NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ కి బూస్ట్ .. కాంగ్రెస్, బీజేపీలకు షాక్..?

తెలంగాణలో సీఎం కేసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మూడో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ విజేతగా నిలవాలని భావిస్తొంది. అందు కోసం కేసిఆర్ తన చాణిక్య నీతికి పదును పెడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ అండ దండలతో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్,  బీఆర్ఎస్ పార్టీలలో అసంతృప్తులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుత శాసనసభలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా, ఇందులో ఒకరు రాజాసింగ్ ను వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో అసెంబ్లీలో బీజేపీ బలం రెండుకు పడిపోయింది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ధీటుగా అభ్యర్ధులను రంగంలోకి దించి ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 50 స్థానాలు కైవశం చేసుకోవడం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయాలు సాధించడంతో ఇక బీజేపీ బలపడిపోయింది. దీంతో అధికారంలోకి వచ్చేది తామే, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నట్లుగా ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

 

అయితే బీజేపీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు నెలకొనడం, బీజేపీ కేంద్ర నాయకత్వం బీఆర్ఎస్ విషయంలో దూకుడుగా లేకపోవడంతో ఆ పార్టీ నేతల్లోనే నైరాశ్యం నెలకొని ఉంది. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనే భావనను కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకువెళ్లడం, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దెబ్బతినడంతో బీజేపీలో చేరికలు ఆగిపోయాయి. ఇక కాంగ్రెస్ పార్టీ .. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ జోష్ తో తెలంగాణలోనూ అధికారం తమదే అన్న రీతిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో గ్రూపు రాజకీయాలను పక్కన బెట్టి సమైక్యంగా పార్టీ గెలుపునకు కృషి చేయాలన్న నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వచ్చారు. బీఆర్ఎస్ కు ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. రీసెంట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్లు గా ప్రకటించారు.

 

రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉండగా, తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ – నవభారత్ విడుదల చేసిన సర్వే నివేదిక బీఆర్ఎస్ పార్టీకి బూస్టప్ ఇవ్వగా, కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చేలా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో  బీఆర్ఎస్ కు 9 నుండి 11 ఎంపీ స్థానాలు కైవశం చేసుకుంటుందని పేర్కొంది.  తెలంగాణలో 17 లోక్ సభ స్థనాలు ఉండగా, సీఎం కేసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు 37 శాతం ఓట్లతో 9 నుండి 11 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 29.2 శాతం ఓట్లతో కాంగ్రెస్ రెండు నుండి మూడు స్థానాలు, 25.3 శాతం ఓట్లతో బీజేపీ 3 నుండి 5 స్థానాలు సాధించవచ్చని తెలిపింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 స్థానాలు కైవశం చేసుకోగా, 2019 ఎన్నికల్లో 9 స్థానాలు కైవశం చేసుకుంది. ఈ సర్వే నివేదికను బట్టి చూస్తే గత ఎన్నికల కంటే బలం ఏమీ తగ్గలేదు అన్నట్లుగా ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే బీఆర్ఎస్ కు బీజేపీ లోపాయికారీ సహకారం అందిస్తుందన్న వాదన లేకపోలేదు. ఎందుకంటే ..టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించని వరకూ కేంద్రంలో బీజేపీకి అనధికార మిత్రపక్షంగానే టీఆర్ఎస్ వ్యవహరించింది. రాజ్యసభలో పలు కీలక బిల్లుల ఆమోదానికి అనుకూలంగా ఓటు వేసింది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టైమ్స్ నౌ నవభారత్ సర్వే నివేదిక విడుదల కావడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ సర్వే అంచనాలు నిజమవుతాయా లేదా అనేది తెలియాలంటే ఆరు నెలలు ఆగాల్సిందే.

Rahul Gandhi: కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే – రాహుల్

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?