Trinayani October 24 Episode 1066: నలుగురు పిల్లలకు ఒకేసారి పాలించింది ఇది సాధ్యమవుతుందా అఖండ స్వామి అని వల్లభ అంటాడు.వచ్చింది జగన్మాత రా కాలు మోపితేనే భూమండలం దుని కనికలంలా ఉంటుంది అలాంటిది నలుగురు పిల్లలని ఒడిలోకి తీసుకోవడం కష్టమా అని అక్కడ స్వామి అంటాడు.పాలు ఇవ్వడానికి వచ్చిన తల్లి పాలిచ్చి వెళ్ళిపోయింది అంటే మమ్మల్ని క్షమించినటేగా స్వామి అని తిలోత్తమ అంటుంది. నైని భక్తికి మెచ్చి వచ్చింది తప్ప నీకు విముక్తిని కలిగించడానికి కాదు అదే కోరుకుంటే మిమ్మల్ని ముక్కలు చేసి గద్దలకు వేసేది జాగ్రత్తగా ఉండండి అని అఖండ స్వామి అంటాడు.కట్ చేస్తే రేయ్ ఇంజన్ ఆఫ్ చెయ్ అని తిలత్తమ అంటుంది.

స్వామీజీ ఆలోచన పడ్డట్టున్నారు ఏమి మాట్లాడలేదు అని వల్లభా అంటాడు.ఏం మాట్లాడుతారో విందాం మనం కారులో ఉన్నట్టు తెలియదు అని తిలోత్తమంటుంది.స్వామి అందరూ అర్థం చేసుకోలేక నేను ఎన్నిసార్లు అడిగినా నాకు సరైన మార్గం చూపియట్లేదు అపచారం చేసి ఉంటే మన్నించాలి అని అని నైని అంటుంది.అదేమీ లేదమ్మా అని స్వామి అంటారు. పెద్దలు మీరే అమ్మ అన్నప్పుడు నా కన్న బిడ్డ గాయత్రి దేవి ని ఇంతవరకు మేము చేరుకోలేక పోయాము మేము ఎప్పుడు కలుసుకుంటాము చెప్పండి అని నైని అడుగుతుంది. అది అంతా విశాల్ చేతిలోనే ఉందమ్మా అని స్వామీజీ అంటాడు. అంటే గాయత్రి ఎక్కడ ఉందో మీకు తెలుసా బాబు గారు అని నైని అంటుంది. ఇంకో రెండు మూడు నెలల్లో మనము అమ్మ జాడ తెలుసుకుంటాము నైని అని విశాల్ అంటాడు. అవునా బాబు గారు మీరే మీ అమ్మని వెతికి తీసుకొస్తారా ఇది నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు అని నైని అంటుంది.

నీ కళ్ళ ముందే ఉన్నా అర్థం కావట్లేదు నైని అని స్వామీజీ చెప్పకనే చెప్తాడు. తన కళ్ళ ముందు ఏముంది మమ్మీ విశాల్ చేతులు అనాధ పిల్ల అయినా గాయత్రి ఉంది అని వల్లభ అంటాడు. రేయ్ నైనీకే కాదురా మనకు కూడా అర్థం కావట్లేదు స్వామీజీ మాటలు అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే సుమన దురంధరతో మొహానికి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటుంది.ఏ సుమ్మి కొంచెం కాళ్లు కిందికి పెట్టొచ్చు కదే అని దూరందర అంటుంది. దేనికి పిన్ని ఇలా కూర్చుంటూనే కంఫట్ గా ఉంటుంది అని సుమన అంటుంది. పెద్దవాళ్ళం మేము వచ్చినప్పుడు లేవకపోయినా అల్లుళ్ళు వచ్చినప్పుడైనా ఆ కాళ్లు సక్రమంగా పెట్టుకో అమ్మ అల్లుళ్లు ఫీలవుతారు అని పావన మూర్తి అంటాడు.

అంటే చిట్టి మాత డబ్బులు వస్తే సుమనకి కళ్ళు మాత్రమే కాదు కాళ్లు కూడా నెత్తికెక్కాయి అంటారు అని ఎద్దులయ్య అంటాడు. ఆ మాట వినగానే డమ్మక నవ్వుతుంది. వాడు జోకు వెయ్యడం ఇది నవ్వడం చాలా బాగుంది అని సుమన అంటుంది. సుమన ఏం మాట్లాడుతున్నావ్ చిన్న పెద్ద తేడా ఉండక్కర్లేదా అని నైని కోపంగా అంటుంది. నువ్వు పక్కకు జారుగత్త దాని చెంప పగలగొడతాను అని విక్రాంత్ అంటాడు. పెళ్లయిందో కాలేదో తెలియదు బిడ్డల్ని కన్నదో లేదో తెలియదు అలాటీ డమ్మక్కని అనగానే మీకు అందరికీ కోపం వచ్చింది కానీ ఎద్దులయ్య నన్ను ఎగతాళి చేసి మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటి అని సుమన అంటుంది.

కనకుండానే తల్లి అయ్యావు కాబట్టి నీకు ఉలోచి అంటే అంత చులకన అయిపోయింది అందుకే తల్లితనం అంటే నీకు తెలియట్లేదు అయినా నీకు ఎందుకు తెలుస్తుందిలే ఎప్పుడైనా ఉలోచి కి ప్రేమగా పాలు ఇచ్చావా అని డమఅక్క అంటుంది. ఆ మాట వినగానే సుమనకి ఎక్కడలేని కోపం వచ్చి డమ్ముక్కని చేయి చేసుకోబోతుంది. సుమన చిన్నంతరం పెద్ద అంతర o లేకుండా డమ్మకం మీదకి చెయ్ లేపుతావా నువ్వు మనిషివా పశువా అని నైని సుమన మీదికి చేయలేపుతుంది. ఆగండి కొట్టుకోకండి అని విశాల్ అంటాడు. రేయ్ వాళ్ళు అక్క చెల్లెలు ఏమైనా చేసుకుంటారు నీకెందుకురా గమ్మునుండు అని వల్లభ అంటాడు. నైనీ నీ పక్కకి నెట్టేసి దురంధర సుమన చంప చడేల్ అనిపిస్తుంది. పిన్ని అక్క కొడుతుంది అనుకుంటే నువ్వు కొట్టావ్ ఏంటి అని సుమన అంటుంది. నిన్ను కొట్టడానికి నైని ఎందుకు నేను కొడితే చాలు డమ్మక్క ఎవరనుకున్నావే శివ భక్తురాలు వాళ్ళని ఏమైనా అంటే కళ్ళు పోతాయి అని దురంధర అంటుంది. అత్త కొట్టింది చాలా నేను కూడా కొట్టాలా నోరు మూసుకొని ఉండు ఇంకెక్కువ మాట్లాడమంటే బాగోదు అని విక్రత్ వార్నింగ్ ఇస్తాడు సుమనకి. మీరేమీ సుమను కొట్టొద్దు మాత తన మొహానికి ఉన్న దంతా పోవాలి అంటే మాకు క్షమాపణ చెప్పాలి అప్పటిదాకా తన మొహం అలాగే ఉంటుంది అని ఎద్దులయ్య అంటాడు. అయినా సుమన ఇంత రాత్రి వేళ ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం నీకేంటి అని విశాల్ అంటాడు. అందంగా ఆరోగ్యంగా ఉండాలనుకోవడం తప్ప విశాల్ అలా మాట్లాడతావ్ ఏంటి అని తిలోత్తమ అంటుంది.

అందంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదమ్మా కానీ ఇలా పెద్దలను తక్కువ చేసి మాట్లాడడమే బాగోలేదు డబ్బుందని పొగరు ఎక్కువయ్యింది దీనికి అని విక్రాంత్ అంటాడు. రేపు పండగ అని కోటి రూపాయలు పెట్టి షాపింగ్ చేశాను అందంగా ఉండాలని గోల్డ్ ఫేషియల్ చేపించుకుంటున్నాను దానికి ఇంతలా అరుస్తారేంటి ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అని సుమన అంటుంది. అయినా ఇప్పుడు మొఖానికి అది వేసుకుంటే పక్కలో ఉలోచి ఉంటుంది కదా తనకి పాలు ఎలా పడతావు తను నీ మొహాన్ని చూస్తే భయపడదా అని నైని అంటుంది.ఇప్పుడు రాత్రి వేళా అయింది కదమ్మా పాముగా ఉంటుంది కదా ఏ మంచం కిందనో సందులోనూ దూరి ఉంటుంది అని ఇలా చేసి ఉంటుంది అని ఎద్దులయ్య అంటాడు. ఇప్పుడు ఉలోచి గొడవ ఎందుకు కానీ ఎద్దులయ్య సుమన మొహం మంచిగా కావాలంటే ఏం చేయాలి అని నైని అంటుంది. ఏముంది మాత మాకు క్షమాపణ చెబితే కానీ తన మొహం బాగోదు అని ఎద్దులయ్య అంటాడు. సుమన ఎద్దులయ్య చేతులు పట్టుకొని డమ్మక్క కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు నీ మొహాన్ని మళ్లీ తిరిగి ఇంతకుముందులా ఉంటుంది అని నైని అంటుంది. నేను ఇప్పుడు సారీ చెప్పను అని తిలోత్తమ అంటుంది. అమ్మ సుమన బదులు నువ్వెందుకు అంటున్నావ్ అమ్మా అని వల్లభ అంటాడు.

నా పద్ధతులు పాటించే వాళ్లకు నేను సపోర్ట్ చేస్తాను రా వాళ్లకి నా ఆయుషు కూడా ఇస్తాను అని తిలోత్తమ అంటుంది. అమ్మ దీన్ని కూడా నీలాగే తయారు చేద్దామనుకుంటున్నావా ఇప్పటికే దీని అహంకారతో చచ్చిపోతున్నాను ఇంక నీలా తయారైతే నేను వేగడం కష్టం అని విక్రాంత్ కోపంగా అంటాడు. నీకు ఇక్కడ ఆయుష్షు ఉంది నువ్వు త్వరలోనే చనిపోతావు కదా అని హాసిని అంటుంది. అది సరేగాని ఇప్పుడు సుమన మొహం ఎలా మామూలుగా మారుతుంది అని నైని అంటుంది. ఏముంది నీళ్లతో కడిగేసుకుంటే అదే పోతుంది అని సుమన అంటుంది. ఏది ఒకసారి కడుగు చూడు చెల్లి అని హాసిని అంటుంది. సుమన మొహం ఎన్ని నీళ్లు పోసి కడిగినా మామూలుగా అవదు ఏంటి ఇది అని షాక్ అవుతుంది సుమన. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా హాసినికి ఒక ఫోన్ వస్తుంది.
అన్నోన్ నెంబర్ అని ఫోను ఎత్తి మాట్లాడితే అవతల నుంచి ఎవరూ మాటలు వినపడవు ఎవరో నెంబర్ ఇది కొత్తదిగా ఉంది విశాల్ అని హాసిని అంటుంది. ఎవరో ఏమోలే వదినా కొత్త నెంబర్ అంటున్నావ్ కదా కట్ చెయ్ అని విశాల్ అంటాడు. నువ్వు మాట్లాడేది ఫోన్లో వినపడుతుంది విశాల్ ఏంటి విచిత్రం ఇది నీ నెంబర్ కూడా కాదు కొత్త నెంబరు ఎవరు మాట్లాడట్లేదు కానీ నీ గొంతు ఎలా వినపడుతుంది అని హాసిని తెల్లబోతుంది. ఏమోలే వదినా నువ్వు అయితే ముందు ఫోన్ కట్ చెయ్ తర్వాత చూద్దాం అని విశాల్ అంటాడు. హాసిని ఫోన్ కట్ చేయగానే ఒక వీడియో మెసేజ్ వస్తుంది ఏంటని ఓపెన్ చేసి చూసింది హాసిని అది చూసి కంగారుపడుతూ వీడియో కట్ చేసింది ఏమీ లేదు వాట్సాప్ లో ఏవో పనికిరాని వీడియోలన్నీ వస్తూ ఉంటాయి అని హాసిని కవర్ చేస్తుంది ఎవరికి డౌటు రాకుండా. ఏయ్ ఏదో మెసేజ్ నీకు సంబంధించింది కాకపోతే నువ్వు ఎందుకు అలా కంగారు పడతవ్ ఏది ఒకసారి చూపించు అని వల్లభ అంటాడు.
ఏమీ లేదు ఇప్పుడు దీని గొడవ ఎందుకు సుమ్మన సంగతి చూడండి అని హాసిని అంటుంది. చెప్పు ఎద్దులయ్య తన మొహం మామూలుగా అవ్వాలి అంటే సారీ చెప్పకుండా ఇంకేం చేయమంటావు అని నైని అంటుంది. ఏముందమ్మా చేతులు కాకుండా కాళ్లు పట్టుకొని సారీ చెప్పమను అని పావన మూర్తి అంటాడు. చేతులు కాకుండా కాళ్లు పట్టుకొని సారీ చెప్పమంటున్నావ్ ఏంటి అని తిలోత్తమ అంటుంది. నావి చేతులు పట్టుకున్న కాళ్ళేనే అనుకుంటాను లే అమ్మ అని ఎద్దులయ్య అంటాడు.ఓ నువ్వు ఎద్దు అని ఒప్పుకుంటున్నావా దకే నాలుగు కాళ్లు ఉంటాయి అనీ సుమన అంటుంది. సుమన ఆయనని అంత మాట అంటావా అన్నయ్య అనుకోని సారీ చెప్పమంటే మితిమీరి మాట్లాడుతున్నావేంటి అని కోపంగా చూస్తూ అంటుంది. విశాల్ ఈ గొడవ ఇప్పుడు తెగదు గానే నా ఫోన్ ఏదో షేక్ అవుతుంది ఒకసారి చూసి ఇవ్వు అని హాసిని విశాల్ కి ఫోన్ ఇస్తుంది. అలాగే వదిన అని విశాల్ పక్కకు వెళ్లి పోతాడు. విశాల్ న్నే గమనిస్తున్న వల్లభ అమ్మని తీసుకొని అమ్మ తమ్ముడు ఏదో చూస్తున్నాడు నీ కుడివైపుకు ఒకసారి తిరిగి చూడు అని అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది