఆర్య బట్టలు మార్చుకోవడానికి రూమ్ లోకి వస్తాడు.అక్కడే ఉన్న సిద్దుతో పొద్దున్నుంచి ఏమీ తినలేదు రా, చాలా ఆకలిగా ఉంది ఏదైనా జ్యూస్ ఉంటే బాగుండు తాగడానికిఅని సిద్దు అని అడుగుతాడు ఆర్య.వెంటనే సిద్ధూ ఆర్య కోసం జ్యూస్ తీసుకుని వస్తాడు. ఇంత త్వరగా ఎలా తీసుకొచ్చావు రా అని అంటాడు. ముందు నువ్వు తాగు బ్రో అని అంటాడు సిద్దు.తాడు కట్టడానికైనా ఓపిక ఉండాలి కదా తాగు అని అంటాడు సిద్దు. అది తాడు కాదురా, తాళి కట్టడానికి అనాలి అని అంటాడు ఆర్య. అదే ఏదో ఒకటి లేని ముందు తాగు అని అంటాడు. ఆర్య జ్యూస్ తాగుతూ నాకేం తాకలిగా ఉందంటే ఆకలిగా ఉందో అని అంటాడు. అయితే జ్యూస్ తీసుకెళ్లి అను కి ఇచ్చేసి రా అని అంటాడు సిద్దు. నేను వెళ్తే మా అమ్మ చూసిందనుకో ఇంకేం లేదు గోల చేస్తుంది. ఆంటీ ఏమైనా చెప్పి వెళ్దామా ఏంటి అని అంటాడు సిద్దు. నేను చూసి తీసుకొస్తాను నువ్వు అను రూమ్ కి వెళ్లి ఇచ్చేసి రా అంటాడు సిద్దు.

Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights
Nuvvu Nenu Prema 3 july 2023 today 352 episode highlights

Read More: బీఆర్ఎస్ కి బూస్ట్ .. కాంగ్రెస్, బీజేపీలకు షాక్..?

కుచల అను మీద కోపం..

సిద్దు చెప్పినట్టుగానే ఆర్య జ్యూస్ క్లాస్ తీసుకొని అను రూమ్ కి వెళ్తాడు. నీకోసమే జ్యూస్ తీసుకొచ్చాను నీకు ఆకలిగా ఉంటుంది కదా అని అంటాడు. మీరు ఎందుకు వచ్చారండి ఇప్పుడు మీ అమ్మగారు గాని చూశారంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది వెళ్లిపోండి అని అంటుంది అను. బయట సిద్దు ఉన్నాడు లే నువ్వు తాగు అని అంటాడు ఆర్య. మా అమ్మ వచ్చేటట్టు అయితే సిద్దు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు నేను బయటికి వెళ్లిపోతాను నువ్వు దాని గురించి ఆలోచించకుండా జ్యూస్ తాగు అని అంటాడు. సరే అని జ్యూస్ తాగుదాం అనుకుంటుంది. నేనే నీకు జ్యూస్ పెడతాను కూర్చో అని అను నీకు కూర్చోబెట్టి ఆర్య జ్యూస్ తాగిస్తూ ఉంటాడు. సిద్దు కి ఫోన్ వస్తే రూమ్ బయట నుంచి పక్కకు వెళ్తాడు. ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపుగా కుచల వస్తుంది. అంతే ఒకసారిగా వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. వెంటనే రూమ్ లోకి వచ్చి గోల చేయడం మొదలు పెడుతుంది. వాడికంటే బుద్ధి లేదు ఆడదానివి నువ్వు అయినా చెప్పాలి కదా మీరిద్దరూ పెళ్లి అయ్యేదాకా కలుసుకోకూడదు అని చెప్పాను కదా అని అంటుంది కుచల. అమ్మ అది అను తప్పేం లేదు నేనే అని కోసం చూసి తీసుకొచ్చాను అని అంటాడు ఆర్య.

నువ్వే మాట్లాడకు ఆర్యా జ్యూస్ తీసుకొచ్చావా జ్యూస్. ఈవిడ గారు ఏం కష్టపడి పోయిందని చూసి తీసుకురావడానికి అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఇదే చివరిసారిగా చెప్తున్నాను నా కొడుకుని వాళ్ళు వేసుకోవాలని ప్రయత్నం చేయకు ఏమన్నా అంటే ఫ్యామిలీ మొత్తం ఏడుస్తారు మళ్ళీ అని, ఇకనుంచి ఆర్యను తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది.అను కూర్చొని బాధపడుతూ ఉంటుంది.ఇక పద్మావతి కూడా రూమ్ లో విక్కిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా విక్కీకి నిజం చెప్పేయాలి నన్ను ప్రేమిస్తున్నట్లు అని అనుకుంటుంది పద్మావతి. ఒక పేపర్ మీద తనని క్షమించమని తనను ప్రేమిస్తున్నట్లు రాసి రూమ్ లో పెడుతుంది.రేపటి ఎపిసోడ్ లో,పెళ్లి జరుగుతూ ఉంటుంది.పద్మావతికి కృష్ణ సైగ చేస్తాడు,పద్మావతి పెళ్లి మండపం నుంచి కిందకు వెళుతుంది. ఇదంతా విక్కీ చూస్తూ ఉంటాడు. పద్మావతి ఎందుకు బావ సైగ చేయగలరని కిందకి వెళ్ళింది వీళ్లిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటాడు విక్కీ.

Read More: గోవింద నామస్మరణతో మారుమోగిన సింహచలం పుణ్యక్షేత్రం. .గిరిప్రదక్షిణలో భక్తుల కోలాహలం

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella